Monday, September 11, 2023

KURYAAT KATAAKSHAM KALYAANI-01




 " కుర్యాత్ కటాక్షం కళ్యాణి-కదంబ వనవాసిని."
     మొదటి శ్లోక అర్చనము.
    ***********************


 ప్రార్థన
 *****

 

   "కదాకాలేమాతః కథయ కవితాలక్తక రసం
    పిబేయం విద్యార్థి తవచరణ నిర్ణేజనజలం
    ప్రకృత్యా మూకానాం అపిచ కవితా కారౌతయా
    కదాదత్తే వాణీ ముఖకమల తాంబూలరసతాం.



         (ఆదిశంకరుల సౌందర్య లహరి.)

 

   శ్లోకము-01.

   ********



 " చేటీ భవన్ నిఖిల ఖేటీ కదంబవనవాటీషు నాకిపటలీ

  కోటీర చారుతర కోటీ మణికిరణకోటీ కరంబిత పదా

  పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీం అగాధిప సుతా

  ఘోటీ ఖురాత్ అధిక ధాటీం ఉదార ముఖవీటీ రసేన తనుతాం"

 పద విన్యాసము.

 *********** 

 జగదంబ,

 భవత్-కూడియున్నది

 చేటీ భవత్-చెలికత్తెలను/దాసీజనమును కూడియున్నది.

 ఖేటీ-చేటీ-భవత్

 దేవతా స్త్రీలను-చెలికత్తెలుగా సేవించుచుండగా-కూడియున్నది.వారికి సేవా సౌభాగ్యమును  అనుగ్రహించుచున్నది.


 నిఖిల-ఖేటీ-చేటీ-భవత్

 సమస్త-దేవతాస్త్రీల-సేవలను పొందుతూ-వారిని-కూడియున్నది.

 వాటీషు-నిఖిల-ఖేటీ-చేటీ-భవత్

 ఉద్యానవనములో-సమస్త-దేవతా స్త్రీలను-కూడి యున్నది.

 కదంబ-వన-వాటీషు-నిఖిల-ఖేటీ-చేటీ-భవత్

 కష్టములను తొలగించే-కదంబ వనములో-సమస్త-దేవతా స్త్రీలను-కూడి యున్నది జగజ్జనని.
 

"శచీ ముఖ్య అమర వధూ సేవితాయై నమః."
   తల్లి

"దాసీభూత వనితాం-లోకైక దీపాంకురాం"

 సమస్తలోకములను ప్రకాశింపచేసే ఏకైక దీపపు వెలుగునకు మూలము తానైనది.

  ఖడ్గమాల పరముగా అన్వయిస్తే యోగినులను జగదంబ చెలికత్తెలుగా అన్వయించుకోవచ్చును.

  దేవీ భాగవత పరముగా అన్వయించుకుంటే-తల్లి నుండి ఉత్పన్నమైన సమస్త దేవతా స్త్రీ మూర్తులను చెలికత్తెలుగా (వారాహి-కౌశికి-చాముండా) సంభావించుకొన వచ్చును.




   శుద్ధాంతరంగమే నిష్కల్ళమైనకదంబ వనము.అందులో అమ్మ శుభలక్షణయై దశేంద్రియములనే చెలులతో క్రీడించుచున్నది.

  ఇది అమ్మ సౌహార్ద్రత్వము.

 పాఠాంతరము.

చెలికత్తెలకు సన్మార్గమును చూపు బుద్ధి తానై విహరించుచున్నది.

  యాదేవి సర్వ భూతేషు బుద్ధి రూపేణ సంస్థితా.నమో నమః.





2జగజ్జనని
******


 పదా-పాదపద్మములు కలది

 కరంబిత-పదా-వ్యాపించియున్న పాదపద్మములు కలది

 కిరణ-కరంబిత-పదా

 కాంతులు-వ్యాపించున్న-పాదపద్మములు కలది 

 మణి-కిరణ-కరంబిత-పదా

 మణుల కాంతులు-వ్యాపించిన-పాదపద్మములు కలది 

 కోటీర-మణి-కిరణ-కరంబిత-పదా

 కిరీటములలో పొదిగిన-మణుల కాంతులు-వ్యాపించిన-పాదపద్మములు కలది


 కోటీ-కోటీర-మణి-కిరణ-కరంబిత-పదా

 అనేకానేక-కిరీటముల-మణుల-కాంతులు-వ్యాపించిన-పాదపద్మములు కలది


  చారుతర-కోటీ-కోటీర-మణి-కిరణ-కరంబిత-పదా



సౌందర్యవంతమైన-అనేకానేక-కిరీట-మణుల-కాంతులు వ్యాపించిన-పాదపద్మములు కలది.

