సంభవామి యుగే యుగే సాక్ష్యములు హరి శయనములు
ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన మన ఆళ్వారులు
పెరుంబుదూరులో కాంతిమతి కేశవాచార్యులకు
ఇళయపెరుమాళ్ళుగా ప్రకటితమైనది ఆదిశేషువు
కులవ్యవస్థను ఖండించె కంచిపూర్ణుని గురువుగ దలచె
ఆళ వందార్ విశిష్తాద్వైత బహుళ వ్యాప్తి చేసె
అత్యంత గోప్యమనే అష్టాక్షరి మంత్రమునే
శ్రీ రంగరాజ గోపురమెక్కి అందరికి ఉపదేశించె
యమునాచార్య హస్త సంకేతమును గ్రహించి
మూడు మంచిపనులతో ముజ్జగములను బ్రోచె
నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని
పరమార్థము చాటి రామానుజుడు పూజనీయుడాయెగ.