"రవి సుధాకర వహ్నిలోచన రత్నకుండల లోచనీ
ప్రవిలమంబుగ మమ్మునేలిన భక్తజన చింతామణి
అవని జనులకు కొంగుబంగారైన దైవశిఖామణి
శివుని పట్టపు రాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబికా."
పరమేశ్వరి అనుగ్రహముతో సాధకునితో పాటుగా మనముకూడా చంద్ర ప్రస్తావనతో కూడిన అమృతమయ "సర్వరోగహర హక్రములోనికి"ప్రవేశించుచున్నాము.
లలితా రహస్య సహస్రనామ స్తోత్రము,
"రోగపర్వత దంభోళి మృత్యుద్వారా కుఠారికా" అని కీర్తించింది.
రుగ్మతను కలిగించేది (జాడ్యమును) రోగము.అది సప్తధాతు సమన్వయలోపముచే సంభవించు శారీరకము కావచ్చును.లేదా,
అసహనము,అసంతృప్తి,అహంకారము,అసూయ,అధర్మము,అజ్ఞానము మొదలగు మానసికరుగ్మతలకు సంబంధించినదైనను కావచ్చును.
ఒక్క మాటలో చెప్పాలంటే చేతనుని జ్ఞానము నుండి మాయ మార్గమునకు తీసుకుని వెళ్ళే శక్తులన్నీ రోగములే.
ఎనిమిది కోణములు త్రిగుణములకు,శీతోష్ణములకు,సుఖదుఃఖములకు,కోరికకు సంకేతములుగా భావిస్తారు.
మరికొందరు అష్టదిక్కులకు ప్రతీకగాను కీర్తిస్తారు.
సాధకుడు షట్చక్రములను దాటుతూ సర్వఖేచరి/ఆకాశసంచారిణి యైన చైతన్యమును తెలుసుకోవటము ప్రారంభిస్తాడు.
సర్వరోగహర చక్రములోనికి ప్రవేశించువరకు సాధకుడు,
"తత్+త్వం+అసి" నువ్వు+నేను -ఉన్నాము అన్న భావనతోఉంటాడు.దానికి కారనము అతనిమనస్సులో ఉన్న అనేకానేక సందేహములు.వానినే "రోగముగా" అన్వయిస్తారు.భ్రమును సత్యముగాను/సత్యమునుభ్రమగాను భావింపచేసేది రోగము.అది సందేహములపుట్టయై సత్వమును కప్పివేస్తుంది.
దేహము/ఆత్మఒకటేనా లేక వేరు వేరుగా/రెండుగా ఉన్నాయా
ముక్తి పొందటానికి ఉపాధి అడ్డముగా/ఆతంకముగా ఉంటుండా
బ్రహ్మము నా ఒక్కనిలోనాఉందా లేక సర్వ వ్యాపకమై ఉన్నదా
ఎప్పుడు నాలో/నాతో ఉంటుందా లేక కొన్ని సమయములలోనే ఉంటుందా
మూడు గుణములు/మూడుకాలములు/మూడు అవస్థలు/త్రిపుటి కేవలము చేతనులకేనా లేక పరబ్రహ్మమునకు సైతము ఉంటాయా?
మొదలైన నేకానేక సందేహములను "రోగములను" భవరోఘములను తొలగించివేసే శక్తులే "రహస్య యోగినులు"
స్థూలప్రపంచ విషయములకుగుప్తయోగినులు ఏ విధముగా సహాయపడతారో "సర్వఖేచరి" సాధనతో సూక్ష్మము వైపు పయనించు సాధకునకు రహస్యయోగినులు సందేహనివృత్తికి సహాయపడతారు.
భుక్తిసిద్ధి ద్వంద్వ భావనను తొలగించి ఆత్మ తత్త్వమునకు ,అసాధ్యమనుకొన్న విషయమును సుసాధ్యము చేస్తుంది.
చక్రేశ్వరి "త్రిపురాసిద్ధే"
త్రయీ-త్రివర్గనిలయా-త్రస్థా" ఒక్కరే అనేక విమర్శ రూపములతో ప్రకాశిస్తున్నదన్న స్పృహను కలిగి సంసారబంధ విముక్తుడవుతాడు.
పరమేశ్వరి నుదుటిస్థానములోవిరాజమానమైన వశిన్యాది సేవతాసమూహము శాస్త్రముల ద్వారా/అక్షరసమూహమైన విజ్ఞానము ద్వారా/నిక్షిప్తపరిచిన సాహిత్యము ద్వారా సాధకునికి సద్గతి మార్గనిర్దేశకములుగా సహాయపడుతుంటాయి.
అష్టకోనములుగానున్న శీతోష్ణ-సుఖదు@ఖములను కోరిక త్రిగుణములను గ్రహించిన సాధకుడు తనను తాను తెలుసుకుంటూ,ఎనిమిదవ ఆవరనము యైన "సర్వసిద్ధిప్రద చక్ర"ప్రవేశమునకు సన్నద్ధుడవుతున్నాడు.
" యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థితా
నమస్తస్త్యై
నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః."