Friday, June 30, 2017

ఓం నమ: శివాయ-20


   ఓం నమ: శివాయ-20

  పాశము విడువని  నాడూ యమపాశము విడిపించగలడ
  గంగను విడివని వాడు  నా బెంగను  తొలగించగలడ

  మాయలేడిని  విడువనివాడు  మాయదాడిని ఎదిరించగలడ
  విషమును  విడువనివాడు  మిషలను  కనిపెట్టగలద

  ఉబ్బును విడువని వాడు జబ్బులు  పోగొట్ట గలడ
  నృత్యము విడువని వాడు దుష్కృత్యములను  ఆపగలడ

  భిక్షాటన విడువనివాడు శిష్టుల రక్షించగలడ
  చిన్ముద్రను విడువనివాడు  ఆదుర్దా గమనించగలడ

  వింతరాగమున్నవాడు  వీతరాగుడవగలడ
  బైరాగిగ తిరుగువాడు  భగవంతుడు అవుతాడా

  అనాధుడనను వాడు  బాధలు తొలగించగలడ,అంటు
  బుగ్గలు నొక్కు కుంటున్నారురా  ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-21


ఓం నమ: శివాయ-22



      ఓం నమ: శివాయ-22

  అనిశము వశమగుతావు  పశునామములకు  నీవు
  పశుపతి అని పిలువగానే  పరవశమేగా  నీకు

  కాల భైరవుని  కాశికాపుర పతిని  చేశావు
  శరభమువై  నరసిం హుని  శాంతింప చేశావు

  మిక్కుటమగుప్రేమకల    కుక్కుటేశ్వరుడవు నీవు
  వ్యాళమును అనుగ్రహించిన  కాళేశ్వరుడవు నీవు

  స్కంధోత్పత్తికి వనమున లేడిగ కనిపించావు
  వ్యాఘ్రమునకు మోక్షమిచ్చిన  వ్యాఘ్రేశ్వరుడవు నీవు

  జంబుకమును  కరుణించిన  జంబుకేశ్వరుడవు
  శ్రీ కరి కాళములను దయతలచిన  శ్రీ కాళ హస్తీశ్వరుడవు

  పాశమేసి నన్ను బ్రోవ రమ్మంటే,నా భక్తిని
  కప్పల తక్కెడ  అంటావురా ఓ తిక్క శంకరా. 

ఓం నమ: శివాయ-23


    ఓం నమ: శివాయ-23

  నీ పాదము పట్టుకుందమన్న  చిందులేస్తు  అందకుంది
  నీ నడుమును  వేడుకుందామన్న పులితోలు  అలిగింది

  నీ హృదయము దరిచేరదమన్న  కుదరదు అని అంటోంది
  నీ చెవికి చెబుదామన్న  చెడ్డ  పుర్రె అడ్డుకుంది

  నీ చుబుకము  పట్టుకుందామన్న  విషము సెగలు కక్కుతుంది
  నీ కన్నుకు  కనిపిద్దామన్న  కొంచమైన  తెరువకుంది

  నీ  ముక్కుకు  చెబుదామంటే  మూసి జపము చేస్తున్నది
  నీ జటకు  ఉటంకిద్దామంటే  గంగవెర్రులెత్తుతోంది

  నన్ను రానీయక నీవు తమ సొంతమంటు  గంతులేస్తున్నవి
  సుంతయైన  కనికరమే చూపించలేమంటున్నవి

  నీ దరి  సేదతీరుతూ ఆదరమునే మరచిన వాటి
  టక్కరితనమును చూడరా  ఓ తిక్క శంకరా.   

ఓం నమ: శివాయ-24

ఓం నమ: శివాయ -24

చక్కదనపు నలుగునిడి స్నానము చేయిద్దామనుకుంటే
పుక్కిలింత నీళ్లతో సొక్కిపోయి ఉంటావు

పట్టు పుట్టాలు నీకు కట్టాలనుకుంటేను
గట్టిగా విడువనంటు చుట్టుకుంది పులితోలు

కనక భూషణములను కంఠమునకు వేయాలనుకుంటేను
కాలకూట విషము పాము కౌగలించుకున్నదాయె

ప్రేమతో పరమాన్నము తినిపిద్దామనుకుంటేను
పచ్చి మాంసపు ముక్క పచ్చి అనక ఉందాయె

పక్కింటి వాళ్లతో ఆడుకోమమటేను
నాకు పక్కిల్లే లేదని ఎక్కి ఎక్కి ఏడుస్తావు

ఎవరు నీకులేరను వారికి ఎరిగించు నిజమును
అక్కను నేనున్నానని ఓ తిక్క శంకరా.
......................................................................................................................................................................................................

