Saturday, September 17, 2022

DEVAKARYASAMUDBHAVA-RAKTABEEJA


 

DEVAKARYASAMUDBHAVA


 

DEVAKAARYASAMUDYATAA-SUMBHA/NISUMBHA


 "యా చండీ మధుకైటభాది దైత్యశమనీ
           యా మాహిషోన్మూలినీ
  యా ధూమ్రేక్షణ చండముండ మథనీ
         యా రక్తబీజాశనీ
  శక్తిః శుంభనిశుంభదైత్య దమనీ యా సిద్ధిధాత్రీ పరా
    సాదేవి నవకోటిమూర్తి సహితా మాంపాహి/మాంపాతు విశ్వేశ్వరీ "

   పైశ్లోకము అనేక రక్కసులను తల్లి సంస్కరించినట్లు తెలుపుతున్నది.వారు
 మధు-కైటభులు
 మహిషాసురుడు
 ధూమ్రేక్షణుడు
 చండ-ముండుడు
 రక్తబీజుడు
 శుంభ-నిశుంభులు
   వీరికి అమ్మతో యుద్ధము చేయవలసిన పరిస్థితి ఎందుకు కల్పించబడినది?
   అసలు వీరెవరు?
 కశ్యప ప్రజాపతి/దితి సంతానము శుంభ-నిశుంభులు.వారు పాతాళ లోకములో పెరిగి పెద్దవారైరి.భూలోకమునకు వచ్చి బ్రహ్మ గురించి ఘోరతపమాచరించిరి.భూలోకము తల్లడిల్లసాగెను.వారి తపమును నిలిపి వేయుటకు బ్రహ్మ వారి ముందు పెరత్యక్షమై వరము కోరుకొమ్మనెను.చిరంజీవులుగా వరము కోరుగానే బ్రహ్మ తాను సైతము కల్పాంతమున సమసిపోవు వానినని తనకు చావును గెలిచే వరమిచ్చే శక్తిలేదనెను.దానికి వారు ఒక్క స్త్రీ చేతదక్క చావులేని వరమును పొందిరి.వరగర్వముతో దేవతలపై దండెత్తిరి.దానికి అనుగుణముగా వారు పాతాళమునకు వెళ్ళి వారి గురువైన శుక్రాచార్యునిచే మూర్ధాభిషిక్తులైరి.రాజ్యమును విస్తరించు ప్రక్రియలో
 చండ-ముండులు,ధూమ్రలోచనుడు,రక్తబీజుడు మొదలగు వారిని తమ అధీనములోనికి తెచ్చుకొనిరి.బలగర్వముతో స్వర్గముపై దండెత్తి దేవతలను సైతము పరుగులు తీయించిరి. 
   వారి పూర్వజన్మ పుణ్యమేమో పరమేశ్వరిచే సంహరించబడి సన్నిధానము చేరుకో గలిగిరి.
   మన కథను శుంభునితో ప్రారంభిద్దాము.

 ఇప్పటివరకు మధుకైటభులు-మహిషాసురుడు అను అసురులతో పరాత్పరి పరోక్షశక్తిగా/సమిష్టి శక్తిగా ఆవిర్భవించి,అజ్ఞానమును అంతమొందించినది.
  తన్నుకొస్తున్న తామసము తప్పులుచేయుటకు తడబడనీయదు తప్పులు దిద్దుకొనుటకు తప్పుకొనమని అసలే అనదు.
  అదే స్థితిలో నున్నాడు శుంభుడు.
 నేను అను భ్రాంతియే శుంభుడు.దానిని విస్తరింపచేసి-విజృంభింపచేయుటకు సహకరించు శక్తి నిశుంభుడు.నేను-నాది అన్న సిద్ధాంతమునకు ఊతముగా నిలిచి అహంకరించు శక్తి చండుడు.ఒక విధముగా రావణాసురుడు.వివేకమును విచక్షణను మేల్కొలుపనీయక మందగించి యుండు తిమిర శక్తియే ముండుడు.
  ఒక విధముగా తనకు తాను తెలుసుకొనలేని/తెలియచేయుతకు ఎవ్వరు లేని వ్యర్థ పరాక్రమమే ఈ శుంభ-నిశుంభ/చండ/ముండుల ప్రస్తానము.వీరిది దైత్య పక్షము.
 వీరినుండి రక్షనకోరుచున్న దైవపక్ష నాయకుడు ఇంద్రియములను అదుపులోనుంచుకొనగలిగి పరాత్పరిని ప్రస్తుతించగల సాత్వికమూర్తి.
   "స్తుతా సురై పూర్వమభీష్ట సంశ్రయా
    త్తథా సురేంద్రేణ దినేషు సేవితా
    కరోతు సానః శుభ హేతురీశ్వరీ
    శుభా భద్రాణ్యభిహంతు చాపదః"
  పూర్వము దేవతల కోరిక తీర్చినందుకు ఏ దేవిని స్తుతి చేసిరో ఏ దేవి ఇంద్రునిచే నిత్యము సేవింపబడునో ఆ శుభహేతువైన ఈశ్వరి మా ఆపదలను తుంచివేసి,భద్రలను/శుభములను కలిగించుగాక.
   వీరి ప్రార్థనను ఆలకించిన ఆ జగదంబ ఏ విధముగా ఆవిర్భవించనున్నదో,ఏ నామముతో కీర్తించ బడనున్నదో ,ఎన్ని లీలావిశషములను ప్రసాదించనుందో అమ్మదయతో తెలుసుకుందాము.

