Tuesday, July 11, 2017

KULUKULA PALUKULU PAGE-20

 పుట-20-

తలకట్టు-ఒత్వము
********************
కలత-కొలత
కలిమి-కొలిమి
కల్లలు-కొల్లలు
కలిచి-కొలిచి
కలికి-కొలికి
కంపలు-కొంపలు
కంచము-కొంచము
కసరు-కొసరు
కండలు-కొండలు
కలువ-కొలువ
తడవు-తొడవు
పడవు-పొడవు
పదవి-పొదవి
పగులు-పొగులు
పడుచు-పొడుచు
పగిడి-పొగిడి
పచ్చ-పొచ్చ
పరులు-పొరులు
పంది-పొంది
పంకము-పొంకము
మట్టి-మొట్టి
మరుగు-మొరుగు
మత్తు-మొత్తు
తట్టి-తొట్టి
సంత-సొంత

KULUKULA PALUKULU PAGE-21

 పుత-20-తలకట్టు-ఓత్వం
కల-కోల
కత-కోత
కర-కోర
కడి-కోడి
గడ-గోడ
గని-గోని
గళము-గోళము
గడులు-గోడులు
గడలు-గోడలు
చరులు=చోరులు
జల-జోల
జగడం-జోగడం
జడులు-జోడులు
తడవు-తోడవు
తరణం-తోరణం
తటి-తోటి
తరము-తోరము
తటి-తోటి
నరులు-నోరులు
నటులు-నోటులు
నములు-నోములు
మదము=మోదము
మత-మోత
వదనం-వోదనం
  శకము-శోకము

KULUKULA PALUKULU PAGE -22

 పుట22--

  తలకట్టు బదులు ఔత్వముతో  మరొక పదము.
 ***************************************************
తలకట్టు-ఔత్వము
-----------------------
కరవులు-కౌరవులు
కతుకము-కౌతుకము
గనులు-గౌనులు
గతమ-గౌతమ
చక-చౌక
తలము-తౌలము
పరులు-పౌరులు
పనులు-పౌనులు
పడరు-పౌడరు
పరుషము-పౌరుషము
పరహితము-పౌరహితము
బద్ధులు-బౌద్ధులు
మనము-మౌనము
ర్..రవము-రౌరవము
రతులు-రౌతులు
సరులు-సౌరులు
సఖ్యము-సౌఖ్యము

KULUKULA PALUKULU PAGE-23

 పుట23

 పదములో సున్న చేర్చి పదము మార్చుట
*********************************************
కద-కంద
కటకం-కంటకం
కబళము-కంబళము
కచము-కంచము
కటి-కంటి
అదురు-అందురు
గజి=గంజి
గత-గంత
చక-చంక
నది-నంది
పది-పంది
పతులు-పంతులు
పడిన-పండిన
పొగులు-పొంగులు
భజనం-భంజనం
వదనం-వందనం
వతను-వంతను
రజితం-రంజితం
రగులు-రంగులు
శాతము-శాంతము
సగము-సంగము

KULUKULA PALUKULU PAGE-24

పుట24-

జీవమా/నిర్జీవమా
******************
కర*వాలము*
తాళపు*చెవి*
*కల*కలము
ధరా*తల*
సమ్య*మనం*
ని*కరము*
*హస్తి*న
చే*నేత
సా*రంగం
*కాకి*నాడ
జాలు*వారు*
*పసి*డి
*అమ్ము*లు
అం*జనము*
బై*రాగి*
సహ*వాసము*
*పాపి*డి

KULUKULA PALUKULU PAGE25

పుట-23-

-ఆ చేర్చి..పదము..అర్థము..మార్చుట
****************************************
నంది-ఆనంది
వాలు-ఆవాలు
హారము-ఆహారము
వాహనం-ఆవాహనం
చారి-ఆచారి
కారం-ఆకారం
రాలు-ఆరాలు
వాసం-ఆవాసం
క్రమం-ఆక్రమం
శ్వాస_ఆశ్వాస
తపము_ఆతపము
పాత_ఆపాత
శ్లేష-ఆశ్లేష
రుద్ర_ఆరుద్ర
మంత్రము-ఆమంత్రము
లోచనము-ఆలోచనము
ముదము=ఆముదము
 మోదము
-ఆమోదము
రేడు-ఆరేడు

KULUKULA PALUKULU PAGE-26

పుట-26

--ముందు-వెనుక

పద...ఆపద...పదవి
జయ...సంజయ...జయంతి
దండ...కైదండ..దండన
పగ...ఆపగ...పగడం
పసి...తాపసి..పసిడి
పది...ద్రౌపది..పదిలం
యమ..నియమ...యమకం
కోరి...చకోరి...కోరిక
కల...సకల...కలప
సారం...కాసారం..సారంగం
నవ...మానవ...నవమి
మాల...రుమాల...మాలతి
బడి..రాబడి..బడితె

పలు..చేపలు..పలుకు
కలి..ఆకలి..కలికి
మద..ప్రమద..మదన
వర...కావర...వరద
రాయి...సారాయి..రాయితీ
వాస..నివాస..వాసన
నగ..వినగ...నగరం
భవం..ప్రాభవం..భవనం
గడ..మీగడ..గడప
జన..భోజన..జనక
దర్ప..కందర్ప..దర్పణం
హార..విహార..

KULUKULA PALUKULU PAGE-27

  పుట26...మాటలో..మాట
జా*మాత*
ని*మిష*
పా*తాళం*
క*బీరు*
పా*రాణి*
*పాప*ము
కా*పురం*
*సున్న*ము
వి*దర్భ*
ప*కోడి*
*వస*తి
 కా*వరము*
వి*రాగి*
క*వనం*
త*రాజు*
*కల*త
క*లత*
వి*హారం*
పు*కారు*
వ*కీలు*
*పావు*రం
పా*వురం*
*పగ*డం
ఏ*కాకి*
ఆ*సన్నం*
వి*వరం*
ఆ*కృతి*
భా*రతం*
కా*రణం*
*సమ*యం
ని*దానం*
*వేడు*క
కా*రకం*
అ*పూర్వం*
ని*వృత్తి*
ఉ*దధి*
స్వ*గతము*
ప్ర*తిష్ఠ*
ప్ర*తాపము*
ప్ర*కోపము*

KULUKULA PALUKULU-PAGE28

పుట27...మొదటి..రెండు..అక్షరములతో..మరో.పదము
శంకర-శంక
వంకర-వంక
సమరం-సమ
బలపం=బల
పనిచె-పని
నరకం-నర
కవిత-కవి
శరణం-శర
విషమం-విష
పావురం-పావు
నగరం-నగ
పథకం-పథ
పగడం-పగ
పదిలం-పది
వసతి-వస
సోమరి-సోమ
వరద-వర
కానక-కాన
పాయసం-పాయ
ప్రత్మ-ప్రతి
పసిడి-పసి
పలుగు-పలు
అన్నము-అన్న
అక్కడ-అక్క
తెగువ-తెగు
వందనం-వంద
వలచి-వల
వానర-వాన
వెలది-వెల
పనిచె-పని
తరంగం-తరం
వాయిదా-వాయి
కథక్-కథ
జలగ-జల
నందిని-నంది
ప్రభుత్వం-ప్రభు
నగదు-నగ
పొగరు-పొగ
పదవి-పద
గాడిద-గాడి
కాపురం-కాపు
పలుకు-పలు
పూరిల్లు-పూరి
అక్కర-అక్క
దబ్బనం-దబ్బ
రవికె-రవి
అరక-అర
దండన-దండ
చాపము-చాప
కలప-కల
పాదపం-పాద
విడిది-విడి
అతివ-అతి
దారము-దార
కంచుకం-కంచు
యమకం-యమ
వేడుక-వేడు
మరలు-మర
పాపిడి-పాపి
గోపిక-గోపి
మైదానం-మైదా(దానం)
వాణిజ్యం-వాణి
పదము-పద
గురివింజ-గురి
అంబలి-అంబ
పాపము-పాప

KULUKULA PALUKULU PAGE-29

 పుట29..అటు..ఇటు
**********************
చిరుగు_చిగురు
మయము-యమము
కరము-రకము
జగము-గజము
అదురు-అరుదు
వశము-శవము
గతము-తగము
రవము-వరము
శుకుడు-కుశుడు
చవన-వచన
నమస్సు-మనస్సు
పగడ-గడప
కంపము-పంకము
దసర-సరద
వసతి-సవతి
నాకసి-నాసిక
రతము-తరము
పతిత-తపతి
రసము-సరము
కరిగ-గరిక

KULUKULA PALUKULU-PAGE 30

 పుట 30-మేమూ..కవలలమే

 పదములో పక్కపక్కన ఒకే ఒత్తు,
***********************************
వ్యాహ్యాళి
ఆమ్యామ్యా
అబ్బబ్బ
అమ్మమ్మ
వెల్లుల్లి
ఉత్తుత్తి
ద్వంద్వము
తబ్బిబ్బు
పెళ్ళిల్లు
పిల్లల్లో
అల్లర్లు
సవేశ్వరా
ప్రప్రథమం
నక్సల్సు
బుల్లెట్లు
తప్పొప్పు
చిన్నన్న
వద్దొద్దు

CHAEYI CHEPPINA KATHA.


 కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే  సరస్వతి
కరమూలేతు గొవిందహ ప్రభాతే కరదర్శనము. చేతి అంచున లక్ష్మి,చేతి మధ్యన సరస్వతి,చేతిమొదట గొవిందుని నివాసము ఉదయమున కరదర్శనము శుభప్రదము అని ఆర్యోక్తి.
రామాపురానిది  గ్రామాలన్నింటిలో పైచేయి.ఆ ఊరి కరణము సత్యమూర్తి పనితనములో అందెవేసినచేయి.విశాలహృదయులు కనుకప్రజలకు "చేయూతగా"  ఉండేవారు.ఊరి అవసరములు తీర్చుటలో ఆయనది "ఎముకలేని చేయి".జమఖర్చులు ఆయన "చేతివేళ్ళమీదె" ఉండేవి.వ్యసనాలకు "మొండిచేయి" చూపించేవారు.ఆ ఊరిలో సోమయ్య" చేతివాసిగల" వైద్యుడు.కరణముగారి "కుడిచేయి."సోమయ్య మందు రోగులకు" చేతిలో ఉసిరికాయ".సోమయ్య ఊరెళితే కరణముగారి "చేయివిరిగినట్లుండేది".వారి స్నేహముగురించి చెప్పటం "ముంచేతి కంకణము చూచుటకు అద్దమును చూపుట"వలేనుండెడిది.ప్రజలు "చేతులుపట్టుకొని" మానవహారములా ఉండేవారు.కరణముగారికి ఆనందంతో " చేయెత్తి జేకొట్టేవారు."
రాజు సోమరి.వానికిపుస్తకము "హస్తభూషణము"."చేయిచెపుతోంది" నేను గొప్పవాడిని అవుతాను అనేవాడు."మెలికతిరిగినచేయిలా" బొమ్మలు వేస్తాను అని అనుకొనేవాడు.మాటలతో" అరచేతిలోవైకుంఠము" చూపించేవాడు.శ్రమలేనందున  ఫలితము" చేతికందలేదు"."చేతకాక" చెడ్డవాడైన బిట్టూతో చేతులు కలిపాడు.స్నేహముగా ఉంతూ చెప్పినట్లు చేస్తాననిచేతకాక  బిట్టూతో "చేతులు కలిపాడు".బిట్టూ మోసము చేయుటలో" చేయితిరిగినవాడు".చెప్పినట్లుచేస్తానని బిట్టూ" చేతిలో చేయి వేశాడు".పథకము ప్రకారము రామాపురము వచ్చారు" చేతిపనులు" చేసికుంటున్న గ్రామస్తులు వీరినిచూసారు.వారికి "చేదోడువాదోడుగా" ఉంటారనుకున్నారు.కరణము వీరితో "కరచాలనము" చేసి,రండి"దయచేయండి" అని అన్నాడు.
   వీరి స్నేహము రామాపురానికి  "భస్మాసురునుచేయిగా" మారింది.దుర్మార్గులు గ్రామసంపదపై "చేతివాటం" ప్రదర్శించసాగారు.చేసేదిలేక గ్రామసంపద వీరికి" చేతులూపింది"."వట్టిచేతులతో" వెట్టిచాకిరి చేయవలసి వచ్చింది.అభివృద్ధి "  చేతులెత్తేసింది".ఆహారము " అరచేతిలోపెడితే మోచేతిని" నాకేలా ఉంది.గ్రామస్తులు దుర్మార్గుల "మోచేతిక్రింది నీళ్ళు" తాగి బ్రతుకవలసిన పరిస్థితి వచ్చింది."చే చేతులా" వీరి" కబంధహస్తాలలో" చిక్కామని చింతించసాగారు.ఆనందం యేది?చెప్పినమాట వినకపోతే ఆ కౄరులు వీరిపై "చేయి చేసుకునేవారు"."రెక్కాడిన" వీరి డొక్కాడటములేదు."చేతులారంగ" శివపూజను మరిచారు."చేతవెన్నముద్ద తండ్రిని" మరిచారు.బధిర బంధువైన" చేయి" మనకు  బంధువగునా అని,బాధల వరదను కడతేర్చే "వరదహస్తస్వామి,"నీ "అభయ హస్తమును" చూపవా  అంటున్న కరణంగారిని, కాత్యాయినిలేపింది యెవరో వచ్చారంటూ,రేడియోలో అందరికి" అభయమ్ము ఇచ్చు చేయి",కదువగు శ్రీహరి "బంగారుచేయి" ఆ చేతులను చేతులు జోడించి ప్రార్థిద్దాము.
.


TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...