ఓం నమ: శివాయ-25

ఓం నమ: శివాయ-25

కాదనలేవుగ పాముని,కాదనలేవుగ చీమని
కాదనలేవుగ లేడిని,కాదనలేవుగ వేడిని

కాదనలేవుగ దండని,కాదనలేవుగ కొండని
కాదనలేవుగ తేటిని,కాదన లేవుగ నీటిని

కాదన లేవుగ బూజుని,కాదనలేవుగ బూదిని
కాదన లేవుగ మేథని,కాదన లేవుగ వ్యాధిని

కాదనలేవుగ గౌరిని,కాదనలేవుగ శౌరిని
కాదనలేవుగ సుతులని,కాదనలేవుగ నుతునులని

కాదన లేవుగ విందుని,కాదనలేవుగ విందుని
కాదనలేవుగ మునులని,కాదనలేవుగ జనులని

ఒకే ఒక్కసారి నిన్ను ఒక్కడినే రమ్మంటే,ఈ
తొక్కిసలాటేమిరా ఓ తిక్క శంకరా

ఓం నమ: శివాయ-26

ఓం నమ: శివాయ-26

ఉదారతను చూపగ ఆ అసురుని ఉదరములో ఉంటివి
గంగిరెద్దు మేళము నిన్ను కాపాడినది ఆనాడు

కరుణను చాటగ ఆ అసురుని చేతికి అగ్గినిస్తివి
మోహిని సహాయము నిన్ను కాపాడినది ఆనాడు

భోళాతనమును చాటగ ఆ అసురునికి ఆలిని అందిస్తివి
నారద వాక్యము నిన్ను కాపాడినది ఆనాడు

ఆత్మీయత అనుపేర ఆ అసురునికి ఆత్మలింగమును ఇస్తివి
గణపతి చతురత నిన్ను కాపాడినది ఆనాడు

భ్రష్టులైన వారిని నీ భక్తులు అంటావు
రుసరుసలాడగ లేవు కసురుకొనవు అసురతను

మొక్కారని అసురులకు గ్రక్కున వరములనిస్తే
పిక్క బలము చూపాలిరా ఓ తిక్క శంకరా
..........................................

ఓం నమ: శివాయ-27

  ఓం నమ: శివాయ-27

  శ్రీకరుడౌ శివునికి కరివదనుని ప్రస్తుతి
  షడక్షరీ మంత్రధారికి షణ్ముఖుని ప్రస్తుతి

  ఆనంద తాండవునికి ఆ నందిముఖుని ప్రస్తుతి
  హరోం హర దేవునికి హయ వదనుని ప్రస్తుతి

   శుభకర శంకరునికి శుకవదనుని ప్రస్తుతి
   శితికంఠ   వదనునికి సిమ్హవదనుని ప్రస్తుతి

   కపర్ది నామధారికి కపివదనుని ప్రస్తుతి
   మేనక అల్లునికి మేషవదనుని ప్రస్తుతి

    ఆపదోద్ధారకునికి ఆ పతంజలి ప్రస్తుతి
    బ్రహ్మాండ నాయకునికి బహు ముఖముల ప్రస్తుతి

    నాపై కరుణచూప నీవు సుముఖముగా లేకుండుట,నీ
     టక్కరితనమేరా ఓ తిక్క శంకరా
...........................................................

ఓం నమ: శివాయ-28

ఓం నమ: శివాయ  -28

పాట పాడుచు నిన్నుచేర పాటుపడుచు ఒక భక్తుడు
నాటకమాడుచు నిన్నుచేర పోటీపడుతు ఒక భక్తుడు

నాట్యమాడుచు నిన్ను చేర ఆరాటపడే ఒక భక్తుడు
కవిత వ్రాయుచు నిన్నుచేర కావ్యమైన ఒక భక్తుడు

తపమాచరించుచు నిన్ను చేర తపియించుచు ఒక భక్తుడు
ప్రవచనముల నిన్ను చేర పరుగుతీయు ఒక భక్తుడు


చిత్రలేఖనముతో నిన్నుచేర చిత్రముగా ఒక భక్తుడు
నిందిస్తూనే నిన్నుచేర చిందులేయు ఒక భక్తుడు


నిలదీస్తూనే నిన్నుచేర కొలిచేటి ఒక భక్తుడు
అర్చనలతో నిన్నుచేర ముచ్చటించు ఒక భక్తుడు


