Wednesday, September 25, 2024

SREECHAKRADHAARINI-INTRO


 


   "  దేవీ ఖడ్గమాల స్తోత్రము"

      ******************


 " తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్త స్థితేనవై

   అష్టాదశ మహాద్వీపం సమ్రాడ్భోక్తా భవిష్యతి"-



 

 ఆదిశంకరులు భావించినట్లు,

 

 " శివ ఏవ గురు సాక్షాత్-గురుః ఏవ శివః స్వయం" అన్న సూక్తికి ఊఅహరనముగా సక్షాత్ పరమేశ్వరుడు గురువై "శ్రీచక్రధారిణి" యైన అమ్మ యొక్క ప్రకటిత మేరుస్వరూపము యొక్క స్వరూప-స్వభావములను పార్వతీదేవికి అనుగ్రహించిన స్తోత్రమే ,

 " శ్రీ శుద్ధ శక్తి మహామాలా స్తోత్రము " అను దేవీ ఖడమాలా స్తోత్రము.

  ఖడ్గము అంటే స్తుతి.స్తుతిమాల.పరివారదేవతా సమేత స్తుతి మహా మాల.శక్తివంతమైనది కనుక శక్తి మహా మంత్ర మాల.సత్-చిత్ స్వరూపము కనుక

 శుద్ధశక్తి మాల మహామంత్రము.

 శుభప్రదమైనది కనుక 

   శ్రీ శుద్ధశక్తి మహా మాల మంత్రము.

    శాక్తేయ సంప్రదాయానుసారముగా దేవీ అర్చనావిధానము,

మంత్ర-యంత్ర-తంత్ర విధానములలో కొనసాగుతున్నది.

  శక్తివంతమైన శబ్దము మంత్రమైతే-దానిని ఒకచోట నిలుపగలిగేది యంత్రము.ఇక తంత్రము,

 ఒక అద్భుతమైన అల్లిక/నేత.ఆత్మ-పరమాత్మలు ఒకదానితో మరొకటి విడి విడిగా కనపడినప్పటికిని,అవి నిత్యము ఒకదానినొకటి అల్లుకునే ఉంటాయి.

   శక్తివంతమైన మంత్రహార సమూహమును 'మాలామంత్రము" అంటారు.మహా మాలా మంత్రము.

  శుభము-పవిత్రత-శక్తి అను మూడు నదుల త్రివేణి సంగమము,

 "శ్రీ శుద్ధ మాలా మహామంత్రము."

   ఈ పవిత్రస్తోత్రము,

1.నామము

2ఋషి

3.నిక్షిప్త దేవత

4.ఛందస్సు

5.బీజము

6.శక్తి

7.కీలకము అను శుభలక్షణ శోభితము.

    

    "అస్య శ్రీ శుద్ధశక్తి మాలా మహా మంత్రస్య" అని నామము ప్రథమముగా కీర్తింపబడుచున్నది.

    స్తోత్ర "ఋషి" అయిన వరుణాదిత్యుని సాధకుడు తన సమీపమున నిలిచి మార్గదర్శకము చేయమని "ఉపస్థేంద్రియాధిష్ఠాయీ" అని అర్థిస్తాడు.

     నిక్షిప్తదేవత అయిన"మహా కామేశ్వరీ శ్రీ లలితా భట్టారికను దర్శించగలుగు జ్ఞానమును కోరుతుంటాడు.

     ఆ తల్లి కామేశ్వరాంకనిలయ.కామేశ్వరుని ఒడిలో కూర్చుని యుంది.కామేశ్వరుడు కకారపీఠస్థితుడు.కకారపీఠము సత్వశోభితమై వారిరువురు అధిష్టించుటచే ప్రకాశిస్తున్నది.

   గాయత్రీ ఛందము శబ్దమై శ్రవణానందమును అందిస్తున్నది.

       ఇప్పుడు మనము బీజము-శక్తి-కీలకము అను మూడు విషయములను తెలుసుకుందాము.

  అక్షరమునకు పూర్ణానుస్వారము చేరి(0) దానిని బీజాక్షరముగా మారుస్తుంది.ఉదాహరణకు,

 ఓ అను అచ్చుకు సున్న చేరి "ఓం కారమను "బీజాక్షరమును చేస్తుంది.అదేవిధముగా "ఐం-హ్రీం-శ్రీం.

   మనభాషలో బీజము అంటే విత్తనము.స్థూలమును తనలో దాచుకొనిన సూక్షమము.

  స్తోత్రమునకు బీజము" ఐం".దీనినే భువనేశ్వరి శక్తి అని కూడా అంటారు.

   ఐం అను బీజములో నిక్షిప్తముగా దాగిన శక్తిని "క్లీం" అను బీజాక్షరముతో సంకేతిస్తారు.

   ఇప్పుడు మనకు శక్తి బీజరూపములో దాగి ఉన్నది.అంతే,

   నిధి ఉన్నది కాని మనము దానిని చేరలేము.అది తాళము వేయబడియున్నది.తాళమును తొలగిస్తే కాని లోపలికి వెళ్ళలేము.

తాళమును తొలగించగలిగేది కేవలము తాళపుచెవి మాత్రమే.ఆ తాళపు చెవియే "సౌ" అను కీలక శబ్దము.

   ఆ తాలపు చెవి మనకు లభించాలంటే,తల్లి స్తోత్రజపము-తత్త్వ అవగాహనము అను ఒకేఒక మార్గము ఉన్నది.

  అదియే "వామకేశ్వర తంత్ర "గ్రహీతమైన

   దేవీ ఖడ్గమాలా స్తోత్రము 


 

    సర్వం  కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు.

     

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...