భావనామాత్ర సంతుష్టా-సంప్రదాయ యోగినులు
********************************
14 మంది సంప్రదాయ యోగినులు హృదయస్థానమైన సర్వసౌభాగ్యప్రద చక్రమునందు విరాజిల్లుతు సాధకుని మార్గమును సుగమము చేస్తుంటారు.వీరు నాడీ మండలమును పరిరక్షించుచుండుటయే కాక భావోద్వేగములను క్రమబధ్ధీకరిస్తు అనుగ్రహిస్తుంటారు.
సంక్షోభిణి,విద్రావిణి,ఆకర్షిణి,ఆహ్లాదిని,సమ్మోహిని,జృంభిణి,స్తంభిని,,రంజనీ,ఉన్మాదిని,సర్వార్థసాధిని,సర్వసంపత్తిపూరిణి,మంత్రమయి,ముఖ్యముగా ద్వంద్వ క్షయంకరి/సర్వద్వంద్వక్షయంకరీ.
నేను అనే దేహము నాలో దాగిని చైతన్యము రెండుగా నున్నవి అన్న భావనను పోగొట్టే పరమకరుణామయి సంప్రదాయయోగినులుగా మనలోని చిత్తభావములకు అదే మనోప్రవృత్తులకు వాటిని తొలగించే నివృత్తులకు ప్రతీకలు.
మన్వస్రం గా కీర్తింపబడే ఈ చక్రమును పదునాలుగు లోక విశేషములుగాను కీర్తిస్తారు.
నాడీమండలపరముగా కనుక సమన్వయించుకుంటే మానవ సరీరములోని 72000 నాడులను చైతన్యవంతముచేసే యోగినులు.
పరదేవతయొక్క జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మనస్సు,బుధ్ధి,చిత్తము,అహంకారము అను అంతఃకరణములుగాను కీర్తిస్తారు.
ఇక్కడ మనమొక విషయమును గమనించాలి.మనసు -చిత్తము అని చెబుతున్నారుకదా వానిని వేరు వేరుగా భావించాలా అని.పెద్దల నిర్వచనము ప్రకారము చిత్తము తనలో మనసు-బుధ్ధి-అహంకారము అను నాలుగు అంశములను తనలో దాచుకుని సమయసందర్భములను బట్టి బుధ్ధి యొక్క ప్రచోదనమును అనుసరించి మనసు సంకల్ప-వికల్పములను చస్తుంటుందట.బుధ్ధి కాస్త నిద్రాణము చేసి అహంకారము ప్రకటింపబడుతుంటుందట.అహంకారము నిద్రానముగా నున్న సమయమున బుధ్ధి ప్రచోదనమవుతుందట.చిత్తము మాత్రము నిర్వికారముగా తనలో వీటిని భద్రపరుస్తుందట.సాధకుడు యుక్తాయుక్త విచక్షణను కలిగి తన గమనమును సుగమము చేసికొనుటకు సంప్రదాయయోగినుల సహాయము చాలా అవసరము.