Friday, October 28, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-20

 శ్లో :  సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచ-గిరౌ

నటత్య్-ఆశా-శాఖా:-వటతి  ఝడితి  స్వైరమ్-అభితః

కపాలిన్ భిక్షో  మే హృదయ-కపిమ్-అత్యంత-చపలం

దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో    20


ప్రస్తుత శ్లోకములో ఆదిశంకరులు రెండు విభిన్న స్వభావములగురించి దాని పరిణామములగురించి తెలియచేస్తున్నారు. మొదటిది చంచలత్వము-దీనత్వమునకు కారణమగుచున్నది. రెండవది ధృఢత్వము-దైవత్వమునకు సంకేతమైనది. చంచలత్వము సత్యాసత్యములను గమనించలేని అసమర్థతతో ఎన్నెన్నో పనులను చేస్తుంది. అబద్ధమును నిజమనుకుంటుంది.సత్యమును గుర్తించలేక అసత్యమునే సత్యమనుకుంటుంది. అడవి గమనశక్యముకానిది.అందులోను సామాన్యమైనదికాదు.మోహమనే భ్రాంతితో నిండినది. చంచలత్వము అక్కడకు వెళ్ళాలనుకుంటున్నది.పోనీ వెళ్ళీన తరువాత నైన స్థిరముగా ఉండాలనుకోదు.అందులో అత్యంత ఆకరషణీయముగా నున్న ఎత్తైన కొండలపై నెక్కి నర్తించాలనుకుంటుంది.ఆ రంగస్థలము జవసత్వములు తగ్గగనే కిందికి నర్తకుని పడవేయునది. పటుత్వములేని దురాశ అనెడి కొమ్మలపై గంతులేస్తుంది. దాని వరుస మార్చలేని నన్ను బ్రహ్మ యొక్క దురాలోచనలను తుంచివేసిన ఓ మహాదేవ! నీపై భక్తి యను గట్టి పాశముతో బంధించివేయుము.తిరిగి మారకుండా నా చంచలత్వమును నేను సమర్పించు భిక్షగా స్వీకరింపుము.నన్ను మోహము బారి నుండి విముక్తుని చేయమని ప్రార్థించుచున్నారు. సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.




TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...