ఓం నమః శివాయ-56
*********
అవిముక్తము అంటాదు-అనురక్తము అంటాడు
అవసానము అంటాడు-ఆశ్రయము అంటాడు
చూస్తూనే ఉంటాడు-గస్తీ కాస్తుంటాడు
అదును చూసుకుంటాడు-అమ్మ ఒడిని ఇస్తాడు
పెద్దనిద్ర తెస్తాడు-వద్దనే కూర్చుంటాడు
మనిషి తోడు అంటాడు-మంత్రము వినిపిస్తాడు
ఉపచారము చేస్తాడు-ఉసురును తీసేస్తాడు
మరుజన్మలేదు అంటాడు-మమేకమే అంటాడు
పిసరంత దయలేనోడు-మసి చేసేస్తుంటాడు
మరుభూమిలో తిరుగుతాడు-మర్యాదస్తుడ వాడు
సదాచారమసలు లేని సంకర చేష్టల వాడంటే
కిక్కిరు మనవేమిరా ఓ తిక్కశంకరా.
శివుడు చెప్పేదొకటి చేసేదొకటి.కాశేఏక్షత్రము గొప్పదని నమ్మపలుకుతాడు.ఎవరు వస్తారా అని ఎదురుచూస్తుంటాడు.వచ్చిన వానిని(నమ్మి) తిన్నగా కాటికి పంపిస్తాడు దగ్గరుండి మరీను నిర్దాక్షిణ్యముగా.ఉపచారములు చేస్తున్నట్లు నటిస్తూ ఊపిరిని తీస్తాడు తన పేరు మృత్యుంజయుడని గొప్పలు చెప్పుకుంటూనే మృత్యువుకు జీవులను అప్పగిస్తుంటాడు.తల్లి చెప్పిందని ఎందరినో పునర్జ్జీవుతులను చేసాడు కాని ఇక్కడ మాత్రము కసిగా వారి పార్ధివశరీరములను కాటికాపరిగా మారి మసిచేసేస్తుంటాడు.పైపెచ్చు వాడు నాలో కలిసిపోయాడు.ఇంక జనన-మరణ సంసారచక్రము వానిని బాధించదు అంటూ బడాయి మాటలు చెబుతాడు.మాటలు కోటలు-చేతలు మాత్రం ...తేనె పూసిన కత్తి శివుడు.-నింద.
మంత్రము నమః శివాయ-మరణం నమః శివాయ
నిర్వాకము నమః శివాయ-నిర్యాణము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
" నిన్నున్ నమ్మినరీతి నమ్మనొరులన్;నీకన్న నాకెన్న లే
రన్నల్దమ్ములు తల్లితండ్రులు గురుండాపన్న స్సహాయుండు;నా
యన్నా; యెన్నడు నన్ను సన్స్కృతివిషాదాంభోధి దాటించి,య
చ్చినానంద సుఖాబ్ధి దేలచదో కదే? శ్రీకాళ హస్తీశ్వరా.
ధూర్జటి మహాకవి.
నీ కరుణాకటాక్షమే సలక్షణమైన శ్రీకాళహస్తీశ్వరునిగా శోభింపచేయుచున్న శివా! నీకంటె నాకు అన్నదమ్ములుగాని,తల్లితండ్రులుగాని,గురువులుగాని,కష్టాలలో ఆదుకొను ఆప్తులుగాని ఇంకెవరు లేరు. నన్ను ఈ సంసార విష సముద్రమును దాటించి,సత్ చిదానంద సముద్రములో ఓలలాడించు స్వామి.శరణు శరణు మహేశ్వరా.
మోక్షద్వారము-జ్యోతిర్లింగ క్షేత్రమైన కాశీ పట్టణము శివుడు ప్రత్యేకముగా నిర్మించుకున్నది కాని బ్రహ్మ కల్పితము కాదు.కాశము(వెలుగు) తో నిండిన కాశీపట్టణమును ప్రళయకాలములో శివుడు తన త్రిశూలతో ఎత్తిపట్తుకుని ఉంటాడట.కాశ్యాంతు మరణం ముక్తి ఆర్యోక్తి,.
-
ఏక బిల్వం శివార్పణం.