Thursday, December 28, 2017

PANDUGALU-BONALU

బోనాలు శుభాకాంక్షలు
..................
తల్లీ..బైలెల్లినాదరో
సల్లంగ..సూసి నాదరో
.................
జాతరల మోతలతో
అసాడం..ఐతారం
పిల్లగాళ్ళు..పైలమంటూ
తల్లీ..బైలెల్లినాదిరో
సల్లంగ..సూసినాదిరో
..............
ఏ..పొద్దూ..కాపాడు
మా..పెద్దతల్లి
ముద్దైన..రూపాలు..ఇంగో..ఓ
సద్దడి..చేస్తున్నయి
తల్లీ..బైలెల్లినాదిరో
సల్లంగ..సూసినాదిరో
...........
పోచమ్మ,మైసమ్మ
ఎల్లమ్మ,రేణుకమ్మ
కొండలమ్మ,గాజులమ్మ
అంకాలమ్మ,పోలేరమ్మ
ముత్యాలమ్మ,సత్యాలమ్మ
ఎన్నెన్ని.రూపాలతో
తల్లీ..బైలెల్లినాదిరో
సల్లంగ..సూసినాదిరో
..........
పచ్చంగ..ఉండాలని
పచ్చి కుండలను తెచ్చి
అచ్చంగ..అమ్మరూపు
ముచ్చటగ..దిద్ది
ఘటనలను..తప్పింపగ
ఘటములతో..మెప్పింపగ
పచ్చన్నముతో..నీ..కాడికి
వచ్చింది..పోచమ్మా
......
*ఊరడి* అందుకుని
ఆరడులు..తోలేయి 11తల్లీ11
.........
దూకుడులను..తప్పించగ
మూకుడులు..తెచ్చి
ఆ..నాకము..దింపగ
పానకము..పోసి
బాగుకోరు..తల్లికి
*సాకు* వార..బోయగ
సాగింది..మైసమ్మ
.....
*సాకు* నందుకుని
మమ్ము సాకు తల్లీ 11తల్లీ11
.........
బండరాయి..మనసులను
బండారుతో..మారిసి
కొండేక్కని..దీపాలతో
ఎండీ..కడియాలు..మోగ
పాపాలను..తొలగించ
ఏపాకులను..బట్టి
శివశక్తి..రూపాలై
చిందేసే..పోలేరమ్మ
.....
మా..ముందుండి..ఏలుమమ్మా11తల్లీ11
........
ఎన్నెలంటి...మా..తల్లికి..ఎన్నెన్నో..పూఒజలు
నాలుగు..దిక్కుల..మాతల్లికి..నానాఇద..పూఒజలు
.....
తొట్టెలతో..ఎల్లమ్మ
పట్టీలతో..అంకాలమ్మ
పసుపు..కుంకాలతో
పసిడి.రేణుకమ్మ
గవ్వలతో..గాజులమ్మ
దండలతో..కొండలమ్మ
.......
మనసులు..నీముందుంచి
మా..మనిసివి..నీవంటుంటే
.......
రంగం..ఈరంగాలు
మేకపోతు..విందులు
పోతురాజు..చిందులు
బోనాల..పూజలలో
బోలెడు..రివాజులు
......
పంచబూతముల..సాచ్చి
పంచామ్ముతముల..సాచ్చి
పంచుతము...మంచిని
నీ..పంచన..లాలించు11తల్లీ11

PANDUGALU-BATUKAMMA-04

బంగారు బతుకమ్మ
తెలంగాణ పండుగ తెలుగుజాణ పండుగ
సాయుధపోరాటానికి సాయమైన పండుగ
అడవిపూల అందాలు విందుచేయు పండుగ
మంత్రాల మేళాల తంతులేని పండుగ
సింహాసనముల వాహనముల చింతలేని పండుగ
పిండిముద్ద దండి అన్న మెండైన పండుగ
వేయికనుల శిల్పక్కకు హాయి కలుగు పండుగ
ప్రకృతి పరమాత్మ అను ఆత్మీయపు పండుగ
ఛాందస మందబుద్ధిని మందలించు పండుగ
చిన్నా పెద్దా తేడా సున్న అన్న పండుగ
చిన్నచూపుకు కనువిప్పై మన్నించమన్న పండుగ
పెద్దమనసు ముద్దన్న బతుకమ్మ పండుగ
ఆడుతుపాడుతు కొలిచే ఆడపడచుల పండుగ
సింగారాలొలుకు బంగరు బతుకమ్మ పండుగ-శుభాకాంక్షలు.

