Thursday, June 13, 2024

DEVIKHADGAMALA AMTE?


  శ్రీ మాత్రే నమః
  ******************
 " అమ్మవు నీవే  అఖిలజగాలకు-అమ్మలకన్న అమ్మవు నీవే
   నీ చరణములేనమితినమ్మ-శరణము కోరితి నమ్మా భవాని"
  
   అని వేడుకుంటున్న తన బిడ్డలను కరుణించకుండా ఉండగలదా ఆ పరమేశ్వరి.
  అందుకే పరంజ్యోతిగా ప్రకాశములో ఇమిడి ఉన్న తాను దాని నుండి కొంత భాగముగా విడిపోయి,మనలను కాపాడుటకై దిగివచ్చినది అని నా నమ్మకము.
 ఇంకొక విధముగా చెప్పాలంటే ఆలోచన+ఆచరణ అను రెండింటిని సమర్ధిస్తూ అయ్య+అమ్మ ఒకరు కనపడకుండ కథనడిపిస్తూ,మరొకరుకనపడుతు మనలను చేరదీస్తూ,ప్రపంచమనే గారడీని చేస్తున్నారన్నమాట లీలగ.
 నిజమునకు వారిద్దరున్నది ఒకతొమ్మిది అంతస్తుల భవనము.ఒక్కొక్క అంతస్తు ఒక్కొక్క సుందరమైన ఆకారముతో,దాని ప్రాముఖ్యతను తెలియచేస్తుంటుంది.ప్రతి అంతస్తులో ఎందరో మహిమగల మాతృమూర్తులు మనకు పై అంతస్తు చేరుటకు సహాయపడుతుంటారు.పైకి చేరుతున్న కొలది వాతావరనము శుభ్రమైనట్లు,మన మనోభావములు కూడా పరిశుద్ధమగుతుంటాయి.
   మనకు అవసరములేనివస్తువులు ఏవో గ్రహించి వానిని పైకి తీసుకుని వెళ్ళకుండ వదిలించుకుంటూటాము.ఏది నిజము/ఏది అబద్ధము తెలుసుకోగలుగుతాము.


   ఒకే పదార్థము రెండుగా విడినప్పుడు విడిన భాగము తానలో వచ్చిన మార్పుతో ఆఆశ్చర్యముగా ప్రకాశము/పరంజ్యోతి వంక చూడసాగినదట.ఆ చూపుల వలయములు చక్రములుగా/ఆవరణములుగా గిరగిర తిరుగుతూ బిందువు నుండి కిందకు సాగి భూమి వరకుచేరి,అక్కడవిస్తరణను ఆపివేసినదట.మొదలు-చివర మధ్యలో ఏడుమజిలీలుగా తాను పైన సూక్ష్మముగా కిందకు వస్తున్నకొద్ది స్థూలముగా రూపుదిద్దుకున్నదట.
  తాను కిందకు రాగలదు.తిరిగి పైకి వెళ్ళి ప్రకాశములో అంతర్లీనము కాగలదు.సామాన్యులకు ఆ ప్రయాణము అంత సులభము కాదు.కనుక ప్రతి మజిలీలోను/ఆవరణములోను కొన్ని తన ప్రతిరూపములను పరిమిత శక్తులతో సృజించి వారిని మనకు సహాయము చేయమని చెప్పినదట.వారే యోగిని అను పేరుతో గౌరవింపబడుచున్న మాతాస్వరూపములు.వారు వారి నాయిక కలిసి ప్రయాణికులకు సహాయపడుతూ,ఒక్కొక్క అంతస్థులోని ప్రత్యేకతలను తెలియ చేస్తూ,పరిపూర్ణముగా అర్థమయేటట్లు కాలవిలిసిన అర్హతను పెంపొదిస్తూ,వదిలివేయవలసిన వాటిని సూచిస్తూ,కృతకృత్యుని చేస్తారు.
   ఇంతకీ "దేవిఖడ్గమాల అంటే?" అమ్మను స్తుతించటముతో పాటుగా అమ్మ నియమించిన మనకు సహాయపడుతున్న శక్తులను(పరివార దేవతలను) సైతము ఆరాధించటము.ఖడ్గము అన్నపదమునకు స్తుతి అన్న అర్థమును అన్వయించుకుంటూ "శుద్ధ శక్తి మాలా" అనికూడా పిలుస్తారు.అమ్మను ఆర్తితో పిలుచుటయే స్తుతి.అహములేకుండా అర్చించుటయే స్తుతి.ఆస్తుతియే ఖడ్గముగా మారి నీ అడ్డంకులను/అజ్ఞానమును/అహంకారమును/అలసత్వమును/అనుభవములను ఖండించివేస్తుంది.నీవు చూస్తున్నవి/చేస్తున్నవి నీలో దాగిన ప్రాణసక్తి సహకారమని తెలుసుకుంటావు.ఆ ప్రాణశక్తి ఎక్కడ ఉంది?ఎలా ఉంటుంది? తెలుసుకోవాలన్న తపన నీలో ప్రారంభమవుతుంది.తపన తపమవుతుంది.తహతహలాడుతున్న నీ ప్రయాణము ఒక్కొక్క అంతస్తును ఎక్కుతూ,తొమ్మిదవ అంతస్తుచేరగానే,నీ నామరూపములు/కష్టసుఖములు/సంకల్ప వికల్పములు /నేను-నీవు అన్న రెండు విరుద్ధ భావములు లేవని,అంతా ఒక్కటే నన్న భావము కలిగి ఆ ప్రకాశమే పరమేశ్వరి యని ఆమె ఓడిలో కూర్చుని నిన్ను నీవు,నీలో దాగిన ఆత్మ స్వరూపమును తెలుసుకోగలుగుతావు.
 గారడీవాడు గారడీ చేయటము ఆపేస్తాడు.అక్కడ మాయలు/జరిగిన సంఘటనలు మాయమైపోతాయి.
ఇన్నాళ్ళు అలవేరు సముద్రము వేరు అనుకున్న మనము జలము కాసేపు ఆడుకోవటానికి సముద్రమునుండి ఎగిపడుతూ అలయై ఒడ్డువరకు వచ్వ్హి,ఆట చాలనిపించగానే తిరిగి జలముగా మారి సముద్రగర్భమవుతోందని గ్రహిస్తాము.
   వాన పడిన ఆకాసము ప్రకాశ సూర్య కిరనము ప్రసరించగానే ఏడురంగుల హరివిల్లుగా కనిపిస్తున్నప్పటికిని అదే తాత్కాలికమేనని గ్రహించగలుగుతాము.
  అమ్మ ఒడిలోనున్న మనము కర్మఫలితములను అనుభవించుతకు తగిన ఉపాధిని అర్హతగా పొంది తిరిగి అమ్మ ఒడికి చేరతాము అని ఇంతకీ మనతో పాటుగా అమ్మకూడా మన వెంట వచ్చి,మనపోషణకు కావలిసినవి పంచభూతములుగా /ప్రపంచముగా అందించి,మనలో సూక్ష్మముగాదాగి చైతన్యస్వరూపిణియై కంతికి రెప్పవలె కాపాడుతున్నది.
  యాదేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా
  నమస్తస్త్యై నమస్తస్త్యై నంస్తస్త్యై నమోనమః.

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...