Wednesday, February 7, 2018

SIVA SANKALPAMU-50

" అభిషేకములను చేస్తే" శుభములను ఇస్తాడట
" బూది పూతలను పూస్తే" మోదములే ఇస్తాడట
"దీపము దానము చేస్తే" పాపము పోగొడతాడంట
"రాయిని దానము చేస్తే" సాయము అవుతాడట
'శివ నామము" జపియిస్తే పరవశుడే అవుతాడట
తమ వాడని తలిస్తే "మమేకమే అవుతాడట"
"పురాణ పఠనము చేస్తే" పునర్జన్మ తొలగునట
బ్రహ్మ రాక్షసుడు వినగానే" బ్రహ్మజ్ఞాని అగునట"
"కృత్తికా నక్షత్రము" కృతకృత్యులను చేస్తుందట
"కార్తిక దామోదరుడంటు" హరి శివుని చేరునట
"పదకొండు నెలలు వదిలినా" కైవల్యమును పొందగా
"ఒక్క కార్తికము చాలునట"! ఓ తిక్క శంకరా.
భావము
నెత్తిమీద నీళ్ళకుండ,కాలిపోయిన బూడిద,తన నామము వినబడాలనుట,తన మహిమలను పురాణ పఠనముగా జరిపించాలనుకొనుట, రాయిని దానముగా ఇమ్మనుట,పదకొండు నెలల పూజకు రాయితీని ఇచ్చుట,వెలుగు ఇచ్చేయమనుట శివుని స్వార్థమునకు ఉదాహరణలు-నింద.
అండాండ బ్రహ్మాండములలో నిండిన క్షిప్ర ప్రసాదత్వము కలవాడు శివుడు.తలచిన వెంటనే కరుణించుటయే క్షిప్ర ప్రసాదత్వము.-స్తుతి.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...