PANDUGALU-ENGILI PUVVU

ఎంగిలిపువ్వు-వెలుగులురువ్వు
       ***********************
1.వర్షాకాలములో చెరువులో బురద పేరుకుని ఉంటుంది.(మట్టి గౌరమ్మను)బొడ్డెమ్మను తయారుచేయుటకు గ్రామస్థులు తలాఇంత పూడిక తీయుటతో నీరు శుభ్రపడుతుంది.

2.పూలుపేర్చుట కొరకై పొలిమేరదాటి, కొండగట్టు,చేలగట్తు పక్కన నడచి వెళ్ళుటతో స్వచ్చమైన గాలి పీలుస్తుంటే ఆరోగ్యం బాగుంటుంది.

3.పూలను  తెంపుతున్నప్పుడు ఆ ప్రదేశంలో వెలువడు మూలికాపరమైన రసాయనములు ,గాలి,  వాతావరణము రోగనిరోధకశక్తిని పెంపొదిస్తుంది
.
4.పూలను   పేర్చుటలో రంగులు అద్దుటలో,ఆట-  పాటలలో లయ ప్రాధాన్యత
వినోద,విజ్ణాన,సందేశాత్మక విలువలు ద్యోతకమౌతాయి.

5.సదాచారమనే చాందసవాద ముసుగులో కొన్ని పూలను మాత్రమే పరిమితం చేసి పూజకు   పనికి రావన్న గునుగు,తంగేడు,రుద్రాక్ష,బంతి,బీర మొదలగు పూలకు పెద్దపీట వేసి,ప్రకృతి రూపంలో పరమాత్మునిప్రసాదమైన ప్రతిపువ్వు చిరునవ్వేనని తెలియ చేస్తుంది
.

6 . అహల్యశాప సమయమున ఇంద్రునికి శరీరమంతా కన్నులుగా శాపము లభించిందని,తనువంతా కనులు కలిగిన సీతాఫలము నైవేద్య నిషేధమనిన కుహనా సంప్రదాయమునకు తెరతీసి ,మనకు మధురత్వమును అందించుటకు కఠినత్వమును శరీర  మంతయు భరించిన ,భరిస్తున్న శిల్పక్కకు పెద్దపీట వేసిన సంస్కారము
.
7.ఆరోగ్యకర పదార్థములైన పిండి,నెయ్యి,బెల్లముతో తయారుచేసిన "మలీద"ప్రసాదము శక్తికారకమౌతుంది
.

8  స్వాతంత్రసాయుధ పోరాట చతురత,ఆడపడుచులను ఆదరించు నైతికత,ఉల్లాస ఉత్సాహ భరిత మానవత.
9.ఎక్కడినుండి వచ్చామో తిరిగి అక్కడికే.ఐనా ఉన్నన్నాళ్ళు పరోపకారమును చాటే ,మన లోపల,బయట విస్తరించి యున్న గాలి,నీరు,నిప్పు నింగి,నేల,కొండ కోన,వాగువంకల గొప్పతనము వివరించే   గోరంత పూజల కొండంత పండుగ.
10.పదికాలాలు  ప్రజల-ప్రకృతి పరవశించి కలిమిలేములు పంచుకుంటు,ఆడిపాడే ఆనందములో తేలియాడిస్తూ వెలుగులు చిందించేదే ఎంగిలిపువ్వు

