ప్రకటయోగినులుగా 28 శక్తిదేవతలు కీర్తింపబడుతారు.వీరుండు స్థానమును త్రైలోక్యమోహనచక్రము అని అంటారు.మూడు ఊహా చతురస్త్రాకారాములుగా విభజింపబడినది.ఈ మూడు విభాగములను భూపురములు అంటారు.
మూడవ భూపురములో ప్రాప్తి-సర్వకామ అను రెండు ప్రత్యేకసిధ్ధులతోపాటుగా అణిమ-గరిమ-లఘిమ మొదలగు అష్టసిద్ధులు వెరసి 10 శక్తులు పరిపాలిస్తుంటాయి.
మూలాధారమునకు సంబంధించిన శక్తులు చర్మచక్షువులు గుర్తించగలవు.
రెండవ భూపురములో మహాలక్ష్మి అను ప్రత్యేక స్థితితోపాటుగా బ్రాహ్మీ-మాహేశ్వరి-కౌమారీ-వైష్ణవీ మొదలగు మానసిక స్థితులు కొలువై ఉంటాయి.
సాధకునకు తనయొక్క మూలమును తెలుసుకోవాలనే తపనను కలిగించి అనువైన అన్వేషణ మార్గమును చూపిస్తాయి.
వీరినే అరిషడ్వర్హ సమూహముగాను,సప్తధాతు సమాహారముగాను మరొక కోణములో భావిస్తారు.
మొదటి భూపురములో సంక్షోభిణి,విద్రావిణి,ఆకర్షిణి,వశంకరి మొదలైన ముద్రాశక్తులు సహాయపడి సాధకునిలోని జడత్వమును తొలగించి,చైతన్యవంతుని చేయుటకు తనను తాను తెలుసుకోవటానికి సర్వాశాపరిపూరక చక్రమును పరిచయము చేస్తాయి.