శ్రీచక్రధారిణి-త్రైలోక్య మోహన చక్రము-01
****************************
ప్రార్థన
********
" తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితేనవై
అష్టాదశ మహాద్వీపం సమ్రాడ్భోక్తా భవిష్యతి"
తల్లి అనుగ్రహము/ఆరాధనము అనే ఖడ్గము చేతధరించినవారికి వర్తమానములోనే కాకుండాభవిష్యత్తు నందును సామ్రాజ్యాధికారము ఉంటుందట.ఆసామ్రాజ్యము అష్టాదశ మహాద్వీపమట.అంటే మన ఉపాధిలోని దశేంద్రియములు+సప్తధాతువులు+మనస్సు అను మహాద్వీపములు,నారాయణతత్త్వము అను జలముతోచుట్టివేయబడిఉన్నవి.వానిని సన్మార్గములో సంరక్షించుకోగల అనుగ్రహము/ఖడ్గము అమ్మ కరుణ మాత్రమే.
పరమేశ్వరుడు పరమేశ్వరికి ప్రథమ ఆవరణమును ఈ విధముగా తెలియచేస్తున్నాడు.
దేవీ!
" చతురస్రం మాతృకార్ణైః మండితం సిద్ధిహేతవే
ముక్తా మాణిక్యఘటితం "సమస్థల" విరాజితం
త్రైలోక్య మోహనం నామ కల్పద్రుమ ఫలప్రదం"
ఈ ఆవరణము కల్పవృక్షమునకు అనుగ్రహశక్తినిచ్చిన,.కోరినకోరికలను తీర్చేశక్తిని కలిగియున్నది.అంతే కాదు సమతల ప్రదేశముగా , ముత్య మణి-మాణిక్య సహితమై మోహనత్వముతో పాటుగా,త్రితత్త్వములను కలిగి
"త్రైలోక్య మోహన చక్రముగా" కీర్తింపబడుచున్నది.
స్తోత్రము
*******
శ్రీచక్ర ప్రథమావరణదేవతాః
అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండే, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదినీ, సర్వమహాంకుశే, సర్వఖేచరీ, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ, విరాజితము.
ఈ ఆవరణము మూడువిభాగములను మూడుగీతలద్వారా ప్రకటింపడియున్నది.నాలుగువైపుల నాలుగు వేదములు ద్వారములుగా ప్రకాశిస్తుంటాయి.
యోగము అనగా అర్హత.అర్హతను అందించగలిగిన శక్తి యోగిని మాత.
భూపురచక్రములలో సిద్ధిమాతలు-మాతృకా మాతలు-ముద్రా మాతలు విరాజమానులై చక్రేశ్వరి యైన "త్రిపురను" సేవిస్తుంటారు.చేతనులకు సహాయపడుతుంటారు .
.త్రిలోకములను సమ్మోహనపరచే శక్తివంతముగా అమ్మ భువనేశ్వరియై విస్తరించినది కావున "త్రైలోక్య మోహన చక్రము" అనికూడా అంటారట.విస్తరణకు హద్దును నిర్ణయించినందుకు "భూపురము" అంటారట.
తెలుపు-ఎరుపు-పసుపు రంగులతో
మూడు ఊహా చతురస్రాకార రేఖలను కలిగియున్నది ఆవరణము.మూడు ప్రాకారములను నాలుగు వేదములు నాలుగు ద్వారములుగా రక్షిస్తుంటాయట.
"మానవ మేథ పరిమితము.అమ్మ అనుగ్రహము అపరిమితము"
.మాతృవాత్సల్యము అమ్మచేత తన అంశలను అనేకరూపాలుగా ప్రభవింపచేసి,అనేక ఆవరణములయందు నియమించి,వారికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించేటట్లుచేసింది.
రేఖా విశేషాలను పరిశీలిద్దాము.
అమ్మ విస్తరణ ప్రకటనమునకు ఆఖరిది-జీవుని పతనమునకు మొదటిది ఈ ఆవరణము.ఆవరణములోని మూడు రేఖలను త్రిగుణములుగా-మూడు అవస్థలుగా-మూడు శరీరములుగా,జీవుని మూలాధారముగా,'ల కార బీజముగా సంకేతిస్తారు.
మొదటి రేఖ యందు సిద్ధిమాత శక్తులు,రెండవ రేఖ యందు మాతృకా మూడవరేఖ యందు ముద్రా శక్తులు అవ్యాజానుగ్రహమును అందిస్తుంటాయట.
సాధకుడు "విశ్వ" నామముతో మొదటిరేఖా ప్రాంగణ ప్రవేశము చేసిన తరువాత అరిషడ్వర్గములు+పాప పుణ్యములు తనలో నిండియున్నాయన్న విషయమును గ్రహిస్తాడు.వాని అధీనములో తానుండుట వలనే తమోగుణముతో నిండియున్న విషయము అర్థమవుతుంది.దానిని తొలగించుకోగలగాలంటే,అష్టసిద్ధి శక్తుల /మాతల అనుగ్రహము తక్క అన్యము లేదు.ఇక్కద ఎనిమిది శక్తులు విద్య-అవిద్య రూపములతో ఎదురుబొదురుగా నున్నవి.మాయామోహితమైన జీవుని అవిద్యను తొలగించుట సిద్ధిమాతల లక్షణము
.