PANDUGALU-BATUKAMMA-03

పదహారణాల తెలంగాణ ఆడి పాడుచున్న వేళ
పుత్తడి బతుకమ్మ ఉయ్యాలో
పూల బుట్టబొమ్మ ఉయ్యాలో
రాగి తాంబాళంలోన ఉయ్యాలో
భోగ భాగ్యాలమ్మా ఉయ్యాలో
గుమ్మడాకు మీద ఉయ్యాలో
పసుపు పచ్చని బొమ్మ ఉయ్యాలో
అడవిపూల అందాలు ఉయ్యాలో
అమ్మ అందెలమ్మా ఉయ్యాలో
చెట్టు చేమ సొబగు ఉయ్యాలో
చెమ్మ చెక్కలాట ఉయ్యాలో
కొండ కోన మురిసె ఉయ్యాలో
కోలాట మాడంగ ఉయ్యాలో
.........
సిత్తు సిత్తుల బొమ్మ ఉయ్యాలో
సితి కాలి బతుకునమ్మ ఉయ్యాలో
ఎర్ర కలువల చుట్లు ఉయ్యాలో
ఎర్రిపెత్తనమును మొట్టె ఉయ్యాలో
తామర పూలదండ ఉయ్యాలో
ఏడుగురన్నల చెల్లి ఉయ్యాలో
తంగేడు పూల చుట్లు ఉయ్యాలో
తరుణి తాగమమ్మా ఉయ్యాలో
పూజలందు నిలిచె ఉయ్యాలో
చోళరాజ బిడ్డ ఉయ్యాలో
నాడు మూసిన కన్నులు ఉయ్యాలో
దోసిట పువ్వులు నేడు ఉయ్యాలో
.......
చెరువులు నిండేను ఉయ్యాలో
కరువు తీరేనంట ఉయ్యాలో
గుమ్మాడి పూలచుట్ట ఉయ్యాలో
అమ్మాడి చిరునవ్వు ఉయ్యాలో
గునుకపూలు మెరిసె ఉయ్యాలో
బతుకమ్మ పలువరసై ఉయ్యాలో
చెడ్డతనమును తరుము ఉయ్యాలో
మా దొడ్డ బొడ్డెమ్మ ఉయ్యాలో
...
వదినల్లు వచ్చారు ఉయ్యాలో
బతుకమ్మ ఆడంగ ఉయ్యాలో
పిల్లా పాపాలంత ఉయ్యాలో
తల్లి చల్లంగేలగాను ఉయ్యాలో
సంబరాలు సాగ ఉయ్యాలో
శిల్పక్క రుచులమ్మ ఉయ్యాలో
నీళ్ళ వాయనాలు ఉయ్యాలో
నీకు "మలీదా"లు ఉయ్యాలో
శిరముమీది తల్లి ఉయ్యాలో
సరసులోన కలిసె ఉయ్యాలో
పుత్తడి బతుకమ్మా ఉయ్యాలో
పూల బుట్త బొమ్మ ఉయ్యాలో

PANDUGALU-NEE NOMU NAE NOMUDU

నీ నోము నేనోముదు
ఏమేమి పాటొప్పునే గౌరమ్మ ఏమేమి ఆటొప్పునే
పాదేటి పాటొప్పునే గౌరమ్మ ఆడేటి ఆటొప్పునే
పాడేటి పాటలోన
సాగు ఏరుల్లార,మోగు గాలుల్లార,ఊగు పైరుల్లార
రాగి తాంబాళాన
అమ్మ సింగారాలు,ముత్తాల గునుగులు,కొలువైన కలువలు,రంగుతంగేడులు,సేరు సేమంతులు,రంగు రుద్రాక్షలు,ఎలిగేటి దీపములు,సద్ది గౌరమ్మలు
పూచేటి పూలలోన గౌరమ్మ గుమ్మాడి నేనౌదును
కాసేటి పండ్లలోన గౌరమ్మ శిల్పక్క నేనౌదును.....
ఆడేటి ఆటలోన
లేగదూడల్లార,సోగ కన్నుల్లార,కాలి అందెల్లార
రాగి తాంబాళాన
అమ్మ సింగారాలు,ముత్తాల గునుగులు,కొలువైన కలువలు,రంగు తంగేడులు,సేరు సేమంతులు,రంగు రుద్రాక్షలు,ఎలిగటి దీపములు,సద్ది గౌరమ్మలు
మొక్కేము ఎలగపండే గౌరమ్మ రెండేసి దోరపందే
మొక్కేము ఎలగపందే గౌరమ్మ రెండేసి దోర పండే
గౌరమ్మను పిలిచి,తానాలు చేయించి,అక్షింతలద్దించి,గంధాన కడిగించి,కుంకుమను జారించి,పసుపును పూయించి,పూవాన తేలించి,ఇందయని ముద్దనిడి,బతుకమ్మ తల్లితో చద్దులే ఆడుచు,తోటనే సేరంగ
బంగారు పండ్లవనమే గౌరమ్మ సింగారమే తోచెనే...
మా అమ్మ జాతరలో
రాగితాంబాళాన
అమ్మ సింగారాలు,ముత్తాల గునుగులు,కొలువైన కలువలు,రంగుతంగేడులు,సేరు సేమంతులు,రంగు రుద్రాక్షలు,ఎలిగటి దీపములు,సద్ది గౌరమ్మలు
ఆడేటి ఆటలోన గౌరమ్మ నీ నోము నేనోముదు
పాదేటి పాటాలోన గౌరమ్మ నీ నోము నేనోముదు
అమ్మలక్క చెమ్మ చెక్క నెత్తిమీద గౌరంట
జోర్జోర్ జాతరేలే గౌరమ్మ జొన్నవి దివిటీలే
పసిడిగ పుట్టిన గౌరమ్మ పసిడిగ పెరిగిన గౌరమ్మ
కసువుగ కలిగ మారేవా మనసుగ మాతో తిరిగేవా
వాయనమందిన నీళ్ళు,నోములివంటు జనములు
సొగసుగ బతుకమ సెరువులో కెళితే
మనసెల్ల మురిసే పాట జనమెల్ల మురిసే ఆట
మనసెల్ల మురిసే పాట జనమెల్ల మురిసే ఆట
మనసెల్ల మురిసే పాట జనమెల్ల మురిసే ఆట.

