భావనామాత్ర సంతుష్టా-అతిరహస్యయోగినులు
***************************
సర్వసిద్ధిప్రద చక్రముగా కీర్తింపబడు పాపిట స్థానములో నున్న నాలుగు ఆయుధశక్తులను,అవస్థలను నియంత్రించు మూడు శక్తులను అతిరహస్య యోగినులుగా ప్రస్తుతిస్తారు.ఊహా చతుర్స్రములో దాగిన త్రికోణములోని మూడు బిందువులను జాగ్రత్-స్వప్న-సుషుప్తులను సమన్వయ పరచి,సాధకునకు సహాయపడు మహాకామేశ్వరి-మహావజ్రేశ్వరి-మహాభగమాలిని నామములతో స్తుతిస్తారు.త్రికోణ మూడు కోణములలో నున్న బిందువులుగా భావిస్తారు.చతురస్ర నాలుగు బిందువులను చాపిని-బాణిని-పాశిని-అంకుశిని అను నాలుగు శక్తులుగా,వాటి స్థానములను చతురస్ర నాలుగు మూలల బిందువులుగాను భావిస్తారు.
సాధకుని మనసనే ధనువు సంధించే జ్ఞానేంద్రియ బాణములను కళ్ళెములు లేని గుర్రములవలె పరుగెత్తనీయకుండా పాశమనే సక్తిదయతో,అంకుశమనే విచక్షణను కలిగించి,జడత్వమును నిర్మూలించి శుద్ధచైతన్యము దర్శించు పాత్రతను కలిగించును.
వీరినే అశ్వారూఢా,సింధురవ్రజా,వారాహి రూపములుగాను భావిస్తారు.ఇవన్నీ
ఆ శక్తుల సంకేత నామములు.సర్వశుభంకరములు.