ఏ దారిలో నిన్ను చేరాలో ఎంచుకోలేని ఈ భక్తుడు,నువ్వు
నక్కతోక తొక్కావురా ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-29

ఓం నమ: శివాయ-29

పాలకడలి జనించిన గరళము నిను చేరితే
మురిపాల పడతి హరిని శ్రీహరిని చేసింది

శరభరూపమున నీవు శ్రీహరిని శాంతింప చేస్తే
విభవమంత హరిదేగా ప్రహ్లాదచరిత్రలో

చిలుకు ఏకాదశి నాడు చకచక లేచేసి
దామోదరుడు నిన్ను చేరినది మోదము కొరకేగా


అభిషేక జలాలతో నీవు ఆనందపడుతుంటే
అలంకారాలన్నీ హరి తన ఆకారాలంటాడు


అనుక్షణము నీవు అసురులను చెండాడుతుంటే
లక్షణముగా హరి తులసిని పెండ్లాడాడు


అలసటయే నాదని ఆనందము హరిది అని
ఒక్క మాట చెప్పవేర ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-30

ఓం నమ: శివాయ -30

నెత్తిమీది గంగతప్ప నెత్తుటి బంధము ఏది
పొత్తు నీకు హరికితప్ప పొత్తిళ్ళలో సుఖము ఏది

లలాటమున కన్ను తప్ప బాలానందములు ఏవి
హెచ్చైన ఎద్దు తప్ప అచ్చట ముచ్చటలు ఏది

పిలవని పేరంటము తప్ప పెళ్ళికి సందడి ఏది
దక్షుని నిర్లక్ష్యము తప్ప లక్షణ మర్యాద ఏది


మింగుడుపడని విషము తప్ప మెరుగు అగు సంగతులేవి
పుక్కిటి పురాణములు తప్ప పురుషార్థములు ఏవి


అపాత్ర వరములు తప్ప ఈషణ్మాత్రపు ఈవి ఏది
పరుగుతీయు భయము తప్ప పరమపదము నీకు ఏది


లయముచేయు లయ తప్ప వలయునది లేదని,నే
నొక్కి చెప్పాలిరా ఓ తిక్క శంకరా.
.......................................................................................................................................................................................

ఓం నమ: శివాయ-31

ఓం నమ: శివాయ-31

గడ్డి పరకలతో చేసే బహుదొడ్డవైన పూజలు
మే,మే అని స్తుఇంచే మేకతల రుద్రాలు

కమ్ముకోను మేమనే నమ్ముకున్న తుమ్మిపూలు
ప్రత్యర్థుల బెదిరింపుకు పుట్టమైన పులితోలు

తప్పనిసరి ఐతేనే విచ్చుకునే కన్నులు
పరుగుతీయలేనట్టి మృగమున్న చేతివేళ్ళు


అమ్మ బాబోయ్ చలి అంటు మూతపడ్డ గుడులు
హద్దులు మీరుతు ఆకాశాన్నితాకే జడలు


దుమ్మెత్తిపోస్తుంటే గమ్మత్తుగ నవ్వులు
పాడుబడ్డగుహనున్నావని పాడుచున్న భక్తులు


పరిహాసాస్పదుడవగుచు పరమ శివుడు నేనంటే
ఫక్కున నవ్వుతారురా ఓ తిక్క శంకరా.
............

ఓం నమ: శివాయ-32

ఓం నమ: శివాయ-32

శశిశీతలకిరణములు నిను సతమతము చేస్తుంటే
గంగమ్మ నెత్తిమీద గజగజలాడిస్తుంటే

అభిషేకపు జలాలు అంతగా ముంచేస్తుంటే
పన్నీటి ధారలు మేము అల్లుకోమ అంటుంటే

చందనాల పూతలు చలి ముల్లులు గుచ్చుతుంటే
చుట్టుకున్న పాములు గుట్టుగ వణికిస్తుంటే


వింజామర గాలుల చలితెమ్మెర సాగుతుంటే
అయ్యో పాపం అంటూ అమ్మ నిన్ను పట్టుకుంటే


సగ భాగము మంచాయె చల్లదనపు అల్లరిలో
చల్లనైన కొండపై చెలువపు అర్థాంగితో నున్న


కొర కొర చూపులతో నిన్ను చలి కొరికేస్తుంటే
కిక్కురుమనవేమిరా ఓ తిక్క శంకరా

ఓం నమ: శివాయ-33

ఓం నమ: శివాయ -33

నీ క్షమా గుణము చూసి పులి శాంతముగా మారింది
పాపం,పులిని బెదిరిస్తు లేడి తరుముకు వస్తోంది

