వాజశ్చమే
అన్నము ఇది పరబ్రహ్మ స్వరూపము.అన్నము అనగా బియ్యమును ఉడికించగా ఏర్పడిన పదార్థము మాత్రమే కాదు.
ప్రతి మనిషికి అన్నమయకోశము-ప్రాణమయ కోశము-మనోమయ కోశము-విజ్ఞాన మయ కోశము-ఆనంద మయ కోశములుంటాయి. తైత్తరీయోపనిషత్తు అన్నము వలనే భూతజనములు జనించుచున్నవై,జీవించుచున్నవని, లయింపబడుచున్నవని చెప్పుచున్నది.
అన్నమే/ఆహారమే అన్నమయకోశములోనికి ప్రవేశించి ప్రాణముగా మారుచున్నది.మరల మరల ప్రవేశించుచు ప్రాణిని జీవింపచేస్తున్నదిచివరకు జీవికి ఈశ్వరత్వమును అందిస్తున్నది.
పరమాత్మ సృష్టించిన రుద్రులు మనకు అందించే ఆహారముద్వారా మనకు ఆరోగ్యము-అనారోగ్యమును మన కర్మ ఫలితములను అనుసరించి అందిస్తుంటారు.
ప్రాణములు ఇంద్రియములు సర్వము రుద్రుడే. రుద్రుడు మేఘుని రూపములో వర్షములను కురిపిస్తూ,సూర్యుని రూపములో ఆహారమును అందిస్తూ విశ్వమును పోషిస్తున్నాడు"అంధసస్పతి."
సూర్యరశ్మి-జలములు-వాయువులు ఆహారముగా జీవులను పోషించును కవున అన్నింటికి రుద్రుడే అధిపతి.ఇవన్నె కలిపి ఉపయోగించుకొనుటయే యజ్ఞము.వీటికి రుద్రుడు యజమాని.తిని జీవించు పక్షులు-పశువులు-మనుష్యులు మొదలగు వాటికి కూడ రుద్రుడే అధిపతి.
ఆహారరూపమున దాగియుండు రుద్రులు జీవుల కర్మఫలములను బట్టి ఘోరులై-అఘోరులై ఆహారము ద్వారా వారిని రక్షించుచు-శిక్షించుచు ఈశ్వరాజ్ఞను నెరవేర్చుచుందురు.జీవుల ఇంద్రియ వ్యామోహము-నిగ్రహము కూడా ఈ క్రియలో తమవంతు పాత్రను పోషిస్తుంది.
సాధకుడు సమగ్రబుధ్ధిశాలియై సర్వాంతర్యామిత్వమును గ్రహించకలిగి తన యజ్ఞమును సఫలీకృతము చేసుకోగల సామర్థ్యమును వరముగా పొందకలిగియుండాలి.
"జ్ఞాత్వా కర్మాణి కుర్వీత" తత్త్వమునెరిగి కర్మాచరణమును చేయగలిగి యుండాలి.
వాచక శబ్దముగా అన్నమును ఆహారపదార్థముగా భావించినచో సాధకుడు తనకు అన్నమును చూచుటయందు-తినుట యందు ఆసక్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాడు.అంతే కాదు.పరబ్రహ్మ స్వరూపమైన అన్నము పరిశుధ్ధమైన పాత్రయందుండునట్లు ఆశీర్వదించమంటున్నాడు.అన్నమును విలువ తెలుసుకొని మితముగాను-హితముగాను స్వీకరించునట్లు తెలివిని కోరుకుంటున్నాడు.అంతే కాదు తాను భుజించిన అన్నము తన ప్రాణమును-ఇంద్రియములను సరియైన మార్గములో నడిపించగలగాలి అని,తద్వారా తాను చేయు సాధనలు-యజ్ఞములు సమర్థవంతములు కావాలని ప్రార్థిస్తున్నాడు సాధకుడు.
ఇక్కడ సాధకుడు రుద్రుని విభక్త శక్తులైన అగ్ని-విష్ణువునుతనను ఆసీర్వదించుటకు-అనుగ్రహించుటకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు.
ఇంకొంచము నిశితముగా గమనిస్తే ఇక్కడ వాజశ్చమే అంటే కేవలము ఆహారము మాత్రమే కాదు.ఆధ్యాత్మిక అనుగ్రహము.దానికై తన మనసును మోహావేశములకు దూరముగా ఉంచమని,ఇంద్రియలౌల్యమునకు గురికానీయక సత్యాన్వేషణ చేయగల జ్ఞానేంద్రియములను-కర్మేంద్రియములను"దక్షశ్చమే-బలశ్చమే" అని తనలోని కుండలినీ శక్తిని ప్రచోదనము చేసి అమృత భాందమును గిల్లి బయటకు తీయుటకు అగ్నిని,దానిని విశ్వమంత వ్యాపింపచేయుటకు విష్ణు అను వ్యాపక శక్తిని ఆహ్వానించి,తన యజ్ఞమును సమర్థవంతము చేసుకొనుచున్నవేళ ,
" చమకములో మమేకమైన నాకు సర్వం శివమయం జగం."
ఏకబిల్వం శివార్పణం.
అన్నము ఇది పరబ్రహ్మ స్వరూపము.అన్నము అనగా బియ్యమును ఉడికించగా ఏర్పడిన పదార్థము మాత్రమే కాదు.
ప్రతి మనిషికి అన్నమయకోశము-ప్రాణమయ కోశము-మనోమయ కోశము-విజ్ఞాన మయ కోశము-ఆనంద మయ కోశములుంటాయి. తైత్తరీయోపనిషత్తు అన్నము వలనే భూతజనములు జనించుచున్నవై,జీవించుచున్నవని,