Saturday, January 1, 2022

PASURAM-17

తిరుచిట్రంబలం-పాశురం-17 ************************* శన్ కన్ అవన్ పాల్ తిశై ముగన్ పాల్ దేవర్గణ్ పాల్ ఎంగుం ఇలాదరోర్ ఇంబం నం బాలదా కొంగుం కరుణ్ కుళలి నందమ్మాయ్ కోదాట్టి ఇంగనం ఇల్లంగళ్ తోరుం ఎళుందరుళె శంగమల పొర్పాదం తందరుళం సేవగనై అంగణ్ అరసై అడియోగళ్ కారముదై నంగళ్ పెరుమానె పాడి నలందిగళ్ పంగయుం పూం పునల్ పాయిందాడేలోరెంబావాయ్ ..... శివపాదము మీద నీ శిరమునుంచరాదా భవసాగరమీద దుర్భరవేదన లేదా శివ శివ శివ అనరాదా శివనామము చేదా. తిరుమాణిక్యవాచగరు మనకు ప్రస్తుత పాశురములో నామసంకీర్తనము-పాద సంసేవనము అను రెండుభక్తి మార్గములను జోడించి అనంతికలల-స్వామి తేజోవంతములైన ,దయా సముద్రములైన బంగారు పాదపద్నముల గురించి సంకీర్తించుచున్నారు. మున్ ఇక్కదలి చురుక్కి పాశురములో చెలులు ఏ విధముగా అమృతవర్షములో పునీతులైనారో తెలుసుకున్నాము.త్రికరణములు శుధ్ధమైన వారి పదములు స్వామి పాదార్చన సౌభాగ్యమునకు ఉవ్విళ్ళూరుచున్నవి. వారు తమతో తాము స్వామి పాదదర్శన వైశిష్ట్యమును ఈ వ్ధముగా ముచ్చటించుకొనుచున్నారు. పోతనామాత్యుల వారు చెప్పినట్లు, తను హృద్భాషణములను స్వామి కైంకర్యమునకు మరక్చుకొనుచున్నారు. చెలి! నీకు ఈ విషయము తెలియునా? మనమీది నిర్హేతుక కృపతో అనేకానేక ఆశీర్వచనములతో స్వామి తనకుతానుగా మన గృహములకు తరలివస్తున్నాడు.మనము ఏ మాత్రము అలస్త్వమును కాని/సోమరితనము కాని/అజాగరూకతను కాని పొందక స్వామి పాదములను అర్చించుకుందాము. స్వామి పాదములు కోద్-దోషములను/పాపములను ఆట్టి-హరించివేయునవి/తొలగించునవి. మనమందరము స్వామి రాకను స్వాగతించి, పదములె చాలు దేవా నీ పద ధూళులె పదివేళు అని సంకీర్తిస్తూ తన్మయత్వముతో సేవించుకుందాము అని అనగానే కొంఘుం-సువాసనతో కూడిన కరుణ్-అందముగా ముడుచుకొనిన కురలి-కేశములు గల ఒక చెలి/అరాల కుంటల ఇందులో అంత విసేషమేమున్నది అన్న భావముతో నున్న సమయమున తక్కిన చెలులు ఆమెను సమీపించి, చెలి మనము ఇప్పుడే స్వామిపాదపద్మముల యొక్క ప్రత్యేకతను తెలిసికొందాము. ఒకసారి- అడియోంగల్ కారముదై-స్వామి తిరుపాదములు సేవిద్దామంటే కానరాలేదు. అనగానేఅమాయకముగా ఎవరికి కనపడలదు? ఎందుకు కనపదలేదు? అని తన చెలులను ప్రశ్నించింది. ఎవరికంటే , 1 శన్-కనవన్ పాల్-కెందామరల వంటి కన్నులున్న పుండరీకాక్షునకు /హరికి 2.తిశై ముగన్ పాల్-చతుర్ముఖుడైన బ్రహ్మకు 3.దేవర్ గణ్ పాల్-సకల దేవతా సమూహములకు 4.అంగణ్-రాజ్యాధిపతులకు ఎందుకంటే -మనకు తెలియచేయుటకు వారందరు స్వామి అనుగ్రహముతో పేదర్శించిన లీలా విశషము అది. కనుకనే, ఎంగుం-ఎక్కడెక్కద వెతికినను వారు ఇలాదరోర్-స్వామి పాదపద్మములను కనుగొ నలేకపోయిరి. స్వామి తనకు తానుగా మనలను కరుణించవలెను కాని స్వామి దర్శనము సేవనము మనకు/జీవులకు సాధ్యము కాదు అని,వారందరు జ్ఞాన పద్మములతో నిండిన ,స్వామి అనుగ్రహమనే పొయిగైలోకి, పాయిం-దూకి/మునిగి స్వామి గుణగనములనే జలములను దోసిళ్లలో నింపుకుని ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ,ఒకరికి ఒకరు సాధనలో తోడ్పడుతూ శివనోమును నోచుకొనుటకు వెళ్ళుచున్నారు. అంబే శివే తిరువడిగళే శరణం.

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...