నీ పిరికితనమును చూసి పులి పిల్లిగ మారింది.
పాపం పిల్లి అనుకుని ఎలుక ఎగిరిపడుతోంది

నీ మంచితనము చూసి అగ్గి కన్ను తగ్గి ఉంది
పాపం తగ్గిందంటు మంచు దానిని ముంచి వేస్తోంది

నీ వ్యాపకత్వమును చూసి పాము తాను పాకుతోంది
పాపం పాకుతోందంటు దానితోక చలిచీమ కొరుకుతోంది

నీ పెద్దతనము చూసి కదలకుండ ఎద్దు ఉంది
పాపం,మొద్దు ఎద్దంటూ జనము దానిని ఎద్దేవా చేస్తోంది

సహనముతో నీ సహవాసము కోరిన వాటి
ఇక్కట్లను చూడవేరా ఓ తిక్క శంకరా.
...................................................................................................................................................................................

ఓం నమ: శివాయ-34

ఓం నమ: శివాయ -34

అరిషడ్వర్గాలను ఆహా నువ్వు బెదిరిస్తుంటే
అహముతో అసురగణము నిన్ను బెదిరిస్తోందా

బ్రహ్మ పుర్రె పట్టుకొని నువ్వు బిచ్చమెత్తుతుంటే
బ్రహ్మర్షులు చిత్రముగా నిన్ను బిచ్చమడుగుతున్నారా

పొంగుచున్న గంగను నువ్వు జటలలో బంధిస్తే
పంచాక్షరి వింతగ నిన్ను పట్టి బంధిస్తోందా


ఆ నందిని కైలాస కాపరిగ నువ్వు నియమిస్తే
బాణుడు శోణపురి కాపరిగా నిన్నే నియమించాడా


పరమ గురుడు శివుడు అని నేను స్తుతులు చేస్తుంటే
అఖిలజగము పరిహసిస్తు విస్తుబోయి చూస్తుందా


బందీలు ఎవరో తెలియని నా సందేహము తీర్చకుంటే
నిక్కము అనుకుంటానురా ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-35

ఓం నమ: శివాయ -35

చిన్ముద్రలు ఇష్టము,రుద్రాక్షలు ఇష్టము
అభిషేకము ఇష్టము,అవశేషము ఇష్టము

మహన్యాసము ఇష్టము,మహా శివరాత్రి ఇష్టము
బిల్వములు ఇష్టము,బిలములు ఇష్టము

తుమ్మిపూలు ఇష్టము,తుమ్మెదలు ఇష్టము
తాండవము ఇష్టము,తాడనము ఇష్టము


నిష్ఠూరములు ఇష్టము,అష్టోత్తరములు ఇష్టము
లయగ ఆడుట ఇష్టము,లయము చేయుట ఇష్టము


కాల్చుటయు ఇష్టము,కాచుటయు ఇష్టము
చందనాలు ఇష్టము,వందనాలు ఇష్టము


కష్టాలలో నున్న నాపై నీ ఇష్టము అందించుటకు నే
మొక్కులెన్ని మొక్కాలిరా ఓ తిక్క శంకరా

ఓం నమ: శివాయ-36


  ఓం నమ: శివాయ -36

కుమ్మరివి నీవంటే ఓటికుండ నవ్వుకుంది
కమ్మరివి నీవంటే లోహము నమ్మకమే లేనంది

వడ్రంగివి నీవంటే కొయ్యముక్క అయ్యో అంది
విల్లమ్ములు నీవంతే రెల్లుపూజ చెల్లు అంది

పైరు పచ్చ నీవంటే పంట-పంటలేసుకుంది
వైద్యుడివి నీవంతే ఔషధము నైవేద్యాలే అంది

గురువువి నీవంటే స్వరము విస్తుపోయింది
చల్లని ఇల్లు నీవంటే ఇల్లరికము ఇదే అంది

"నమో విరూపేభ్యో విశ్వ రూపేభ్యో" అని అనగానే
అన్ని రూపములు నీవేననుకుంటూ

ఆటు-పోటు లు   అందిస్తున్న నీ పనులు
చిక్కులెన్ని తెస్తాయో ఓ తిక్క శంకరా.


