Wednesday, February 7, 2018

SIVA SANKALPAMU-53


 నీ నియమపాలనలోభక్తి నిగ్గు తేల్చుకోవాలని
 అత్యంత ప్రేమతో  వారిని అక్కున చేర్చుకోవాలని

 అగ్గిలో కాల్చావు ఆ భక్త నందనారుని
 అఘోర వ్రతమన్నావు ఆ చిరుతొండనంబిని

 అంబకము అడిగావు ఆ బోయ తిన్నడీని
 అర్థాంగిని ఇమ్మన్నావు ఆ అయ్యలప్పను

 అంత పరీక్షించావు అమ్మాయి గొడగూచిని
 దొంగతనము  నేర్పావు ఆ కన్నడ బ్రహ్మయ్యకి

 కాళ్ళను నరికించావు కఠినముగ మహదేవునికి
 కళ్ళను పీకించావు కటకట మల్లికార్జునికి

 భక్తులకు పరీక్షలను నీ కఠిన శిక్షలు ఇక
 అక్కర లేదనవేరా  ఓ తిక్క శంకరా!

SIVA SANKALPAMU-52


  నీకన్న నీ బసవడు అనయము కొనియాడబడుతుండ
  నీ కన్న నీ నామము మంగళకరమగుచుండగ

  నీ కన్ననీ సిగశశి చాంద్రమానమగుచుండ
  నీ కన్న నీ కాలము శేషపూజలందుచుండ

  నీ కన్న శిరసుగంగ నీరాజనములందుచుండ
  నీ కన్న నీ కృత్తిక నిఖిలకీర్తి పొందుచుండ

  నీ కన్న నీ పరివారము ప్రస్తుతింప బడుచుండ
  నీ కన్న నీ భక్తుల కథలు మారుమ్రోగుతుండ

  నీ కన్న నీ భోళాతనము వేళాకోళమగుచుండగ
  చూసి చూదనట్లుగా,తెలిసి తెలియనట్లుగా

  పోనీలే అంటుంటే,  కానీలే అని మిన్నకుంటే
  ఎక్కడున్నదిరా న్యాయము  ఓ తిక్క శంకరా!

SIVA SANKALPAMU-51


  నీ చిన్మయముద్రను నేను అనురక్తితోచూస్తుంటే
  నీ తలపని గంగమ్మ నన్ను తుంగతొక్కుతానంటున్నది

  నీ జటాజూటము నన్ను దక్షుడు అనుకుంటున్నది
  నీ శిరమున శశి  గ్రహణము నాకేనని అంటున్నది

  నీ కంఠములోని విషము నన్ను కబళించాలనుకుంటున్నది
  నీ చేతి డమరుకము నా వివరము అడుగుతున్నది

  నీ నడుము పులితోలు కలవరమేఅంటున్నది
  నీ వాహనమైన ఎద్దు నన్ను గద్దిస్తోంది

  నీ మంజీరమైన పాము నాపై బుసలు కొట్టుతున్నది
  వేడుకొనుట దేవుడెరుగు నిన్ను చూడనీయకున్నవి

 నీ వైనము ఏమిటి? నావైపు చూడవు భయముతో
 ఉక్కిరిబిక్కిరి అవుతున్నానురా ఓ తిక్క శంకరా!

