Thursday, March 18, 2021

TIRUVEMBAVAY-16

 


.






 తిరువెంబావాయ్-16

 **************


 మున్ని కడలై చురుక్కి ఎళుందియాల్

 ఎన్నతిగళ్ దెమ్మై ఆరుదైయాళ్ ఇత్తడియన్


 మిన్ని పొళిందెం పిరాట్టి తిరువడిమేర్

 పొన్న చిలంబిర్ చిలంబిత్ తిరుప్పురవం


 ఎన్నచ్ శిలైకులవి నాందమ్మై ఆళుడియాళ్

 తన్నీర్ పిరవిళా ఎణ్కోమణ్ అంబర్కు


 మున్ని అవళ్ నమక్కు మున్ శురుక్కుం ఇన్నరుళే

 ఎన్న పొళియాయ్ మళయేలో రెంబావాయ్.


 శ్యామలా తాయియే పోట్రి

 ****************


  తిరుమాణిక్యవాచగరు మనౌ ఈ పాశురములో ఒక సామాన్యమును విశేషముతో-విశేషమును సామాన్యముతో అన్వయిస్తు అద్భుతావిష్కరణమును చేస్తున్నారు.


  అమ్మతో పోల్చబడిన నల్లని మేఘమా తరియించినదమ్మా నీ ఉపాధి.

  సముద్రమా-సాటిలేనిదమ్మా నీ సహాయగుణము.

 సంక్షిప్తపరచబడి తల్లితో పోల్చబడి తరించినావు.


 కుదించిన సముద్రమే కదా ఆ నీలిమేఘము.

 అది విస్తరించినచో సముద్రమేకదా!


 మనకు దర్శనీయములైన సముద్రము-మేఘము-మెరుపు-ఉరుము-హరివిల్లు-మడుగు తల్లి స్వరూప-స్వభావములకు ఉపమానములై సన్మానమునందుచున్నవి. 


 ఏ విధముగా మన కామాక్షి తాయి మనకు రక్షణగా నుండి కాపాడుచున్నదో-ఆ అమ్మ అంతరంగమే ఆ నల్లని మేఘముగా నాకు తోచుచున్నది అని మన సౌభాగ్యవతులు పరస్పరము సంభాషించుకొనుచున్నారు.


 వారి భావములు మన భాగ్యవశమున బహిరంగపరచుచున్నారు.

 ఈ సంభాషమును జరుపుచున్న ఇద్దరు పడుచులు పరమ పాండిత్యముకలవారే.

ప్రజ్ఞాధనులే మాత్రమేకాదు వారు పరమ దయాంతరంగులు.కనుకనే పరస్పర సంభాషణమను పరమార్థము ద్వారా తల్లిని ప్రస్తుతిస్తు మనలను సంస్కరిస్తున్నారు.

 మొదతగా వారికి కనిపించినది తల్లి కరుణ వారిపై/మనదరిపై వర్షించుటకు సిధ్ధమై యున్నది.

 చెలి అటుచూడు ఆకాశమువైపు.ఎంతటి మహాద్భుతము ఆవిష్కరింపబడుతున్నదో అని అనగానే పక్కనున్న చెలి అమాయకముగా,

 చెలి! నీవా నల్లని మేఘమునా నాకు చూపిస్తున్నది? అని ప్రశ్నించినది.


 సర్గా చూడు చెలి! అది సామాన్యమైన నల్లమబ్బు కాదు.

 వర్షించి,మనలను పోషించుటకు సిధ్ధముగా నున్న తల్లికరుణ.

మనలను కరుణించుటకై,ఆ మబ్బు ఎంతకష్టపడినదో ఒక్కసారి ఆలోచించు.అప్పుడు నీకు అది పరమపూజ్యమే అవుతుంది అని,తిరిగి తన చెలితో 

అది ఇంతకు మునుపే ఏమిచేసిందో నీవు గమనించావా?