ఓం నమ: శివాయ-37


ఓం నమ: శివాయ -37

ఆపివేయ పలికినదియేగా శివతాండవ స్తోత్రము
శాపమీయ పలికినదియేగా శివ నక్షత్ర స్తోత్రము

కనకాభిషకమునకై కదీలినదియేగా కాశీఖండము
వీర శైవ ఉన్మాదమేగ బసవ పురాణము

శాశ్వత స్థావరమునకేగా శంకరాచార్య విరచితములు
మేక మేథ బోధలేగ నమక చమక స్తోత్రములు


దిగ్గజ అక్కజమేగా శ్రీ కాళ హస్తీశ్వర మహాత్మ్యము
అడిగి ఆలకిస్తావు ఆనంద భాష్పాలతో


అతిశయముగ చూస్తావు హర్షాతిరేకముతో
నిష్కళంక మనసు నిన్ను కొలిచినది శూన్యము


యుక్తితో ముక్తి కోరువారిని నీ భక్తులు అను మాయలో
చిక్కు కున్నావురా ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-38

ఓం నమ: శివాయ  -38

అగ్ని కార్య ఫలితములు అన్నీ ఇంద్రునికైతే
బృహస్పతి చేరాడు బుద్ధితో ఇంద్రుని

సరస్వతి చేరింది బృహస్పతిని చూసి ఆ ఇంద్రుని
వరుణుడు చేరాడు ఆదరణకై ఆ ఇంద్రుని

భూమికూడ చేరింది ఈవి కోరి ఆ ఇంద్రుని
గాలి వీచసాగింది నేరుగా ఆ ఇంద్రుని


విష్ణువు చేరాడు స్పష్టముగా ఆ ఇంద్రుని
అశ్వనీ దేవతలు ఆశ్రయించారు ఆ ఇంద్రుని


అవకాశమిది అని ఆకాశముం చేరింది ఆ ఇంద్రుని
పంచభూతములు నిన్ను వంచించేస్తుంటే


స్వార్థమంత గుమికూడి అర్థేంద్రముగా మారింది
నిన్ను ఒక్కడినే వేరుచేసి ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-39

            ఓం నమ: శివాయ-39

తిక్కవాడివై నీవుంటే భక్తుల మొక్కులెలా పెరుగుతాయి
మండే చెట్టువై నీవుంటే పక్షులెలా వాలుతాయి

కరిగే కొండపై నీవుంటే మృగములెలా తిరుగుతాయి
పారని గంగవై నీవుంటే జలచరములెలా బ్రతుకుతాయి

స్వార్థపరుడివై నీవుంటే అర్థనారీశ్వరము ఎలా అవుతుంది
శితికంఠుడివై నీవుంటే స్థితికార్యము ఎలా జరుగుతుంది


లయ కారుడివై నీవుంటే శృతిలయలు ఎలా నిన్ను చేరుతాయి
మన్నించమని నేనంటే నిన్నెంచను అంటావు


ఆదరమేదో నీది అవగతమయ్యెను,అంతలోన
ఆ నిందా వాక్యములు, అవి గతమయ్యెను వింతలోన


అంతలేసి మాటలాడ ముద్దుమాటలంటావురా
అద్దమంటి మనసున్న ఓ పెద్ద శంకరా.

ఓం నమ: శివాయ-40

ఓం నమ: శివాయ-40
భక్త పరాధీనతతో బడలిపోయి ఉన్నావని
నక్తపు నియమాలతో నకనకలాడుతున్నావని
భక్ష్యభోజ్య చోహ్యములు,లక్షణమగు లేహ్యములు
చవులూరు చెరకు రసము,ఆహా అను అతిరసములు
నారికేళ జలాలు,నానా తినుబండారాలు
మధురస మామిడిపళ్ళూ,మంచి నేరేడు పళ్ళు
చక్కెరకేళి పళ్ళు,చక్కనైన ద్రాక్షపళ్ళు
ఆరు రుచుల ఆథరువులు ఆత్మీయ సమర్పణలు
పోషణలేక నీవు సోషతో సొక్కిపోతావని
మక్కువతో తినిపించగ గ్రక్కున నేను వస్తే
విషము రుచి నీకంత విపరీతముగా నచ్చిందా
ఒక్కటైన ముట్టవేర ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-41