నాక- పటలీ- చారుతర- కోటీ- కోటీర- కరంబిత- మణికిరణ- పదా

 స్వర్గమే-నివాసమైన-దేవతల-సుందరములైన-అనేకానేకములైన-  మణిమయ కిరీట అనేకానే కాంతులతో ప్రకాశించు పాదపద్మములు కల తల్లీ-


 'సుపద్మరాగ సంకాశ చరణాయై నమోనమః"

3.
 జగజ్జనని-వస్త్రము
 **************


"బృహత్ సౌవర్ణ  సౌందర్య వసనా"

 లోకాతీత సౌందర్యముతో ధగధగలాడుచున్న వస్త్రమును అలంకరించుకున్నది.అదియే ప్రస్తుత స్తోత్రములో 

పాటీర గంధి-కుచ శాటీగా" కీర్తింపబడినది.

 అమ్మవారిపాదములు కిరీటధారులైన దేవతల పాదనమస్కార సమయమును,వారు ధరించియున్న కిరీటములలో  పొదగబడిన మణులు సైతము నమస్కరించినవా యన్నట్లు వాటి కాంతులు అమ్మవారి పాదపద్మములను మరింత ప్రకాశవంతము చేయుచు పరవశించుచున్నవి.

 అమ్మవారి ఉత్తరీయము సుగంధ శోభితమైపరిమళించుచున్నది.

 కర్పూరవీటికామోద  సమాకర్ష దిగ్దిగంతరా" తల్లి సేవించుచున్న తాంబూలము  పరిమళభరితము చేయుచున్నది.అమ్మ,
"తాంబూలపూరిత స్మేర వదనాయై నమః"తాంబూల కాంతులీను దరహాస వదనము కలది.



  జగదంబ కదంబవనములో సకలదేవతా స్త్రీలతో కలిసిమెలిసి విహరిస్తున్నది.

 సకలదేవతలు అక్కడకు వచ్చి అమ్మకు పాదనమస్కారము చేయుచుండగా వారు ధరించిన కిరీటముల కాంతులు అనేకానేకములై అమ్మ పాదములను సేవించుకొనుచున్నవి.కరుణాంతరంగయైన తల్లి వారిని అనుగ్రహించుచున్నది.

 పాఠాంతరము.
 ******

  అహమును విడిచి అమ్మ పాదములను పట్టుకొనిన వేళ ఆవిర్భవించిన అర్చనయే ఆ వ్యాపించిన మణుల కాంతులు.

 యాదేవి సర్వ భూతేషు కాంతి రూపేణ సంస్థితా-నమో నమః

4.తనుతాం-వృద్ధిచెందించుము (అభ్యర్థనము) 
  *******************

  పరిపాటీం-తనుతాం-పాటవమును వృద్ధిచెందించుము

  కవిత్వ-పరిపాటీం-తనుతాం

 కవిత్వ-పాటవమును-వృద్ధి చెందించుము. 

 -ధాటీ-కవిత్వ-పరిపాటీం-తనుతాం

 వేగవంతమైన/సమర్థవంతమైన-కవితా-పాటవమును-వృద్ధిచెందించుము

 అధిక-ధాటీ-కవిత్వ-పరిపాటీం-తనుతాం

 మిక్కిలి వేగవంతమైన/సమర్థవంతమైన-కవితా 

 పాటవమును-వృద్ధి చెందించుము.

 ఘోటీ కురాత్-అధికధాటీ-కవిత్వ-పరిపాటీం-తనుతాం

 ఆడగుర్రపు గిట్టల  వేగమును-అధిగమించు-వేగముగల-కవితా పాటవమును-వృద్ధిచెందించుము.(పరుగుతీయు వేళ)
   అదియును నీ తాంబూల రసమును అనుగ్రహించి,


 ముఖ వీటీ రసేన-ఘోటీ కురాత్-అధికపాటీ-కవిత్వ-పరిపాటీం-తనోతు

 నీ తాంబూల చర్వణ రసముతో ఆడగుర్రపు వేగమును అధిగమించు కవితా పాటవమును వృద్ధిచెందించుము.
 తాంబూల పూరిత ముఖీ-జగదంబ,ఓ 

 అగాధిప సుతా-ముఖ వీటీ రసేన-ఘోటీ కురాత్-అధికపాటీ-కవిత్వ-పరిపాటీ-తనోతు

 పర్వత రాజ పుత్రీ! ఓపార్వతీదేవి,నీవు సేవిస్తున్న తాంబూల రసమును వరముగా/ప్రసాదముగా అనుగ్రహించి,నన్ను ఆడగుర్రపు డెక్కల శబ్దమును మించిన వేగముగా పలుక గలుగు సమర్థవంతమైన  కవితా శక్తిని వరముగా ,అనుగ్రహింపుము.

 5.అభ్యర్థిస్తూనే మహాకవి,జగన్మాతకు,
 చేటీ,ఖేటీ,వాటీషు,కోటీ,కోటీర,కోటీకరంబ,పాటీర,కుచశాటీ-పరిపాటీ పదములలో టీ అను అక్షరమును పునరావృత్తముచేస్తూ,కోటీ,కోటీర,కోటీ కరంబిత పదములతో నాదభూషణములను/ అలంకరించారు.