SIVA SANKALPAMU-50

" అభిషేకములను చేస్తే" శుభములను ఇస్తాడట
" బూది పూతలను పూస్తే" మోదములే ఇస్తాడట
"దీపము దానము చేస్తే" పాపము పోగొడతాడంట
"రాయిని దానము చేస్తే" సాయము అవుతాడట
'శివ నామము" జపియిస్తే పరవశుడే అవుతాడట
తమ వాడని తలిస్తే "మమేకమే అవుతాడట"
"పురాణ పఠనము చేస్తే" పునర్జన్మ తొలగునట
బ్రహ్మ రాక్షసుడు వినగానే" బ్రహ్మజ్ఞాని అగునట"
"కృత్తికా నక్షత్రము" కృతకృత్యులను చేస్తుందట
"కార్తిక దామోదరుడంటు" హరి శివుని చేరునట
"పదకొండు నెలలు వదిలినా" కైవల్యమును పొందగా
"ఒక్క కార్తికము చాలునట"! ఓ తిక్క శంకరా.
భావము
నెత్తిమీద నీళ్ళకుండ,కాలిపోయిన బూడిద,తన నామము వినబడాలనుట,తన మహిమలను పురాణ పఠనముగా జరిపించాలనుకొనుట, రాయిని దానముగా ఇమ్మనుట,పదకొండు నెలల పూజకు రాయితీని ఇచ్చుట,వెలుగు ఇచ్చేయమనుట శివుని స్వార్థమునకు ఉదాహరణలు-నింద.
అండాండ బ్రహ్మాండములలో నిండిన క్షిప్ర ప్రసాదత్వము కలవాడు శివుడు.తలచిన వెంటనే కరుణించుటయే క్షిప్ర ప్రసాదత్వము.-స్తుతి.

SIVA SANKALPAMU-48


 పాలుతాగి విషము కక్కు పాముమీది మోజుతో
 పాల కడలి విషము మింగ పావుగ మారావు

 అసత్యమాడిన  ఆబ్రహ్మ ఎంత చతురుడో
 తన కపాలములు చూసి దొంగవని అంటాడు

 ఆలములో దాగిన కన్ను ఎంత చుప్పనాతిదో
 అసలు తెరువ నీయవని అలుకతో ఉంటుంది

 తలపైని తైతక్కల గంగకెన్ని నిక్కులో
 ఇటు అటు కదలనీయవని ఆడిపోసుకుంటుంది

 కుదురుగ ఉండలేని శశికెన్ని కినుకలో
 రాహు-కేతు బాధలను కబళించవు అంటాడు

 బుజ్జగ్స్తున్న తల్లి బెజ్జమాట వినకుంటే
 చిక్కుల్లో పడతావురా ఓ తిక్క శంకరా! 

SIVA SANKALPAMU-47

శశిశీతలకిరణములు నిను సతమతము చేస్తుంటే
గంగమ్మ నెత్తిమీద గజగజలాడిస్తుంటే

అభిషేకపు జలాలు అంతగా ముంచేస్తుంటే
పన్నీటి ధారలు మేము అల్లుకోమ అంటుంటే

చందనాల పూతలు చలి ముల్లులు గుచ్చుతుంటే
చుట్టుకున్న పాములు గుట్టుగ వణికిస్తుంటే


వింజామర గాలుల చలితెమ్మెర సాగుతుంటే
అయ్యో పాపం అంటూ అమ్మ నిన్ను పట్టుకుంటే


సగ భాగము మంచాయె చల్లదనపు అల్లరిలో
చల్లనైన కొండపై చెలువపు అర్థాంగితో నున్న


కొర కొర చూపులతో నిన్ను చలి కొరికేస్తుంటే
కిక్కురుమనవేమిరా ఓ తిక్క శంకరా.
.....................................................................................................................................................................................................చంద్రుని వెన్నెల కిరణాలు, గంగా జలాలు,అభిషేక జలాలు, పన్నీటి ధారలు,పాములు,చందనాలు,వింజామర గాలులు,మంచు కొండ చలిని మరింత ఎక్కువచేస్తుంటే,అర్థాంగియైన పార్వతి మీ చలిని తగ్గించాలని ఆలింగనము చేసుకోగా చలి మరింత ఎక్కువైనది.శివునికి చలినుండి తనను ఎలా కాపాడుకోవాలో తెలియదని నింద. 

శివుడు వీటన్నిటికి అతీతుడు కనుకనే నిశ్చలముగా ఉండ గలిగినాడు-స్తుతి.