      Om nama: Sivaaya -41
బావిలోన నీవున్నావని భక్తుడిగా నేవస్తే
బావిలోని కప్ప నిన్ను తనతో పోల్చుకుంది
కొండమీద నీవున్నావని కొలువగ నేవస్తే
బండరాయి కూడ నిన్ను తనతో పోల్చుకుంది
బీడునేల నీవున్నావని తోడు కొరకు నేవస్తే
జోడువీడు అంటు బీడు తనతో పోల్చుకుంది
అటవిలోన ఉన్నావని అటుగా నేవస్తే
జటలు చూడు అంటు అడవి తనతో పోల్చుకుంది
చెట్టులోన ఉన్నావని పట్టుకొనగ నేవస్తే
పట్టులేక ఉన్నావని చెట్టు తనతో పోల్చుకుంది
సఖుడివి నీవై సకలము పాలిస్తుంటే
ఒక్కరైన పొగడరరేర ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-42


    శివ సంకల్పము-42

 మౌనము మాటాడునట మాయేదో చేసావులే
 మేధా దక్షిణామూర్తిగా బోధించే మాయేలే

 మూగయు మాటాడునట మాయేదో చేశావులే
 మూక పంచశతి అట కీర్తించే మాయేలే

 కాళ్ళకింద పద్మాలట మాయేదో చేసావులే
 పద్మపాదుడు అతడట గురుభక్తి మాయేలే

 పూవులే పళ్ళట మాయేదో చేసావులే
 పుష్పదంతుడు అతడట పుణ్యాల మాయేలే

 బోడిగుండు శివుడట మాయేదో చేసావులే
 శంకర భగవత్పాదులట శంక లేనే లేదులే

 మాయా సతిని చూసి అమ్మయ్య అని నువు మోస్తుంటే నే
 బిక్క చచ్చి పోయానురా ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-43

              శివ సంకల్పము-43

   కళల మార్పుచేర్పులతో కదలుచున్న చంద్రుడు
   నీ శిగముడుల చీకట్లలో చింతిస్తు ఉంటాడుట

   కుబుసపు మార్పుచేర్పులతో కదలాడు పాములు
   నీల లోహ చీకట్లలో చింతిస్తు ఉంటాయట

   కునుకురాక తెరువలేక కుదురులేని మూడోకన్ను
   తెరతీయని చీకట్లో చింతిస్తు ఉంటుందట

   ఆకాశము నుండి జారి సాగ అవకాశములేని గంగ
   బంధిఖాన చీకటిలో చింతిస్తు ఉంటుందట

   చీకటి తొలగించలేని జ్యోతి శివుడు నీవట
   చింతలు తొలగించలేని వింత సివుడు నీవట

   దోషము తొలగించలేని వానికి ప్రదోష కాల పూజల అని
   ఒక్కటే గుసగుసలు ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-44

  ఓం నమ: శివాయ-44

 తిరుగుచున్న భూమి అనే తీరులేని రథముతో
నారి కట్టలేని మేరుకొండ అనే వింటితో

 చేతి నుండి జారిపోవు కోతి అనే అస్త్రముతో
 ఎదుటి సేన కానలేని ఎగుడుదిగుడు కన్నులతో

 బారెడైన కప్పలేని కరిచర్మపు కవచముతో
 పుర్రె తప్ప మోయలేని కుర్రదైన చేతితో

 వీరముపై నీళ్ళు జల్లు నెత్తిమీది కుండతో
 శత్రువుల మూలమెరుగలేని శూలముతో

 పురములు దగ్గరైన రిపు జయమున్న వారితో
 నేనెవరో తెలుసా అంటూ నీవు డంభముతో

 లోహ త్రిపురలను జయించి ఆహా అనుకుంటుంటే
 బిక్కమోము వేసానురా ఓ తిక్క శంకరా.
..................................................................................................
...................................................

ఓం నమ: శివాయ-45

 ఓం నమ: శివాయ-45

 మౌనము మాటాడునట మాయేదో చేసావులే
 మేథా దక్షిణా మూర్తిగా బోధించేది మాయేలే

 మూగయు మాటాడునట మాయేదో చేసావులే
 మూక పంచశతిగా కీర్తించేది మాయేలే

 కాళ్ళకింద పద్మాలట మాయేదో చేసావులే
 పద్మపాదుడు అతడట గురుభక్తి మాయేలే

 పూవులే పళ్లట మాయేదో చేసావులే
 పుష్పదంతుడు అతడట పుణ్యాల మాయేలే

 బోడిగుండు శివుడట మాయేదో చేసావులే
 శంకర భగవత్పాదుడట శంక లేనే లేదులే

 మాయా సతిని చూసి అమ్మయ్య అని నీవు మోస్తుంటే,నే
 బిక్కచచ్చి పోయానురా ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-46