  సర్వం శ్రీమాతాచరణారవిందార్పనమస్తు.

 

DEVAKAARYASAMDBHAVA-MAHISHASURAMARDINI-PART01



దేవకార్య సముద్యతా-మహిషాసుర మర్దిని
   *******************************
 అమ్మా,
 " మహిషాసుర నిర్ణాశి భక్తానాం సుఖదే నమః
   రూపం దేహి జయందేహి యశోదేహిద్విషోజహి"


  దేవకార్య సముద్యతా-మహిషాసుర మర్దిని-02
  ******************************
 ధనురనుసంగరణ-క్షణ-సంగ-పరిస్ఫురదంగ-నటత్కటకే
   కనక-పిశంగ-పృషత్క-నిషంగ-రసద్భట-శృంగ-హతావటుకే |
          కృత-చతురంగ-బలక్షితి-రంగ-ఘటద్-బహురంగ-రటద్-బటుకే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే 

   వరగర్వమొతో అహంకరించుచు ఇంద్రునిపై దండెత్తిన మహిషుని ధాటికి తట్టుకోలేని దేవతలు స్వర్గమును వీడి,అధికారమును కోల్పోయి భూలోకమున సామాన్యులవలె సంచరించసాగిరి.
  "బుద్ధిః కర్మానుసారిణి" రాబోయే పరిణామములకు సూచనగా మహిషుని పాపకృత్యములు పరాకాష్ఠకు చేరుచున్న సమయమున వానిదగ్గర సద్దుమణిగిన సత్వము దేవతలను చేరినదా అన్నట్లు వారందరు తమను ఈ ఆపదనుండి రక్షింగలిగినది ఆ పరాశక్తియే అని అర్థముచేసుకొనగలిగిరి.రాజ్యముతో పాటుగా రజోగుణము కనుమరగైనదేమో వారు ముకుళిత హస్తములతో ,
 యా దేవి సర్వభూతేషు దయా రూపేణ సంస్థితా

 అంటూ,ప్రర్థనలను చేయగానే అత్యమ్యకరుణతో అమ్మ,

 " ఏకస్థం తదభూన్నారీ వ్యాప్తలోకత్రయం త్విషా
   యదభూచ్ఛాంభవన్ కేశా బాహవో విష్ణుతేజసా"

   సకలదేవతల శరీరములనుండి పుట్టి ఒకటిగానై ముల్లోకములలో వ్యాపించిన ఆ మహాతేజస్సు స్త్రీ రూపమును దాల్చెను.

   " యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా
     నమస్తస్త్యై నమస్తస్తై నమస్తస్తై నమోనమః.

    సకలదేవతల శక్తులనుండి  తానొక్కొక్క అవయమును ఏర్పరచుకొని అసమాన సౌందర్యముతో అబ్బురకొలుపుచుండెను.

 అయి శరణాగత-వైరివధూ-వరవీరవరాభయ-దాయికరే
    
త్రిభువనమస్తక-శూల-విరోధి-శిరోధి-కృతాఽమల-శూలకరే 
|
 సమస్త తేజములతో నేర్పడిన దేవిని దర్శించి దేవతలు, వారి భక్తి సమర్పణ భావముతో తలొక అలంకారమును,ఆయుధమును సమర్పించిరి.
  



