ఓం నమః శివాయ
******************
పరమేశ్వర నిర్హేతుక కృపాకటాక్ష తార్కాణమే నన్ను పరికరముగా మలచుకొని మనకు అందించ నున్న,
"ధ్యాయేత్ - ఈప్సిత సిధ్ధయేత్." అను శీర్షిక.
ఆద్యంతరహిత అనుగ్రహ విశేషమే ఈప్సితప్రదము.అది ధ్యాతకు ధ్యానముచే ప్రాప్తించుటమరొక విశేషము.
ఈప్సితము అనగా అభీష్టము-కోరిక.దాత-గ్రహీత,అభ్యర్థన-అనుగ్రహము,సాధన-సిధ్ధి అను రెండింటికిని వారధిగా నిలిచి,అనుసంధానమును చేస్తు,అనుగ్రహమును అందించుటలో ప్రధానమైనది ఈప్సితము.
ధ్యాత పరముగా ఆలోచిస్తే అది యుక్తాయుక్తములను కలిగియుండవచ్చును/లేకపోవచ్చును.అర్హమైనది కావచ్చును/కాకపోవచ్చును.ధ్యాతలు అనేకానేకములు.వారి ధ్యేయములు అనేకానేకములు.
కాని పరమాత్మ/పరతత్త్వము/అమృతత్త్వము,అనుగ్రహము ఒక్కటే.దానితో సమానమైనదియును/దానికన్న అధికమైనదియును లేనేలేదు.అదియే సర్వకాల ప్రామాణికము.కనుక ఈప్సితము పరమాత్మ అనుగ్రహమునకు నోచుకొనినదై యుండుట దాని సంస్కారము.
ఎప్పుడైతేజీవి తన అత్యంత స్వల్పత్వమును గ్రహించి,దానిని నిస్సంకోచముగా అత్యంత బృహత్తునకు సమర్పించగలుగు ప్రయత్నము మొదటిమెట్టు.దానిని పరమాత్మ వద్దకు చేర్చగలుగు శక్తియే మన నమ్మకము.వినిపించునదియును అదియే.విన్నపమును అనుగ్రహముగా మారువరకు ఓపికతో వేచియుండి వెంటపెట్టుకొని తనతో తెచ్చి,నీకు అందించునదియును ఆ నమ్మకము మాత్రమే.
ఏ విధముగా పగిలిన మూర్తి ఆరాధ్యనీయముగా పరిగణించబడదో,అదేవిధముగా చెదిరిన నమ్మకము చైతన్యమును దర్శించి,ధన్యతను పొందలేదు.
ఎప్పుడైతే జీవి తన అత్యంత స్వల్పత్వమును తెలుసుకొని దానిని అత్యంత బృహత్తునకు సమర్పించుతకు సన్నధ్ధమగుతుందో,తన అడుగును ముందుకు కదుపుతుందో,అనుగ్రహము సమీపించుటకు తన అడుగులను వడివడిగా వేస్తు,వాత్సల్యమును కురి
పిస్తుంది.
సర్వం పరమేశ్వరార్పణమస్తు.