నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః ।
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః ॥ 18 ప్రస్తుత శ్లోకమును గురించి అర్థముచేసుకునేందుకు ముందుగా నమస్కారమహిమ గురించి ఒక్కసారి ముచ్చటించుకుందాము.
పంచప్రణవములలో అందరికి అందుబాటులో నున్న ప్రక్రియయే నమస్కారము.
1.ఓంకారము
2.స్వాహాకర్ము
3.స్వధాకారము
4,వహట్కారము
5.నమస్కారము అను
ఐదు ప్రక్రియలను పంచ ప్రణవములుగా చెబుతారు.
ప్రణవము మాటను మహిమోపేత మంత్రముగా మలుస్తుంది.నం మమ అను నేను అన్నది లేదు-నేనుగా భావింపబడుతున్న ఉపాధిలో నున్నది నీవే పరమాత్మ అన్న సందర్శమునిచ్చునదే నమస్కారము.
పరమాత్మ సూర్యునిగా అనేకానేక గౌణనామములతో నమస్కరింపబడుతున్నాడు.
ప్రస్తుత శ్లోకములో స్వామి ఉగ్రాయ-వీరాయ-సారంగాయ-పద్మప్రబోధాయ-ప్రచండాయ -మార్తాండాయ అను వివిధ సంకేతములతో ప్రస్తుతింపబడుతున్నాడు.
ఉర్గుడు-వీరుడు-సారంగుడు అను మూడు నామములు పరమాత్మ అవ్యాజ అనుగ్రహమును మరింత సుస్పష్టము చేయుచున్నవి.
స్వామి సారంగుడు అని స్తుతింపబడునప్పుడు అతి తక్కువ సమయములో తన కిరనములచే అతి విస్తీర్ణమును వ్యాప్తి చెందువాడు అని స్వామి కిరణ వ్యాపకత్వమును తెలియచేస్తున్నారు.
ఇదే విషయమును కిందటి శ్లోకము ఏ ప్రదేశమునుండి కిరనములు ప్రకటింపబడి ప్రకాశిస్తున్నాయో ఆ దిక్కునే పూర్వ-తూరుపుగాను,ఎక్కడ కనుమరుగగుచున్నవో ఆ ప్రదేశమును పశ్చిమ దిక్కుగాను వ్యవహరిస్తున్నారు.దిక్కులకే దిక్కు ఆ పరమాత్మ.
"ఉగ్రాయ"....
శబ్దమును అర్థముచేసుకునే ప్రయత్నమును చేద్దాము.
ఆదిశంకరులు మనకు అందించిన "లక్ష్మీనృసిమ్హ మమదేహి కరావలంబం" అన్న సూక్తిని ఆధారముచేసుకుని ఉగ్రాయ అంటే ఘోరస్వరూపమైన భయంకరునిగా చెప్పుకోలేము.
రుద్రనమకము సైతము,
నమ ఉగ్రాయ-భీమాయ అని ఉగ్ర శబ్దమును ప్రస్తావించినది.
ఉగ్రము-అనగా ఉత్కృష్ట స్థితి.
ఉత్-గ్రసతి-ఉగ్ర అనగా అన్నింటికిని మించిన ఆనందస్థితి.
ఉత్కృష్టస్థితియే తానైన వాడు ఆశ్రితులకు అనుగ్రహించువాడు ఉగ్రుడు.వానికి నమస్కారము అనుటయే
నమః ఉగ్రాయ.
నమః వీరాయ
............
వివిధ ఈరయతి -వీరాయ.
వివిధ గతులలో సంచరించువాడు-వివిధగతులను అనుగ్రహించువాడు వీరుడు.
తన శక్తిచే వివిధ ఉపాధులలో సంచరించుచు వివిధ ప్రవృత్తులుగా ప్రకటనమయే వాడు వీరుడు.
జలచరములకు ఈత-ఖగచరములకు గగన విహారము-నెమలికి కులుకు-కోయిలకు పలుకు-ఇలా అనేకానేక ప్రాభవ ప్రకటనమును చేయువాడు వీరుడు.వానికి నమస్కారములు.
నమః సారంగాయ
..............
తన ఔదార్యముతో చేతిని అందించీందుకోగల ప్రావీణ్యమును ప్రసాదించిపరంధామమునకు చేర్చు పరమాత్మయే
ఉగ్రుడు-వీరుడు-సారంగుడు.
చేతనులకు కావలిసిన వికసన శక్తిని తన కిరనముల తాకిడిచే అనుగ్రహించువాడు పద్మప్రబోధనుడు.
పద్మము బాహ్యమునకు సూర్యోదయముచే వికసించును.మంత్రపుష్పములో చెప్పబడినట్లు హృత్పద్మము స్వాము కృపాకిరణముల స్పర్శచే వికసనమగును.అట్టి వికసనమును జరిగిన తరువాతనే జీవుడు పరమాత్మ తన చేతిని అందుకుని ఉత్కృష్టస్థితిని అందించమని వేడుకోగలుగును.స్వామి ప్రచండత్వమును తన అజ్ఞానమును-అపరాధములను ఖండించగల పరమాత్మ తత్త్వమును అర్థముచేసుకోగలుగును.ప్రార్థనచేయగలుగును.పరమార్థమును పొందగలుగును.
తం సూర్యం ప్రణమామ్యహం.