ఇంతకీ ఎవరా మహిషాసురుడు? ఏమా కథ?
కశ్యప ప్రజాపతికి దనదేవి యందు జన్మించిన దానవులలో రంబుడు-కరంబుడు అను ఇద్దరు అన్నదమ్ములు అత్యంత శక్తివంతమైన సంతానము కొరకు పరమేశ్వరుని ఈ క్రిందివిధముగా ధ్యానించసాగిరి.

రంబుడు దక్షిణాగ్ని,ఉత్తరాగ్ని,పశ్చిమాగ్ని,ప్రాగగ్ని ఉపరితలమున కల ప్రచండ సూర్యాగ్ని మధ్యమున నిలిచి ఘోరతపమును ఆచరించసాగెను
.అతని తమ్ముడైన కరంబుడు జలదిగ్బంధనములో కఠోర తపమాచరించు చుండగా,దాని వలన కలుగు దుష్పరిణామ నివారణకై,ఇంద్రుడు మొసలిరూపమున దాగి,వానిని సంహరించెను.
విషయమును తెలిసికొనిన రంబుడు పగతో రగిలిపోతూ,శత్రువులను జయించాలంటే బలాఢ్యుడైన పుత్రుని సహాయము ఎంతో కలదని గ్రహించి,అగ్ని దేవుని ప్రార్థించ సాగెను.ఫలితము కానరాకున్న,తపమును మరింత ఉదృతమును కావించెను.అయినను అగ్నిదేవుడు కరుణించలేదని,తన తలను అగ్నికి సమర్పించగా ఉద్యుక్తుడాయెను రంబుని నిష్ఠనుకు సంతసించి అగ్ని వరమును కోరుకోమనెను.
రంబుడు బాగుగా ఆలోచించి కామరూపి ,అజేయుడు,ముల్లోకములను జయించగల కుమారుని కోరుకొనెను.అందులకు అగ్ని రంబుడు వెనుదిరిగి వెళ్ళునప్పుడు దేనిని చూసి/లేదా ఎవరిని చూసి మోహవివశుడగునో వారికి జనించిన కుమారుడు రంబుని కోర్కెను తీర్చగలడని పలికి అంతర్ధానమయ్యెను.
వెనుదిరిగి చనునపుడు ఎందరో సౌందర్యవతులు,అప్సరసాంగనలు తారసపడినా రంబుడు ఎటువంటి మన్మధ వికారమును పొందలేదు.ప్రయాణమును కొనసాగించుచుండగా అక్కడ
మరీచి మహాముని శాపవశియై మహిషి రూపములో సంచరించుచున్న  ఒక మహిష్మతి అను గంధర్వ కన్యను  చూచినంతనే మోహితుడాయెను.
తత్ఫలితముగా మహిషము గర్భమును ధరించినది.రంబుడు ఆ మహిషమును తన నగరమునకు తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా చూసుకొనసాగెను.ఒక ముహూర్తమున ఆ మహిషము దున్నపోతు తల-మానవ శరీరము గల ఒక దూడను ప్రసవించి ,శాప విమోచినియై తన గంధర్వ లోకమునకు పోయెను.
దైవ నిర్ణయ ప్రకారము మహిషుడు బ్రహ్మగురించి ఘోరతపమును చేయగా,సంతసించిన బ్రహ్మ ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మనెను.మహిషుడు తనకు మరణములేని వరమును ప్రసాదించమనెను.అందులకు తనకా శక్తి లేదని,కల్పాంత సమయమున తానును నిష్క్రమించువాడనని,మరేదైనా వరమును అనుగ్రహించెదననెను.మహిషుడు అహంకారముతో "అబలలను అరికాలితో అణచివేయగలను" అని తలచి స్త్రీలు తప్ప ఎవరు తనను సంహరించని వరమును పొందెను.
మహిషుడు లేని సమయమున దేవతలు అతని రాజ్యమును ఆక్రమించిరి.
  అమ్మవారి లీలావైభవములే ఈ అసురుల విజృంభణలు.తాను ఆదమరచినవేళ దేవతలు సుఖసంతోషములతో నుంటున్నారని గమనించిన అసురుడు తన తామస ప్రవృత్తికి మరింత రాజసమును తోడుచేస్తూ సత్వమును సాంతముగా తొలగించివేశాడు.

      స్వర్గము మీది కామము దానిని వీడకయున్న వారిపై క్రోధముగా రూపుదిద్దుకున్నది.లోభము అసలు కొంచము కూడా సర్దుకోవలసిన పనిలేదంటూ వారిపై యుద్ధానికి పురిగొల్పింది.మదము-మాత్సర్యము మరింత కొత్త పుంతలు తొక్కి దేవతలను స్వర్గము నుండి పోరాడలేక వీడి పోవునట్లు చేసినవి.