SIVA SANKALPAMU-46


   శ్రీకరుడౌ శివునికి కరివదనుని ప్రస్తుతి
   షడక్షరీ మంత్రధారికి షణ్ముఖుని ప్రస్తుతి

   ఆనం తాందవునికి ఆ నందిముఖుని ప్రస్తుతి
   హర హర దేవునికి  హయవదనుని ప్రస్తుతి

   శుభకర శంకరునికి శుకవదనుని ప్రస్తుతి
   శితి కంఠ దేహునికి సింహ వదనుని ప్రస్తుతి

   కపర్దినామ ధారికి కపివదనుని ప్రస్తుతి
   మేనక అల్లునికి మేషవదనుని  ప్రస్తుతి

   అఖిల జగద్రక్షకునికి  ఆదిశేషుని ప్రస్తుతి
   బ్రహ్మాండ నాయకునికి   బహుముఖముల ప్రస్తుతి

   నాపై కరుణచూప  సుముఖుడివి గాకుండుట,నీ
   టక్కరి తనమేరా ఓ తిక్క శంకరా!.

   

SIVA SANKALPAMU-43


 ఎత్తైన కొండలలో భోగ నందీశ్వర్డిని అంటావు
 చేరలేనంత  ఎత్తులో చార్ధాములో ఉంటావు

 లోయలలో హాయిగా త్రిసిల్లి మహేశ్వరుడిని అంటావు
 దూరలేనంత  గుహలలో అమరనాథుడివై ఉంటావు

 కీకారణ్యములలో అమృతేశ్వరుడిని అంటావు
 ఎడారులలో వేడుకగా  భోలేశ్వరుడిని అంటావు

 కనుమల దగ్గర కామరూప కామాఖ్యుడిని అంటావు
 జలపాతాల లోతులలో బాణేశ్వరుడిని అంటావు

 భూగర్భమున  దాగిహంపి విరూపాక్షుడిని అంటావు
 ఈదలేనంత  గంగ ఒడ్డున ఈశ్వరుడిని అంటావు

 నా మదిని వదిలేసావు దయలేక, తెలియదుగా ,నీకు
 ఎక్కడ ఉండాలో ఓ తిక్క శంకరా!. 

SIVA SANKALPAMU-42


 మరుని శరము పూవుగా నిన్ను మనువాడమని
 మదనుడు అనగానే గౌరీపతివి  అయినావు

 క్షీరసాగర మథనములో విషము స్వీకరించమని
 గౌరి నిన్ను అడగగానే గరళకంఠుడివి అయినావు

 గంగవెర్రి నెత్తిమీద సుతిమెత్తగ మొత్తమని
 భగీరథుడు అనగానే  గంగాధరుడివి అయినావు

 గంగిరెద్దు మేళములో నీకు రంగు వస్త్రమౌతానని
 కరి రాజు అనగానే గజ చర్మధారివైనావు

 భృంగి సైగ చేయగానే నీ సింగారపు  నాట్యమట
 " సంధ్యారంభ విజృంభితవు" నీవు కాదని

  సంజ్ఞారంభ విజృంభితుడవు పాపం నీవని
 పెక్కుమార్లు విన్నానురా ఓ తిక్క శంకరా!.

SIVA SANKALPAMU-41


 నీ నెత్తిమీది గంగను చూసి నదులు బెంగ పడ్డాయట
 మా నెత్తిమీదికి ఏ ఆపద ముంచుకొస్తుందేమోనని

 నీ కంఠమంటిన పామును చూసి  పాములు చిన్నబోయాయట
 మా కంటిముందు ఏ గండము వెన్నంటి ఉందోనని

 నీ చేతిలోని మృగమును చూసిన లేళ్ళు దిగులుపడ్డాయట
 వాడి బాణమేదో  తమను దాడి చేయనుందని

 నీ గజచర్మమునుచూసి  కరులు గజగజలాడాయట
 పొట్టచీల్చి ఎవరు తమను పొట్టను పెట్టుకుంటారో అని

 నీ బ్రహ్మ పుర్రెలు చూసిన జనులు భయపడుతున్నారట
 రిమ్మ తెగులు కమ్ముకొని నోట దుమ్ము కొడుతుందని

 " దయనీయశ్చ-దయాళుకోస్తి"అని సువర్ణమాల అనగానే
   ముక్కున వేలేసానురా  ఓ తిక్క శంకరా!.




TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...