మీడుష్టమ శివతమ-08
*******************
న రుద్రో రుద్రమర్చతేత్-రుద్రుడు కాని వాడు రుద్రుని అర్చించలేడు.
నిలదీయడమే కావాలి ఆ నీలకంఠునికి.ఇంకెందుకు ఆలస్యమంటు అరుదెంచినిలిచాడు ఆ సాధకునికి ఎదురుగా అసలేమి జరగనట్లు.
ఉక్రోషముతో ఊగిపోతున్నాడు సాధకుడు.వచ్చావా! ఇక్కడేమిజరుగుతుందో చూసిపోదామని.నేను తెలియక నాకు ఇది కావాలి-అదికావాలి-ఇంకోటి కూడా కావాలి అంటూ ఎన్నెన్న్నో అడిగానే అనుకో,అర్థించానే అనుకో అసలు విషయము చెప్పకుండా ఇవి నీకు నిరుపమానములు అంటు ఇచ్చావేకాని నిరుపయోగములు అని అప్పుదేనాతో చెప్పలేదు.
నిష్ఠూరాలు నిలవలోఉన్నట్లున్నాయి అన్నాడు రుద్రుడు చెక్కుచెదరనిచిరునవ్వుతో.కాకపోతే ఏమిటయ్యా అర్థించిన వెంతనే అనుగ్రహించటమా నేనుచేసిన తప్పువివరము తెలియని వానికి సర్వము అందించినట్లు అంటూ సన్న సన్నగా మందలిస్తూ,
నిన్ను నీవు పరిశీలించుకో---నీ దగ్గర ఉన్నవాటిని--అసలు అవి ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించుకోవాలి?నేను ఏమి చేయాలి? ఎలా చేయాలి?ఎందుకు చేయాలి? లోహకారుని పనితనమును గమనించు.మోహజాలములు దూరమవుతావి అన్న స్పురణతో పరమాత్మ ఆవేశము ఆలోచనగా మారి పరిశీలించు-పరిక్రమించు అంటూ హెచ్చరిస్తున్నది ముచ్చతగా.
కమ్మరి కొలిమి అగ్నికీలలతో ఆ లోహమును-ఆలోచనను తన చైతన్యశతితో కరిగించివేస్తున్నది.అదియే కదా దాని నైజము." కుటీలాయం గతే"ప్రాపంచిక విషయములందు కుటిలముగాను,ఆధ్యాత్మిక విషయములందు ఊర్థ్వముగాను ప్రవర్తించుట ,పనికిరాని విషయములను ప్రక్షాళించుటయే దానిపని.
ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు మరి నే వెళ్ళిరానా ఏమిఎరుగని వాడిలా సాధకుని అడుగుతున్నాడు రుద్రుడు.
ఒక్కసారి ఈ లోహముల స్వభావమును మన భావములతో జతచేసి జరుగుచున్నది గమనిద్దాము.
నేను నీకు ఇచ్చినది హితము-రమ్యత అను రెండు సగుణములను కలిగిన అపురూపభావము.నిశ్చలము-నిరంతరము అను సాధనచే జనించిన భావములు ఆ హిరణ్యమును నామరూపములను పొందుటకై విస్తరింపచేయుచున్నవి.నిక్షిప్తము తన హద్దులను తుంచుకొని ఆత్మ స్వరూపముగా మరి కొన్నిరూపములను తనలో కలుపుకొనుచున్నది.అవి మనకు పనికిరానివాటిని తరిమివేస్తాయి.కదిలిపోకూడని వాటిని సీసము అనే తాడుతో బంధిస్తోంది.అయశ్చమే అన్నవుగా ఆ ఇనుమునీ ఆలోచనలను ఆధ్యాత్మికమయము చేస్తున్నది.త్రపుంచమే అని నీవడిగిన భావము స్థిరత్వ భావమును చూసి,దానిని ఛేదించలేని విషయప్రవృత్తులు సిగ్గుపడి దారి మరలినవి.
ఆశ్చర్య చకితుడై ఆలకిస్తున్నాడు సాధకుడు.ఎంతటీద్భుతము ఈ లోహసమ్మేళనము.తరలిపోయిన అజానము తత్త్వసాధనకు సిధ్ధమవుతోంది.ఆలోహములనే ఆలోచనలను తన చైతన్యసక్తితో వ్యాపింపచేస్తున్నాది కొత్తభావములను తనతో చేర్చుకుంటున్నది కొత్త నామరూపములను దర్శించగలుగుతుంది.తన ఆత్మతత్త్వమును కొత్తనామ రూపములలో నిక్షిప్తముగా దాగి దర్శించుచున్నది.దారి చూపుచున్నది ఈ మోహనాసక లోహ ప్రస్తావనము అనుకుంటూ అర్థనిమీలితనేత్రుడైనాడు సాధకుడు అంతర్ధానమయ్యాడు రుద్రుడు.
అణువణువు శివమే-అడుగడుగు శువమే.
కదిలేవి కథలు-కదలించేది కరుణ.
సర్వం శివమయం జగం