ప్రజ్ఞానం బ్రహ్మ-తత్త్వమసి-అయం బ్రహ్మ-అహం బ్రహ్మ అని నాలుగు వేదములలోని మహావాక్యములను విన్నప్పుడు నాలుగింటిలో బ్రహ్మం అనే మాట ఉన్నది కదా
బ్రహ్మము అంటే ఏమిటి?అన్న సందేహము ను కలిగించి,నివృత్తికై ఖడ్గమాల అను స్తుతిమాలను జ్ఞప్తికి స్పురింపచసిన అమ్మకు అనేకానేక నమస్కారములు.ఖండించేది ఖడ్గము.
మనము తలచుకొనుచున్న ఖడ్గము లోహనిర్మితముకాదు.తుప్పుపట్టదు.విరిగిపోదు.కాల్చినంతనే కరిగిపోదు.
మంత్రబీజాక్షర మహిమాన్విత శక్తి.భాగ్యప్రదానము.భావనాతీతము.బహుశుభంకరము.అంతర్యాగ సాధనము.
పాంచభౌతిక శరీరమే నేను అను మాయను ఖండించి ప్రత్యగాత్మను పరిచయము చేసేందుకు అనుసంధానముచేసి,అహంబ్రహ్మాస్మి అనిపించే ఆలంబన అమ్మవారి ఖడ్గమాల స్తోత్రము..