Wednesday, November 13, 2024
TANOTU NAH SIVAH SIVAM-13
. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ." మహాదేవుడు మన్మథ పంచబాణములను దహించివేసి వాని సౌశీల్య సౌందర్యమును అలంకారముగా మలచుకుని,తన విశాలఫాలభాగనందు అలంకరించుకుని "కామేశ్వరుడై" కన్నులపండుగ చేస్తున్నాడు. స్వామి లలాటము యజ్ఞవేదికగా ప్రజ్వలిస్తున్నదికదా.దానిని కొనసాగిస్తూ (చమకము) ఋత్విక్కులు , ఇధ్మశ్చమే-బర్హిశ్చమే-వేదిశ్చమే-ధిష్టియాశ్చమే- అంటూ యజ్ఞ నిర్వహణకై మా అందరికి సమిధలు-దర్భలు-ద్రోణకలశములు-సుక్కులు-స్రవములు మొదలగునవి సంవృద్ధిగా అందీయమని అర్థిస్తున్నారు. మరొకవైపు పామరజనులు పయశ్చమే-రసశ్చమే-ఘృతంచమే-మధుచమే అంటూ అభిషేకమునకు కావలిసిన పాలు-పండ్లరసములు-నేయి-తేనె మొదలగు వాటిని అర్థిస్తున్నారు. మరికొందరు తిలాశ్చమే-ముద్గాశ్చమే-గోధూమాశ్చమే అంటుండగా మరికొందరు కృష్ట పచ్యంచమే-అకృష్టపచ్యంచమే దున్నినదైనా లేక దున్ననిదైనా సరే భూమిని అడుగుతున్నారు. కొందరు పశువులను-,మరి కొందరు సంతతిని అభ్యర్థిస్తున్నారు. స్వామి తాను నేరుగా ప్రసాదించుట రివాజు కాదుకనుక శక్తివైపు చూశాడట. ఆ జగదంబ నిత్యాన్నదానేశ్వరి-నిత్యానందకరి. అంతేకాదు లీలా నాటక సూత్ర ఖేలనకరీ. కనుకనే దృశ్యాదృశ్య విభూతి పాలనకరి అయినప్పటికిని వాటిని చిత్రించి మురిసిపోయే వినోదమును తన స్వామికి అందించినది. స్వామిది సామాన్యకల్పనము కాదు-ప్రకృష్టమైన కల్పనమునకు శిల్పిని చేసి మురిసిపోతున్నది. స్వామి అమ్మ వారి కుచములనెడి పర్వతములపై చిత్రపత్రకములనుంచుతున్నాడు (తామర ఆకులపై-తాటి ఆకులపై మొసలినోటి మొన వంటి మొనౌన్న కాడలతో పుష్పరసములతో వ్రాయు సంప్రదాయమును ప్రారంభించాడు జగత్కుటుంబమునకు జగత్పితయై.) సాధారణముగా శిల్పి శిలలోని అనవసర శేషములను తొలచివేసి అందమైన శిల్పమును మలుస్తాడు. ఈ ఏకైక శిల్పి విశ్వములోని తారకాసురమను అనవసరమును తీసివేసి విశ్వసౌభాగ్యశిల్పమును మలచుటకు ఉపక్రమించబోతున్నాడు.( కుమార సంభవమునకు నాంది అనుకొనవచ్చును) మహాదేవుడను మహాశిల్పి అమ్మ వక్షస్థలమను పర్వతభాగముపై కొన్ని అవశేషములను తీసివేస్తూ, క్షేత్రములు-తీర్థములు-అరణ్యములు=పొలములు-జలపాతములు-సూర్యుడు-చంద్రుడు-నదులు-సముద్రములు-గుట్టలు-లోయలు-అంటూ నైసర్గికస్వరూపమునకు రూపుదిద్దుతూ వాటి సమన్వయముతో సమృద్ధిగా సస్యములను అందిస్తున్నాడు. స్వామి అన్నానాం పతయే నమః-అమ్మ అన్నపూర్ణేశ్వర్యై నమః. రెండవ చరణములో "కిశోరచంద్రశేఖరే "రతి ప్రతిక్షణం మమ" అన్నాడు రావణుడు. మరింత అనుగ్రహము వర్షించిన తరువాత ప్రస్తుతము "రతి ప్రతిక్షణం" అంటున్నాడు.ఇప్పుడు కేవలము చంద్రశేఖరునిగా మాత్రమే కాదు. అగ్నినేత్ర దర్శనము తరువాత "త్రిలోచనుని" తో క్రీడించాలనుకుంటున్నాడు. సూర్య-చంద్ర-అగ్ని లోచనునితో మమేకమయి క్రీడించవలెనన్న దాటవలసిన స్థితులు ఎన్నో. ఆదిశంకరుల సౌందర్యలహరి స్తోత్రములో స్వామి స్థాణువు-అమ్మ చైతన్యము.శివతాందవ స్తోత్రములో అమ్మ స్థాణువు.స్వామిచైతన్యము.ఒకరికొకరు ఒద్దికగా స్థావర-జంగమాత్మకమగుటయే కదా అర్థనారీశ్వరము.అత్యంత మనోహరము. "ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై సమస్త సంహారక తాండవాయై జగజ్జనన్యై జగదేకపిత్రే నమః శివాయైచ నమః శివాయ." ద్విపంచాక్షరీ. కదిలేది ప్రపంచము-కదలనిది పరమాత్మ భజ శివమేవ నిరంతరం ఏక బిల్వం శివార్పణం.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-13
. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment