Wednesday, March 29, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(SAPTASAPTIMAREECHIMAAN)-10

 ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ ।

సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ॥ 10 ॥


  పూర్వభాగ పరిచయమును ముగించుకొని,ప్రస్తుత శ్లోకము నుండి మనము ఆ పరమాత్మ యొక్క నేకానేక గౌణ నామములద్వారా జగత్పాలనా విశషములను అర్థముచేసుకునే ప్రయత్నమును చేద్దాము.

 ఆదిత్యుడు,సవితుడు,సూర్యుడు,ఖగుడు,పూషుడు,గభస్తిమానుడు,హిరణ్యసద్రుశుడు,భానుడు,సువర్ణరేతస్సుడు,దివాకరుడు అనే నామ ప్రాశస్త్యము వివరింపబడుతోంది.

 ఆదిత్య నమోనమః
  ...............
 దితి ఖండింపదగినది.విడదీయబడునది.దానికి విరుద్ధముగా అఖండముగా అవిభాజ్యముగా నున్నది అదితి.అదియే అఖండము.
 అదియే "ఆత్మజ్ఞానము-అసలు వీడనిది."స్థిరముగా మనలో నిలిచి మనలను ఉద్ధరించునది.దానిని అనుగ్రహించువాడే ఆదిత్యుడు.
 సవితః నమోనమః
 .............
 సువి ప్రాణ సవిత.ప్రసవము అని మనము ఉపయోగించు పదము సవితాశక్తియే.సృష్టి చేయుటకు,విస్తరించుటకు అనుకూలమైన సూర్యశక్తియే సవిత అని గౌణనామముగా ఉపయోగించబడుతున్నది.
 సూర్య
 ......
 సువతి రమయతి సూర్య అన్నది ఆర్యోక్తి.సుష్టు ఇరయతి సూర్యః.వాయు సంచారమునకు తగిన ఉష్ణమును అందించువాడు సూర్యుడు.
 సురసుర-చరచర తన కిరణములచే శక్తిని భూమిమీదకు ప్రసరించువాడు కనుకనే సౌరిగా సూర్యశక్తి కీర్తింపబడుతున్నది. 
 ఖగ
 ....
 ఖ అనగా ఆకాశము.గ అనగా గమనముచేయగల శక్తి.ఆకాశమునుండి తన శక్తిని భూమి మీదకు ప్రసరిస్తూ పాలించువాడు.
 ఖగ అను శబ్దము ధర్మాచరనమునకు సంకేతముగా పక్షి ఉదయముననే లచి తన రెక్క్లను/జ్ఞానమును విస్తరింపచేస్తూ
క్రమశిక్షనతో నుండు విధానము.
 పూషాన్
......
పుష్ణాతి ఇతి పూషా.ద్వాదశాదిత్యులలో మాఘమాసపాలకుడు.వర్షమూతో /వర్షజలముతో లొకములను పోషించువాడు.ఉత్తరాయనములో సౌద్రజలమును గ్రహించి,వానికి చంద్రుని ఔషధతత్త్వమును మేళవించి వర్షధారలుగా అనుగ్రహించువాడు.
 పోషకత్వమునకు సహాయపడు తన సక్తిని కిరనములద్వారా అందించువాడు.ధర్మమునే పూష అని కూడా పిలుస్తారు.
 గభస్తిమాన్
 ..........
 గో /వాక్కు శబ్దమునుండియే గభస్తి శబ్దమును అన్వయించుకుంటే జ్ఞానప్రదాత.
 గో-జ్ఞేయ వర్గః-తెలియవలసిన విషయములను/లక్ష్మీతత్త్వమును తెలియచేయు సంకేతము.అగ్నిసోమాత్మకమైన వేడి-కాంతికి సంకేతము.
 భ నగా ప్రకాశము.తన గమనము/కిరణముల గమనముద్వారా ప్రకాశమును కలిగించు పరాశక్తి.కిరణములను గభస్తులు అని అంటారు.
 ఆయననె సువర్ణ రేఖలు గలవాడు.సుపర్ణ రేఖలు కలవాడు.
 సు-అనగా శుభములను కలిగించు అనుష్ఠానము-అభ్యాసము కలవాడు.
 భానుడు
......
 తీక్షణమైన కిరణములు కలవాడు భానుడు.
 హిరణ్య రేత నమోనమః
........................
 రేతస్సు అనగా బీజము/మూలకారణము.
సూర్యుని రేతస్సు హిరణ్యము.అనగా హితమును-రమణీయతను కలిగించునది.సర్వ రమణీయమైన/రమించగలిగిన హితములకు మూలకారణము సూర్యుని బీజప్రాయశక్తియే.
 దివాకర నమో నమః
 ****************
 దివ్ అను శబ్దమునకు వెలుగును కలిగించువాడు.అనగా చీకట్లను తరిమివేయగల శక్తిగలవాడు.
 ఆకరము అనగా నిలయమైనవాడు/నిధియైనవాడు.
 వెలుగు అను పదమును మనము భౌగోళికముగా అన్వయించుకుంటే తన కిరణములచే పగలు-రాత్రిని ఏర్పరచువాడు,సూక్ష్మముగా పరిశీలిస్తే అజ్ఞానమనే చీకట్లను పారద్రోలుటకు జ్ఞానమనే చైతన్యమును అనుగ్రహించువాడు.
 తం సూర్యం ప్రణమామ్యహం.


TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...