 మున్ని-ముందరే

 కడలై-సముద్రపు నీటిని కడుపునిండా తాగి,పైకిలేచి-సురుక్కి-దాని పరిమానమును తగ్గించి,ఆవిరిగా మార్చుకొని-తాగునీటిగా మార్చుకొని మనకు అందించుటకు సిధ్ధముగా నున్నది.ఈ ప్రక్రియ వలన దానికేమి ప్రయోజనము లేదు.మనకు అందించిన తృప్తి తప్ప. అని అంటుండగానే 

 మొదటి విచిత్రము,

 అకాశము మెరుపులతో మెరియసాగినది.

 రెండవ చెలి అవిగో మెరుపులు మెరుస్తు ఎంత బాగున్నాయో కదా! అనగానే


 చెలి.అవి సామాన్యమైన మెరుపు కావు.మనసుతో చూడు.నీకు ఏమనిపిస్తుందో తెలియచేయి అనగానే,అమ్మ కరుణ ఉంటే అసాధ్యమేముంది.అంతరంగమున నిండి అమృతవాక్కుగా ప్రకటితమవుతోంది.

 మధురాతి మధురముగా తాయి అనుగ్రహ తన్మయత్వముతో చెలి,

 అది సామాన్యమైన మెరు కాదు అది అమ్మ,

 ఇట్టదియన్.

 కనిపించి-కనిపించని సూక్ష్మమైఅ/శూన్యముగా తోచు నడుము కదా. అవునవుననుకుంటుండగానే మరో అద్భుతము.

 ఉరుములు ఊరుకుంటాయా? అమ్మతో సారూప్యమును పొందకుండా.వాటి ఉత్సాహ ఉత్సవమునేమనగలను? తెలిసికొనుటకు ఆసక్తిని చూపుట తప్ప.

 అవిగో ఎంత సుస్వరనాదమును ఆలపిస్తున్నవి మన తల్లి,

 పాదములకు ధరించిన-తిరువడిమేర్,

పొన్న-బంగరు

చిలంబిర్ చిలంబిత్-మువ్వల సవ్వడి వింటు మైమరచిపోతున్నసమయములో,

 అలా వారు ఎంతసేపు అమ్మగుణగానమనే సంకీర్తనములో మునితేలుతున్నరో వారికే తెలియదు.దయామృతములో మునిగి ధన్యులైనారు.బహిర్ముఖులు కాగానే ఆకాశము తనాందమను హరివిల్లుతో చిందులు వేస్తుంటే చెలి చూశావా.అమ్మ మంగళదమైన కనుబొమల వొంపు ఇంద్రధనుసుగా ఆవిష్కరింపబడుతు మనలను ఆశీర్వదిస్తున్నది.


 బాహ్యమునకు వచ్చారేమో మడుగు మరింత ఉత్సాహముతో కేరింతలో పోటిపడుతు ,

 తన్నీర్ తురవిళాం ఎణ్కోమల్-నేను ముందు రక్షిస్తాను అని అమ్మ అంటే-

స్వామి కాదు కాదు నేను ముందు రక్షిస్తాను జగములను అని పోటీపడుతున్నట్లుగా  ,

 మున్ని అవళ్ నమక్కు-మనలను 

 ఇన్నరుళే -ఆశీర్వచన అనుగ్రహమనే సౌభాగ్యముతో మనలను పునీతులను చేయాలని,

 ఎంతటి ఆరాటముతో నిండిన అనుగ్రహము.

 పద చెలి మనము ఆ మదుగులోనికి ప్రవేశించి,మనస్పూర్తిగా-మహోత్సాహముతో మునకలు వేద్దాము.మళయేలో రెంబావాయ్.మళయేలో రెంబావాయ్.


 తిరు అన్నామలయై అరుళ ఇది

 అంబే శివే తిరువడిగళే పోట్రి.

  నండ్రి.వణక్కం.




 



    



TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...