 ఓం నమ: శివాయ 46

 కూడు తినగనీవు కునుకు తీయగనీవు
 నీరు పారనీవు నాతీరు మారగనీవు

 పుర్రె జారగనీవు గొర్రె పెంటికలో ఉంటావు
 హాస్యము చూపిస్తావు వేశ్య చన్నులో ఉంటావు

 జన్నములు కానీయవు అన్నము దొరకనీయవు
 జలకమాడనంటావు జలములో ఉంటావు

 కాశి నేను అంటావు కార్తీకము అంటావు
 మంచిచెడులు చూడవు మాయలు చేస్తుంటావు

 రూపముతో ఉంటావు అరూపిని అని అంటావు
 ప్రదోషములో ఆడతావు అవశేషములు ఏరుతావు

 మరుభూమిలో తిరుగుతావు పరిపాలన జరుపుతావు,నీ తీరు
 చక్కదిద్దుకోవేమిరా ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-47



        ఓం నమ: శివాయ-47

 ఆంతర్యము ఏమోగాని వెలుగసలే తెలియని
 అమావాస్య జననానికి ఆనందపడతావు

 విడ్డూరము ఏమోగాని వినయమే తెలియని
 గంగ అభిషేకములకు పొంగిపోతు ఉంటావు

 పూర్వపుణ్యము ఎమోగాని పువ్వులే తెలియని
 మారేడు దళములకు మగ ఆనందపడతావు

 ఇంద్రజాలమేదోగాని అందమే తెలియని
 బూది పూతలకు మోజుపడుతుంటావు

 నీదయ ఏమోగాని నియమములే తెలియని
 నికృష్టపు భక్తులని నీదరి చేర్చుకుంటావు

 కనికట్టో ఏమోగాని అసలు నీ జట్టే తెలియని
 ఒక్కడిని ఉన్నానురా ఓ తిక్క శంకరా

ఓం నమ: శివాయ-48


   శివ సంకలపము-48
 నిన్ను బాణముతో కొట్టితే బాగా కరుణిస్తావు
 నిన్ను పాషాణుడివని తిట్టితే పరమ సంతోషిస్తావు

 నిన్ను రోకలిబండతో కొట్టిన కలికిని కనికరిస్తావు
 నిన్ను రాళ్ళతో కొట్టితే రయమున కనిపిస్తావు

 నిన్ను లెక్కచేయని వాని మొక్కులందుకుంటావు
 నిన్ను సేవించని వానికి సేవకునిగ మారుతావు

 నిన్ను ముప్పతిప్పలు పెట్టినా గొప్ప భక్తులంటావు
 నిన్ను రాపాడే వారినే కాపాడుతు ఉంటావు

 పరమ హింసలను చేస్తుంటే పరమ హంసలు అంటావు
 ఆత్మస్తుతి చేసేవాడిని ఆత్మీయుడు అంటావు

 నిజ భక్తుల కరుణించి నీచ భక్తులను నీవు
 పక్కకు పొమ్మనవురా ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-49

 శివ సంకల్పము-49

 నీకు మల్లే నీ నామమునకు నిలకడలేదురా శివా
 పెదవులు తెరుచుకోగానే పదమని పరుగెడుతుండి

 శంభో అని పిలువగానే అంభోరుహము చేరుతుంది
 శివ శివ అని పిలువగానే శిఖరాగ్రమును చేరుతుంది

 మహాదేవ అని పిలువగానే తుహినముగా మారుతుంది
 నీలగ్రీవ అని పిలువగానే వినీల గగనము అవుతుంది

 విశ్వనాథ అని పిలువగానే విశ్వమంత తిరుగుతుంది
 ఈశ్వరా అని పిలువగానే ఈడ ఉండనంటుంది

 ఉమాపతి అని పిలువగానే ఉరకలు ఆపేసింది
 పశుపతి అని పిలువగానే వశమయ్యాను అంది

 ఎవరేమని పిలిచినా ఎక్కడికి పోవద్దని దానికి
 ముక్కుతాడు వేయరా ఓ తిక్క శంకరా. 