  అసురుని వీడిన సత్వము సురలను చేరినదా అన్నట్లు వారి తమ అశక్తతను గ్రహించి,నిశ్చలభక్తితో,
 ఆ పరాశక్తిని ప్రార్థించసాగిరి.
 "అయిరణ దుర్మద శత్రువధోదిత దుధర నిర్జర శక్తిభ్రుతే"
  అంటూ అమ్మ చరణములను శరణుగోరుచున్నారు.

" మామవ సదాజనని" కథను ఏ విధముగా నడిపిస్తుందోఎ తానుగా రంగ ప్రవేశము చేస్తుందో/లేక తాను పరోక్షముగా ఉండి మరెవరినైన ప్రత్యక్ష పరుస్తుందో అమ్మ దయతో రేపు తెలుసుకుందాము.
   సర్వం శ్రీమాత చరణార విందార్పణమస్తు.


 

DEVAKAARYA SAMUDYATAA-INTRO

 



 పరమపావనమైన నీపాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 ఉండి,పోవునవి యేగ మానవ నాలుగుదశలు
 ఉండి,పోవునవి యేగ మనిషి కోపతాపములు

 ఉండి,పోవునవి యేగ ఋతువులు ఏడాదిలో
 ఉండి,పోవు వారేగా రవిచంద్రులు  దినములో

 ఉండి,పోవునవి యేగ మంచి చెడులు మనుగడలో
 ఉండి,పోవునవి యేగ ఆకలిదప్పులు జీవికి

 ఉండి,పోవునదియేగ జగతి ప్రతి ప్రళయములో
 ఉండి,పోవు ఈ జీవి నీ పదముల ఉండిపోవుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.


  దేవకార్య సముద్యతా

 **********************

   ధర్మసంస్థాపనార్థాయా సంభవామి యుగేయుగే అని చెబుతున్నది భగవద్గీత.

  శిష్టరక్షణ-దుష్ట శిఖణ అను రెండువిధానములు కూడియున్న ధర్మ పరిరక్షణకై నిర్వికార/నిర్గుణ/నిరంజన చిత్శక్తి కొత్త కొత్త రూపములను ధరిస్తుంటుంది.ధర్మమును పరిరక్షిస్తుంటుంది.ఆ ప్రక్రియ దుష్టత్వమును సం హరించుటకు ముందు సంస్కరిస్తుంది.వంధ విముక్తులను చేస్తుంది.

  ఒక మంచి యొక్క గొప్పతనమును అర్థముచేసుకోవాలంటే దానికి అడ్దముగా నిలిచిన చెడు యొక్క అజ్ఞానమును కూడా తెలుసుకొనవలసినదే.చల్లదనమును తెలియచేయుటకు ఎండ,వెలుగు వైభవమును గుర్తించుటకు దానివెనుక దాగిన చీకటి అంతే ప్రాముఖ్యతను వహిస్తాయి.

   అదే విధముగా మన ఇంద్రియములు వానిని చైతన్యవంతము చేస్తున్న ఇంద్రియ ధర్మము అంతే ప్రముఖ పాత్రను అవి ఉపయోగించు వారి మనస్తత్త్వమును బట్టి ఫలితములను ఇస్తుంటాయి.

  ఒక విధముగా చెప్పాలంటే వారి ఇంద్రియములు బుద్ధిని అధిగమింపచేయగలవై విచక్షణను సైతము దూరము చేసి దురాగతములను చేయిస్తాయి. ఈ ఆటలో అరిషడ్వర్గములు మూడుగుణముల్లుగా ప్రకటితమగుతూ పదపద మంటుంటాయి.ఇది ధర్మాధర్మములకు మొకవైపైతే మరి యొకవైపున,మరి యొకవైపున వారిని సంస్కరించి చక్కదిద్దే చల్లని తల్లి కరుణ లీలావిశేషములు ,

మార్గదర్శకములై మంగళాశీస్సులనందిస్తాయి.

   వాటికి నిలువెత్తు నిదర్శనమే అమృతగుళికల వంటి అమ్మకథలు.అనవరత శ్రవణాసక్తములు.అగణిత గుణ శోభితములు.అమ్మదయతో వాటిని ఆస్వాదించే ప్రయత్నము చేద్దాము.  అమ్మ అనుగ్రహమును పొందుదాము.


  అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...