  ఆ జగజ్జనని,

" నాదాభ్యా సర్వభూతేషు జీవరూపేణ సంస్థితా." 

 "యా  దేవి సర్వ భూతేషు శబ్దరూపేణ సంస్థితా" అని స్తుతిస్తున్నది దేవిసప్తశతి.

   అర్థములో దాగిన పరమార్థ విశేషములను గ్రహించే ప్రయత్నము శ్లోక పరిచయముముగిసిన తదుపరి చేసుకుందాము.

 అమ్మ అగాధిపసుత-
 **********


 న గచ్ఛతి-కదలలేనిది అగము.పర్వతము.కాని కామితార్థములను కదిలించగల కరుణ నిలయ.అమ్మ పుట్టిమిల్లైన హిమవత్పర్వతము.దానికి అధిపుడు హిమవంతుడు.మహాతపస్సంపన్నుడు.అంతేకాదు యోగులకు తపోనివాసము.-భోగులకు మనోవికాసము.ప్రకృతి సౌందర్యమునకు-సుకృత సౌభాగ్యమునకు ఆలవాలము.

   ప్రస్తుత శ్లోకమును మననము చేసుకుంటూ అమ్మదయతో రేపు మరొక శ్లోకముతో అర్చించుకుందాము.

  సర్వం శ్రీమాతా చరణారవిందార్పణమస్తు.










kURYAAT KATAAKSHAM KAKYANI-INTRODUCTION


 

   శ్రీ  మాత్రే నమః
   ************

    ప్రియ మిత్రులారా!
  దేవీ శరన్నవరాత్రోత్సవ  శుభకామనలు

   " వాగర్థావివ సంవృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
    జగతః పితరౌ వందే పార్వతీ  పరమేశ్వరౌః" 
    ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు శబ్దము-అర్థము వలె,శాశ్వత అవిభాజ్య సంబంధము కలవారు
 శబ్దార్థ సంభావితమైన సులక్షణ వాగ్ఝరికై మహాకవి/కవికుల తిలకుడు,తన నిజనామమును కనుమరుగు చేసి ఆ కాళికాదేవి దాసునిగా జగద్విఖ్యాతిని గాంచిన కాళిదాస ప్రణీతమైన మరొక అద్భుత-అసమాన స్తోత్ర రాజము "దేవీ దశ శ్లోకిగా" పేరుగాంచిన,13 శ్లోకముల,
 అశ్వధాటీ స్తోత్రరాజము.


   ఈ స్తోత్రము లోని ప్రతి శ్లోకము రసరమ్య గుళికయే.శబ్ద సౌరభ లతికయే.పరమార్థ ప్రకాశ కరదీపికయే.
   స్తోత్రమును పరిచయము చేసికొనిన తదుపరి దాని విశేష వైభవమును ఆకళింపు చేసుకునే ప్రయత్నమును చేద్దాము..
 జగద్గురువులు ఆదిశంకరులు తన సౌందర్యలహరి  స్తోత్రములో స్తుతించినట్లు(38 వ శ్లోకం)
   సమున్మీలిత్ సంవిత్ కమలముగా మన హృదయమును కల్మషరహితమైన బంగరుకమలముగా మన మనసును కనుక మలచగలిగితే,హంసద్వంద్వముగా వచ్చి వారు ,భక్తి అనే మకరందమును గ్రోలుతూ,సకలవిద్యా తత్త్వములను ముచ్చటించుకొనుచు,మనము సమర్పించే స్తోత్రము లోని,
 యదాదత్తే దోషాత్-దోషములను క్షమించి,గుణములను మాత్రమే స్వీకరించి అనుగ్రహిస్తారు.
  కాని "శివ మహిమ్నా స్తోత్రములో"పుష్ప దంతుడు విన్నవించుకొనినట్లు ఆ శంకరుని/శాంకరిని కీర్తించుట
 'అసితగిరి సమస్యాత్ కజ్జలం సింధుపాత్రే
  సురవరుతరు శాఖా లేఖినీ పత్రముర్వీ
  లిఖిత యది గృహీత్వా శారదా సర్వకాలం....
   సముద్రమును పాత్రచేసుకొని,నల్లనికొండను సిరాగా ద్రవింపచేసి,కల్పవృక్షమును కలముగా మలచుకొని,భూమి యను పలకపై సరస్వతీ దేవి  వ్రాయుటకు ఉపక్రమించినను సాధ్యముకాని,
   జగన్మాత వైభవమును పరిచయము చేసుకొనుటకు సాహసించుట తల్లి నాపక్కనే నిలబడి,తన వైభవమును తానే తెలియచేస్తూ,మనలను మంత్రముగ్ధులను చేస్తుందనే నా  ఆశ.

   "యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా
   నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః." 

   సర్వం శ్రీమాతా చరణారవిందార్పణమస్తు.

 (అమ్మదయతో  అర్చనకొనసాగుతుంది.)




  

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...