Wednesday, June 30, 2021

DHYAAET IPSITA SIDHDHAYAET-07

 


  ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-07

   ***********************


 వర్షాకాలం ప్రారంభమైనది.పొలమును దున్నుతున్నారు.అంతే బీడునేల పంటభూమిగా మారబోతున్నది.చుట్టు ఉన్న కలుపు మొక్కలను తీసిపారేస్తున్నారు రైతులు.అవి మొక్కలుగా కనిపిస్తున్న పంట విద్రోహక శక్తులు.నేలసారమును స్వీకరించి పంటకు సారమునందనీయని అడ్డంకులు.


 ఒక విధముగా ఆలోచిస్తే మన విశేషములు అంతే.సామాన్యమును కననీయని అడ్డంకులు.ఏ విధముగా రైతు వానిని తీసివేస్తున్నాడో అదే విధముగా 

మనము సామాన్య విశేషముల నుండి విసేషములను తొలగించుకొనుటకు ప్రయనించాలి.ఒక్కసారి మాత్రమే కాదు.ఏవిధముగా రైతు ధాన్యమును నూర్చి తప్పగింజలను తూర్పారపదతాడో అదే విధముగా.తప్పగింజలు తప్పుకొనేలా చేసుకోవాలి.


  మన చుట్టు-మన మనసు చుట్టు ఎన్నో గజబిజి ఆలోచనలు ఆవరించి,పరిస్థితులుగా పరిణామము చెందుతు మనలను ప్రశ్నిస్తూనే ఉంటాయి.వాటిలో సమాధానమీయవలసిన యోగ్యత అన్నింటికి ఉండదు.వాటిలో కొన్ని మన సాధనకు అనుకూలములు-కొన్ని ప్రతికూలములు.


 మనము అత్యంతశక్తిహీనులమని సరనాగతి మార్గమునకు చేర్చునవి అనుకూలములు.


  సత్యమును అసత్యముగా-అసత్యమును సత్యముగా మనలచే భ్రమింపచేయు మాయ ప్రతికూలము.అయినప్పటికిని అది మాలోని అహముతో జతకూడి మన యుక్తాయుక్త విచక్షణను మరుగున పరుస్తుంది.

   విస్తరించియున్న విజ్ఞానములోని జ్ఞానమును దర్శించనీయదు.


 కనుక సాధనతో మనము విశేషములోదాగి వింతలు చేస్తున్న సామాన్యమును సత్-చిత్తును గుర్తించగలుగుటకు చేయు ప్రయత్నమే ఆధ్యాత్మికత.


    మరొక చిన్న ఉదాహరణమును పరిశీలిద్దాము.

 తెల్లని కాగితముపై నల్లని అక్షరములు కూర్చబడినాయి.దానిని చూసి చదివి-అర్థముచేసుకొని కధ యని పద్యము అని సామెత అని పొడుపుకథ అని రకరకములుగా మనము వర్గీకరిస్తున్నాము.తెల్లకాగి

తము ఆ అక్షరములను తనపై ముద్రింపహేసి మనకు మరొక నామరూపములతో ప్రకటితమగుచున్నది.


  దానిని మనము తెల్ల కాగితము అనటములేదు-అక్షరములు అనటము లేదు.అది వేరొక రూపును దిద్దుకొన్నది.అక్ష్రములు వరుస కూరుపు మారినదనుకోండి.మరిక నామ రూపములు.తెల్ల కాగితము మాత్రము ఎప్పుడు తెల్లకాగితము వలెనే ఉన్నది.కాసేపు మనము దానిని సామాన్యము అనుకుందాము.దానిపైన పలు నామరూపములు సంతరించుకొనుచున్న అక్షరములను విశేషములనుకొందాము.


  అయితే ఆ కూర్పును చేసినదెవరు? దానిని గుర్తించకలిగిన శక్తిని మనకు అందించున దెవరు? ఆ సక్తి-ఈ శక్తి ఒక్కటేనా?

  అమ్మబాబోయ్? ఇన్ని సందేహములా? మీకొక అమస్కారం? అంతలోనే మరో కొత్త సందేహము--అసలు నమస్కారం అంతే కేవలము రెండుచతులను కలుపు బాహ్య చేయనా లేక ఇంకేమైనా ఆంతర్యము ఇందులో దాగి ఉందా,


  సందేహములతో సతమతమవుతున్న నన్ను,మనలను ఆ పరమేశ్వరుడు సహనముతో రక్షించును గాక.


  పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.





  



  


TANOTU NAH SIVAH SIVAM-09

          తనోతు నః శివః శివం-09      *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తియే    జగతః పితరం  వందే పార్వతీపరమేశ్వర...