"కదంబ వన చారిణీం ముని కదంబ కాదంబినీం
నితంబ జిత భూధరాం సురనితంబినీ సేవితాం
నవాంబురుహలోచనాం అభినవాంబుదశ్యామలాం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీం ఆశ్రయే"
అనిప్రస్తుతించారు అమ్మను ఆదిశంకరులు.
హయగ్రీవ-అగస్త్యసంవాదమైన లలితా రహస్య సహస్రనామస్తోత్రము,
"మూలప్రకృతి అవ్యక్తా వ్యక్తావ్యక్త స్వరూపిణి"అని సంకీర్తించింది.
వ్యాపినీ వివిధాకారావిద్యావిద్యాస్వరూపిణి గా సన్నుతించింది.
మూలప్రకృతి అంటే ఏమిటి?
అది వ్యక్తరూపముగా ఎప్పుడుంటుంది?
అది అవ్యక్త రూపముగా ఎప్పుడుంటుంది?
పరమాత్మ తాను ప్రకాశ+విమర్శ రూపమైన పరంజ్యోతిగా ప్రకాశించటము పరారరహస్యయోగము.అదియే మనము బిందువు రూపముగా తెలుసుకోబోతున్న "సర్వానందమయ చక్రము" పరంజ్యోతి పరమేశ్వరి ,
'సత్యజ్ఞానందరూపా-సామరస్య పరాయణా" గా ప్రకాశములో అంతర్లీనమైన అద్భుత సన్నివేశము.
సర్వానందమయ చక్రము-తొమ్మిదవ ఆవరణము
*****************************
సర్వసిద్ధిప్రద-సర్వమంగళకారిణి అయిన పరమేశ్వరి,
సర్వులకు-సర్వవేళల-సర్వవిధములుగా ఆనందమును కలిగించు సన్నివేశము/సందర్భము."కామకళా రూపముగా" శివశక్తులు పంచకృత్యములను జరిపి ,
1. ద్వైతము అద్వైతముగా పరిణామము చెందిన ఆనందము.
2.అజ్ఞానము సంపూర్నజ్ఞానమయమైన ఆనందము.
3.విమర్శ+ప్రకాశము మమేకమై ప్రకాశిస్తున్న ఆనందము
4.దేశ+కాలములు/సమయ+స్థలములు సద్దుమణిగిన ఆనందము
5.జీవాత్మ పరమాత్మగా ఐక్యమైన ఆనందము
6.ప్రకటనము లుప్తమై గుప్తముగా నున్న ఆనందము
7.బహిర్ముఖము వీడి అంతర్ముఖము అందించే ఆనందము
8.ఏ ఆవరణము చే కప్పబడని మూలబిందు తత్త్వ ఆనందము
9.ప్రకృతి/పరమేశ్వరి రూపాంతర స్థితి అని తెలియబడిన ఆనందము
10.చేతనులు జన్మచక్ర పరిభ్రమనమునుండి విముక్తి పొందిన ఆనందము
11.మూల స్వరూపమైన శివశక్తి+జీవ స్వరూపమైన శక్తి,
సాకారమునుండి నిరాకారముగా,సగుణమునుండి నిర్గునముగా
సింధువు లోని బిందువు సవికల్పమునిర్వికల్పముగా యథాస్థితికి చేరిన ఆనందమే
సర్వానందమయ చక్ర వ్యవహార నామము కల ఆత్మసిద్ధి.
సాథకుడు సర్వయోని ముద్ర అనగా విశ్వమాతగా/మూలకారనముగా బిందువును గ్రహించిన సమిష్టి ఆనందము.
బ్రహ్మ స్వరూప/బ్రహ్మ తత్త్వ అవగాహన యైన ప్రాప్తిసిద్ధి అనుగ్రహించిన ఆనందము.
మిథ్యాప్రపంచమునుండి సాధనను ప్రారంభించినచేతనుడు విద్యాప్రపంచమున అడుగిడి ఆత్మానమును అనుభవించు అమ్మ అనుగ్రహమునకు అనేకానేక ప్రాతులను సమర్పిస్తూ,
యాదేవి సర్వభూతేషు మోక్ష రూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్త్యై నంస్తస్త్యై నమోనమః.
సర్వం శ్రీమాతాచరణారవిందార్పణమస్తు.