ఓం నమ: శివాయ-50

   శివ సంకల్పము-50

  చేతులార పూజసేయ చెంతకు రావాలంటే
  చెట్టువు కమ్మంటావని చెప్పలేని భయం

  కనులారా దర్శించి కొలవాలనుకుంటేను
  కుక్కవు కమ్మంటావని ఎక్కడో భయం

  పాహి అంటు పాదములు పట్టుకోవాలనుకుంటే
  పాముగ మారమంటావని పాపిష్టి భయం

  తోడుగ ఉందమని వేడుకోవాలనుకుంటేను
  కోడివి కమ్మంటావని నీడలా ఏదోభయం

  హర హర మహదేవుడని వరము కోరుకోవాలంటే
  శరభము కమ్మంటావని నరనరములలో భయం

  అభయము అడగాలంటే అడుగడుగున భయము నాకు
  మొక్కవోని ధైర్యమీయరా ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-51

 ఓం నమ: శివాయ-51

 గడ్డి పరకలతో చేసే బహుదొడ్డవైన పూజలు
 మే,మే అని స్తుఇంచే మేకతల రుద్రాలు

 కమ్ముకోను మేమనే నమ్ముకున్న తుమ్మిపూలు
 ప్రత్యర్థుల బెదిరింపుకు పుట్టమైన పులితోలు

 తప్పనిసరి ఐతేనే విచ్చుకునే కన్నులు
 పరుగుతీయలేనట్టి మృగమున్న చేతివేళ్ళు

 అమ్మ బాబోయ్ చలి అంటు మూతపడ్డ గుడులు
 హద్దులు మీరుతు ఆకాశాన్నితాకే జడలు

 దుమ్మెత్తిపోస్తుంటే గమ్మత్తుగ నవ్వులు
 పాడుబడ్డగుహనున్నావని పాడుచున్న భక్తులు

 పరిహాసాస్పదుడవగుచు  పరమ శివుడు నేనంటే

 ఫక్కున నవ్వుతారురా ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-52

 ఓం నమ: శివాయ-52

 శివునితల్లి బెజ్జమహాదేవి అంటున్నారు
 శిలాదుడు తండ్రి అని వింటున్నాను

 శివుని అక్క మగాదేవి గారాబము చేస్తుందట
 శివుని పత్ని పార్వతి పరిపాలించేస్తున్నదట

 గణపతి,గుహుడు నీ సుతులంటున్నారురా
 శివుని సఖుడు హరి అట చెప్పుకుంటున్నారు

 శివ భక్తి పక్షులదని చాటిచెప్పుతున్నాయి
 శివ లీలలు యుగయుగము కనువిందుం చేస్తున్నవి

 భావనతో నిండినది బహుచక్కని కుటుంబము
 "బ్రహ్మ జ్ఞాన వలీనము"బహు బాగుగ చెబుతున్నది

 "అసంగోహం అసంగోహం అసంగోహం పున: పున:" అంటు
 చక్కనైన మాటలేర ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-53

   ఓం నమ: శివాయ-53

 విశ్వ నాథుడివని నిన్ను విబుధులు మాట్లాడుతుంటే
 అనాథుడిని నేనంటూ ఆటలాడుతావు

 పరమ యోగీశ్వరుడవని నిన్ను ప్రమథగణము అంటుంతే
 పార్వతీ సమేతుడినని ప్రకటిస్తూ ఉంటావు

 భోళా శంకరుడవని నిన్ను భక్తులు భళి భళి అంటుంటే
 వేళాకోళములేయని  అంటావు   వేడుకగా

 నాగాభరణుడవని నిన్ను  యోగులు స్తుతి చేస్తుంటే
 కాలాభరణుడిని అంటు లాలించేస్తుంటావు

 విషభక్షకుడవు అంటు ఋషులు వీక్షిస్తుంటే
 అవలక్షణుడిని అంటూ ఆక్షేపణ తెలుపుతావు

 మంచి చెడులు మించిన చెంచైన దొర నీవు
 వాక్కు నేర్చినాడవురా ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-54

  ఓం నమ: శివాయ-54

 గడ్డి పరకలతో చేసే బహుదొడ్డవైన పూజలు
 మే,మే అని స్తుఇంచే మేకతల రుద్రాలు

 కమ్ముకోను మేమనే నమ్ముకున్న తుమ్మిపూలు
 ప్రత్యర్థుల బెదిరింపుకు పుట్టమైన పులితోలు

 తప్పనిసరి ఐతేనే విచ్చుకునే కన్నులు
 పరుగుతీయలేనట్టి మృగమున్న చేతివేళ్ళు

 అమ్మ బాబోయ్ చలి అంటు మూతపడ్డ గుడులు
 హద్దులు మీరుతు ఆకాశాన్నితాకే జడలు

 దుమ్మెత్తిపోస్తుంటే గమ్మత్తుగ నవ్వులు
 పాడుబడ్డగుహనున్నావని పాడుచున్న భక్తులు

 పరిహాసాస్పదుడవగుచు  పరమ శివుడు నేనంటే

 ఫక్కున నవ్వుతారురా ఓ తిక్క శంకరా.

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...