PANDUGALU-ERUVAKA PUNNAMI

Vimala Kowtha vimalaklp@gmail.com

Jun 18
to me
ఏరువాక (సీతా యజ్ఞము )
************************
మట్టిపై మమకారమాయె
రైతు కంట కారమాయె
అన్నదాత కళ్ళుసూడ
ఆగని జలధారలాయె
గుండె పగిలి సెరువాయె
ఆ సెరువు నీటితోనైన
సేద్యము సేద్దామన్న
ఏడున్నది ఏరువాక? ఎన్నడమ్మ దాని రాక?
అరకొర వానలాయె
అరక దూపు తీరదాయె
అన్నదాత పెయ్య సూడ
సిక్కిన బొక్కల గూడాయె
బుక్కెడు బువ్వ లేకపోయె
ఆ బొక్కలగూడు కాడెయైన
దుక్కి దున్నుదామన్న
ఏడున్నది ఏరువాక? ఎన్నడమ్మ దానిరాక?
దళారీ దందాలాయె
ధర అసలు గిట్టదాయె
అన్న దాత బతుకు సూడ
ఆగమవుతున్నదాయె
ఆశలు బుగ్గిపాలాయె
ఆ ఆగము నాగలిచేసియైన
సాగు సేద్దమనుకుంటే
ఏదమ్మ ఏరువాక? ఎన్నడమ్మ దానిరాక?
దేశపు వెన్నెముక ఆయె
దేనికి వెనుకాడడాయె
అన్నదాత తెగువ సూసి
పశువులకు పూజలాయె
పంట పనులు షురువాయె
నేడే కద ఏరువాక నేటిరైతు ఆశారేఖ!!!!!!!!!!.
(స్పూర్తినిచ్చిన శ్రీమతి శారద రమేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదములతో.)

PANDUGALU-GANESH POOJA

జై.బోలో.గణేష్.మహరాజకి.జై
అభివందనం..గణపతి
ఆదిపూజ్య.....గణపతి
ఇక్షుదండ....గణపతి
ఈశపుత్ర......గణపతి
ఉత్సవరూప...గణపతి
ఊహాతీత.....గణపతి
ఋషిపూజ్య...గణపతి
ఎలుకవాహన..గణపతి
ఏకదంత......గణపతి
ఐశ్వర్య......గణపతి
ఒద్దికైన.....గణపతి
ఓంకార.......గణపతి
ఔదుంబర.....గణపతి
అంబాసుత......గణపతి
దు:ఖహర.....గణపతి
..............ఈ
స్వరార్చనను గైకొనరా
సర్వార్చనగా.గణపతి
...............
కలుషహర....గణపతి
ఖలవిదూర..గణపతి
గణనాయక...గణపతి
ఘన వరముల.గణపతి
జ్ఞానదాత..గణపతి
........
చవితిపూజ్య.గణపతి
చత్రధర...గణపతి
జయమునీయ...గణపతి
ఝషరూప....గనపతి
విజ్ఞానము......గనపతి
.........
టంకపు.ఓ.గణపతి
హఠయోగప్రియ.గణపతి
డమరుహస్త..గణపతి
ఢంకా.నాద.గణపతి
ప్రణవరూప....గణపతి
..............
తరియించగ..గనపతి
రథారూఢ..గనపతి హ..గణపతి
దయారూప..గణపతి
ధర్మతేజ..గణపతి
నగపౌత్ర.గణపతి
............
పండితశుభ.గణపతి
ఫలదాయక..గణపతి
బతుకునీయ..గణపతి
భద్రతీయ..గణపతి
మధురహాస.గణపతి
...........
యతిసేవ్య.గణపతి
రక్షకుడు.గణపతి
లక్ష్మీపతి..గణపతి
వక్రతుండ.గణపతి
శత్రుహర..గణపతి
షణ్ముఖ సోదర.గణపతి
సకలము.శ్రీ.గణపతి
హరిద్రా..గణపతి
కళలధారి..గణపతి
క్షమాహృదయ.గణపతి
ఱాతి..రూప.గణపతి
............నీ
అవ్యాజ కరుణయే..ఈ
వ్యంజనముల.హారతి
అక్షర.పూజలందుకొని
అక్షయ.వరములను
అందీయర..గణపతి
వందనములు.గణపతి.
.........
సర్వేజనా.సుఖినో.భవంతు.


TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...