దేవిఖడ్గమాల-ఉపోద్ఘాతము-03
*********************
మహా మహిమాన్వితమైన దేవిఖడ్గమాలస్తోత్రము/శుద్ధసక్తి మాలా మహామంత్రముసనాతన సంప్రదాయమునూనుసరిస్తూ,
1.స్తోత్ర నామము
2.స్తోత్రమునూ అనుగ్రహించినఋషి
3.స్తోత్రములో నిక్షిప్తమైన దేవత/స్వభావము
4.స్తోత్రములో ప్రయోగించబడిన ఛందస్సు
5.స్తోత్ర సూక్ష్మరూపమైనబీజము
6.స్తోత్ర బీజములో దాగిన శక్తి
7.స్తోత్ర మహాత్మ్యమును తెలియచేయు కీలకము/ఉపాయము
8.స్తోత్ర పారాయనమునుచేయూఅవశ్యకత/లక్ష్యము
9.మూలశక్తీనుగ్రహము అను తొమ్మిదీంసములతోనవనవ లావణ్య నిధి నవనవోన్మేషముగా విరాజిల్లుచున్నది అన్నమాట నిర్వివాదము.
కొంచము విశదముగా తెలుసుకునే ప్రయత్నముచేద్దాము.
శ్తోత్రము పేరు/స్తోత్రములో దాగిన మంత్రము పేరు,
"అస్య-శ్రీ-శుద్ధ-శక్తి-మాలా-మహామంత్రస్యా అని చెప్పబడినది.
స్తోత్రమునకు-పరమాత్మకు భేదములేదు.
అస్య-ఈ పరమాద్భుత స్తోత్రము మూడు శుభలక్షనములను కలిగియున్నది.అవి,
శ్రీ-శుభప్రదమైనది
శుద్ధ-అతిపవిత్రమైనది.
శక్తి-శక్తివంతమైనది.
అమ్మతో పాటుగా తొమ్మిది ఆవరనములలోనున్న పరివారదేవతా శక్తులను సైతము గుర్తించి,అర్చి,ంచే మంత్రముల సమూహముకనుక ఇది మాలామంత్రము.
మనము పరమాత్మను ఏ రూపముతో/ఏ స్తోత్రముతో ఆరాధిస్తామో అది మహామంత్రము.
కనుక దేవీ ఖడ్గమాలా స్తోత్రము మహామంత్ర మాల.
మహిమాన్విత నాదమే మంత్రము.
మననాత్ త్రాయతే ఇతి మంత్రః.
మననముచేసేవారిని రక్షించేదిమంత్రము.
2.రెండవ అంశమైన స్తోత్రకర్తను తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.
దేవీఖడ్గమాలా స్తోత్రము"వామకేశ్వర తంత్రములోని"ఉమామహేశ్వర సంవాదముగా ప్రసిద్ధికెక్కినది.
దీనినిమనకందించిన వార వరుణాదిత్య ఋషి.
వరుణ అనగా జలతత్త్వము-ఆదిత్య అగ్నితత్త్వము.ఒకవిధముగా అగ్నిసోమాత్మకము అని చెప్పుకోవచ్చును.
అదే స్థావర-జంగమాతమకముగా కూడా అన్వయించుకోవచ్చును.
ద్రష్టలైనఋషులకు ఆతత్త్వముప్రకృతి-పురుషులైన జగతం పార్వతీ-పరమేశ్వర తత్త్వముగా కూడాభావించుకోవచ్చును.
ర్షి ధ్యానము మనైంద్రియములను సన్మార్గము వైపునకు మళ్ళించి స్వస్వరూపమును-నాలోని నన్ను/నేను ని గుర్తించటానికి సహాయపదతాడు.
కనుక ఆ ఋషిని,
ఉపస్థేయ-నన్ను నీ సమీపమునందు కూర్చుండపెట్టుకుని స్తోత్రపఠనము/ప్రకాశమును దర్శింపచేయమని,సర్వస్య శరణాగతితో ప్రార్థించుట ఆచరణనీయము.
3.స్తోత్రములో నిక్షిప్తమైన దేవతా స్వరూపమును తెలుసుకోగలుట తదుపరి విధానము.
దేవీఖడ్గమాల స్తోత్రములో,
"సాత్త్విక కకార భట్టారిక పీఠస్థిత
కామేశ్వరాంకనిలయాం
మహా కామేశ్వరీ
శ్రీ లలితా భట్టారికా దేవతా"
అని చెప్పబడినది.వారు అవిభాజ్యులు.ఒకరికొకరు ఆలంబనగా నుండి సర్వజగములను రక్షించుచున్నవారు.
ఆ తల్లి దేవదేవుని దివ్యమహిషి.మహా పతివ్రత.
ఆ కామేశ్వరుడు స్తావరముగా తానుంటూ,ఆ తల్లి ద్వారా తన శక్తిని ప్రకటింప చేస్తూ జంగమాత్మక మగుచున్నాడు.
ఇంకొకవిధమైన అన్వయము ఎవరు దేనిని చూస్తుంటారో వారు కామేశ్వరులు.
ఏది యైతే చూడబడుతోందో అదికామేశ్వరి.
అనుగ్రహించువాడు కామేశ్వరుడు.దానిని సకల చరాచరములకు అందించు శక్తి కామేశ్వరి.
4.స్తోత్ర ఛందస్సు దేవీ గాయత్రీ .
ఋషులు జ్ఞానులు మహానుభావులు తమ మానవాతీత శక్తులతో మూలపదార్థమును(నిరాకార/నిర్గుణ/నిరంజనమును)దర్శించి సేవించుకోకలుగుతారు.కానిసామాన్యచేతనులకు అసాధ్యము కనుకవారు మనపైదయతో ఆ అపరిమిత శక్తికిఒక స్వరూపమును-శబ్దములను సంక్షిప్తీకరించి శబ్దమే శక్తిగా,నిధిధ్యాసము చేసికొనుటకు గాయత్రీ మాతగా/మంత్రముగా మనకు అందించారు.
స్తోత్రమునకు
ఐం-బీజముగా,క్లీం శక్తిగా-సౌ-కీలముగా చెప్పబడినవి
భువనేశ్వరి దేవిబీజము-అవ్యాజ అనుగ్రహము బీజములో నిక్షిప్త పరచబడిన శక్తి.
మనలో దాగిన చైతన్యమును-మనచుట్టు నిండిన చైతన్యమును/స్థూలమునకు-సూక్ష్మమునకు గల అవినాభావ సంబంధమును తెలిసికొనుటకు మనలోనీజ్ఞానమనే-అహంకారమనే-అలసత్వమనే అడ్దంకులులనుఖండించే అమ్మానుగ్రహమే ఖడ్గసిద్ధిప్రాఒతికి చేతనులు స్తోత్ర ప్రాశస్త్యమును తెలిసికొని-పారాయన చేసినచో అమ్మక్షిప్రప్రసాదిని.మనమూద్ధరింపబడతాము.
శ్రీ మాత్రే నమః.