అణిమ-లఘిమ-మహిమ-ఈశిత్వ-వశిత్వ-ప్రాకామ్య-ఇఛ్చా,ప్రాప్తి-అను స్వభావ/గౌణ నామములతో కీర్తింపబడు వీరు,సాధకునికి తన తమోగుణమును విడిచిపెట్టుటకు సహాయపడుతూ,రెండవ రేఖా ప్రాంగణ ప్రవేశార్హతను కలుగ చేస్తారు.
రెండవ రేఖా ప్రాంగణములోనికి ప్రవేశించిన సాధకుని/జీవులను,
బ్రాహ్మీ-మాహేశి-కౌమారి-వైష్ణవి-వారాహి-మాహేంద్రి-చాముండా-(సప్తమాతృకలు) మహాలక్ష్మీ సమేతముగా ఆశీర్వదిస్తుంటారు.
సాధకుడు తనశరీరములోని సప్తధాతువులకు-మనసునకు వశుడై ఎన్నో ఇబ్బందులను పడుతుంటాదు..వాటిని తొలగించగల శక్తి కేవలము మాతృకానుగ్రహమే.
సప్తధాతువులు మనసు మాతృకానుగ్రహముతో శుద్ధిపొందిన సాధకుడు అహంకారమును విడనాడి,మూడవరేఖా ప్రాంగణ ప్రవేశార్హతను ( రజోగుణమును వీడి) పొందుతాడు.
మూడవరేఖా ప్రాంగణములోని ముద్రాశక్తులు సాధకుని తనను తాను తెలుసుకొనుటకు తన శరీరమును ఉపకరణముగా మలచుకునే విధానమును అనుగ్రహిస్తాయి.తన శరీర భంగిమలతో తనలో దాగిన శక్తిని జాగృతము చేసుకొనవచ్చన్న ఉపాయమును చెబుతాయి.(యోగ)
మూడురేఖలలోని మాతలు తమ అనుగ్రహమును/సహాయమును ప్రకటితము చేస్తూ,"ప్రకట యోగినులు" గా
కీర్తింపబడుతూ,తమ చక్రేశ్వరి అయిన "త్రిపుర" దగ్గరకు తీసుకునివెళ్ళి ,నమస్కరింపచేసి ఆమె ఆశీర్వాదమును పొంది,ఇంకొక మెట్టు ఎక్కి రెండవ చక్రమైన "సర్వాశా పరిపూరక చక్ర"ప్రవేశార్హతను కలిగిస్తారు.
అర్థము చేసుకోగలిగినవారికి చేసుకున్నంత.
మనముచ్చట
**********
మనము ఉపయోగించే ఫోనులొ మాట్లాడకుండ/ చాటింగ్ / 👍సంభాషణము చేస్తుంటాము.పెద్ద పెద్ద వాక్యములకు బదులుగా చిన్నచిన్న గుర్తులను పెడుతుంటాము.బొమ్మలను పెడుతుంటాము 😂ఈ విధానము కొత్తదేమి కాదు.
ఇక్కడ Q వరుస మూడు వరుసలుగా ఉంది.
మనము మనుషులము.మనలో దాగిన ఆశ,కోపము,పిసినారితనం మొదలగు
లోపలి శత్రువులు మనతో ఆడుకుంటాయి,వాని ఆటలను ఆపేందుకే అష్టసిద్ధులు అనే శక్తులు సహాయముచేస్తుంటాయి(.మొదటి వరుస దాటుట.)
మనము మనుషులము కనుక మనశరీరములో రక్తము-ఎముకలు-మాంసము అంటు ఏడు పదార్థములు ఎక్కువ తక్కువ క్రమములోనికి మారుతూ మన ఆరోగ్యమును కలవరపరుస్తుంటాయి.వాటిని నియంత్రించుకొనుటకు సహాయ పడే వి మాతృకా శక్తులు అంటారు.వారి సహాయముతో (రెండవ వరుస దాటుట).
మనము శారీరక-మానసికముగా ఆరోగ్యముగా ఉండాలంటే యోగా చేయాలంటాము కదా.ఆ యోగా విధానమునకు సహాయపడు శక్తి మాతలనే ముద్రాశక్తులు అంటారు.
ఇక్కడ సమస్య-పరిష్కారము ఎదురు-బొదురుగా ఉన్నాయి.
సమస్యలున్నాయంటే చీకటి ఉన్నట్లే.అదే తమోగుణము.
ఆ చీకటి మనచే అనేక
పనులను చేయిస్తూ-వాటి ఫలితములను అనుభవింపచేస్తుంది.గత జన్మలవి ఇప్పుడు-ఇప్పటివి మరుజన్మలలో.
వాటిని పూర్తిగా పోగొట్టుకోవాలంటే శరీరము అవసరము దానిని సాధనముగా మలచుకొని తరించే ఉపాయమును చూపే,
"తమసోమా జ్యోతిర్గమయా-దేవీ ఖడ్గమాల స్తోత్రము."
భువనేశ్వరి విలాస నిర్మితమైన త్రైలోక మోహన చక్రము ప్రకట యోగినుల పరిపాలినిగా/చక్రేశ్వరిగా "త్రిపురా దేవిని కలిగి యున్నది.సాధకుడు చక్రేశ్వరికి నమస్కరించి,ఆమె ఆశీర్వాద అనుగ్రహముతో మరొక మెట్టు ఎక్కే అర్హతను పొందుతాడు.
ఓం పృథ్వీ తత్త్వాత్మికాయై గంధం పరికల్పయామి.
సర్వం కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు.