ఎంగిలిపువ్వు-వెలుగులురువ్వు
***********************
1.వర్షాకాలములో చెరువులో బురద పేరుకుని ఉంటుంది.(మట్టి గౌరమ్మను)బొడ్డెమ్మను తయారుచేయుటకు గ్రామస్థులు తలాఇంత పూడిక తీయుటతో నీరు శుభ్రపడుతుంది.
2.పూలుపేర్చుట కొరకై పొలిమేరదాటి, కొండగట్టు,చేలగట్తు పక్కన నడచి వెళ్ళుటతో స్వచ్చమైన గాలి పీలుస్తుంటే ఆరోగ్యం బాగుంటుంది.
3.పూలను తెంపుతున్నప్పుడు ఆ ప్రదేశంలో వెలువడు మూలికాపరమైన రసాయనములు ,గాలి, వాతావరణము రోగనిరోధకశక్తిని పెంపొదిస్తుంది
.
4.పూలను పేర్చుటలో రంగులు అద్దుటలో,ఆట- పాటలలో లయ ప్రాధాన్యత
వినోద,విజ్ణాన,సందేశాత్మక విలువలు ద్యోతకమౌతాయి.
5.సదాచారమనే చాందసవాద ముసుగులో కొన్ని పూలను మాత్రమే పరిమితం చేసి పూజకు పనికి రావన్న గునుగు,తంగేడు,రుద్రాక్ష,బంతి,బీ ర మొదలగు పూలకు పెద్దపీట వేసి,ప్రకృతి రూపంలో పరమాత్మునిప్రసాదమైన ప్రతిపువ్వు చిరునవ్వేనని తెలియ చేస్తుంది
.
6 . అహల్యశాప సమయమున ఇంద్రునికి శరీరమంతా కన్నులుగా శాపము లభించిందని,తనువంతా కనులు కలిగిన సీతాఫలము నైవేద్య నిషేధమనిన కుహనా సంప్రదాయమునకు తెరతీసి ,మనకు మధురత్వమును అందించుటకు కఠినత్వమును శరీర మంతయు భరించిన ,భరిస్తున్న శిల్పక్కకు పెద్దపీట వేసిన సంస్కారము
.
7.ఆరోగ్యకర పదార్థములైన పిండి,నెయ్యి,బెల్లముతో తయారుచేసిన "మలీద"ప్రసాదము శక్తికారకమౌతుంది
.
8 స్వాతంత్రసాయుధ పోరాట చతురత,ఆడపడుచులను ఆదరించు నైతికత,ఉల్లాస ఉత్సాహ భరిత మానవత.
9.ఎక్కడినుండి వచ్చామో తిరిగి అక్కడికే.ఐనా ఉన్నన్నాళ్ళు పరోపకారమును చాటే ,మన లోపల,బయట విస్తరించి యున్న గాలి,నీరు,నిప్పు నింగి,నేల,కొండ కోన,వాగువంకల గొప్పతనము వివరించే గోరంత పూజల కొండంత పండుగ.
No comments:
Post a Comment