Monday, April 16, 2018

SAUNDARYALAHARI-95

సౌందర్య లహరి-ఇనుప ప్రాకారము


   పరమ పావనమైన  నీ  పాదరజకణము
   పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

   ఏడు యోజనముల  విస్తీర్ణము నానా శస్త్ర రక్షకులతో
   చెవులుచిల్లులు పడేటంత గుఱ్ఱపు సకిలింతలతో

   సుధాసాగర మధ్యమున  నవనవోన్మేషముగా
   సర్వేశ్వరి  సంకల్పిత సర్వలోక ద్వారములలో

   లెక్కించలేనంతగ క్రిక్కిరిసిన భక్తులను
   అడ్డగించుచున్న ద్వారపాలకులను దాటుతు

   ఏ నోము ఫలితమో ఇది ఏపూర్వ పుణ్యమో
   అయోమయ ప్రాకారములోనికి అడుగులు తడబడుచున్న వేళ

  నీ మ్రోలనే నున్న  నాకేలు విడనాడకమ్మా,నా
  నా మానస విహరి ఓ సౌందర్య లహరి.

 మణిద్వీపమునకు నాలుగు వైపుల అమృత సాగరముంటుంది.సాగరతీరములో దక్షిణావర్త శంఖములు-రతనాల ఇసుక ప్రదేశములు-రత్మ వృక్ష వాటికలతో,అమ్మ సందర్శనమునకై చిన్న పడవలతో వచ్చుచున్న భక్తులతో కళకళలాడుతుంటుంది.అంతేకాదు మొదటి ప్రాకారమైన ఇనుప ప్రాకారము నాలుగు ద్వారములలో కిక్కిరిసిన దేవ,యక్ష,కిన్నెర,కింపురుషాదులతో,నిలిపిన వారి ఆయుధములనుండి వచ్చు రణగొణ ధ్వనులతో,చెవులను చిల్లుపరచునా అనేటంత.గుర్రపు సకిలింతలతో,ఇసుకవేస్తే రాలనంతగ,ఇసుమంతయు ఒకరి మాట వినిపించలేనంతగ కోలాహపూరితమై ఉంటుండి.అరి వీర భయకరులైన,ఆయుధధారులైన,తల్లి సేవా దురంధరులైన,అప్రమత్తులైన,అనిర్వచనీయ పుణ్యశాలులైన ద్వారపాలకులు,వారిని నిర్ణీత క్రమపద్ధతితో,ఏడు యోజనముల (16038 కిలోమీటర్ల) విస్తీర్ణముగల ప్రాకారములోనికి అనుమతిస్తున్న సమయములో (నన్నుకూడ) అయోమయ (ఇనుప) ప్రాకారములోనికి ఆనందోద్వేగములతో నా అడుగులు తడబడుచున్న సమయమున,చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.



  

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...