చిదానందరూపా-మడివల మాచయ్య
*****************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
పర్వతప్ప-సుజ్ఞానుల సుకృతపు సుపుత్రుడు
శరణు సాహిత్యపు సంరక్షకుడు మడివల మాచయ్య
శిల శిష్యుడుయైన వేళ శిల్పి గురువుయే కద
తన గురువు బసవేశ్వరునికి తాను పాద సేవకుడు
ఇష్టలింగము గురించి మలయ చంద్రయ్యకు బోధించెను
ఇష్టముగా బట్టలనుతికి ఈశ్వర భక్తులకు అందించెను
మడిమూటను తాకినవానిని హతమార్చెను వీర గణాచారిగ
మరల బ్రతికించుతకు మహేశ్వరుని మహిమలె కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.