బావిలో నీవున్నావని భక్తుడిగా నేవస్తే
బాచిలోని కప్ప నిన్ను తనతో పోల్చుకుంది
కొండమీద నీవున్నావని కొలువగా నేవస్తే
బందరాయి కూడ నిన్ను తనతో పోల్చుకుంది
బీడునేల నీవున్నావని తోడు కొరకు నేవస్తే
జోడువీడు అంటు బీడు తనతో పోల్చుకుంది
అటవి లోన నీవున్నావని అటుగా నేవస్తే
జటలుచూడు అంటు అడవి తనతో పోల్చుకుంది
చెట్టులోన నీవున్నావని పట్టుకొనగ నేవస్తే
పట్టులేక ఉన్నావనిచెట్టు తనతో పోల్చుకుంది
సఖుడివి నీవై సకలము పరిపాలిస్తుంతే
ఒక్కరైనపొగడరేల ఓ తిక్క శంకరా!.