" జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం
నమామి భగవత్ పాదం శంకరం లోకశంకరం"
" నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే
నమస్తే నమస్తే చిదానంద మూర్తే
నమస్తే నమస్తే తపోయోగ గమ్య
నమస్తే నమస్తే శ్రుతి జ్ఞానగమ్య"
అంటు సదాశివునకు నమస్కరించుకుంటూ,శంకరయ్యతో పాటుగా మనము ఈనాటి బిల్వార్చనమును ప్రారంభించుకుందాము.
పిల్లలు చేతులు పట్టుకుని శంకరయ్యతో పాటుగా నడుస్తున్నారు.
గిరిజ చనువుగా శంకరయ్యగారు శివుడు ఎప్పుడు/ఎక్కడ తాందవము చేస్తాడు?అసలు ఎందుకు చేస్తాడు?ఎవరు దానిని చూస్తారు అంటూ ప్రశ్నలలహరులతో పాటుగా పరుగులు తీస్తుంటే,
అమ్మా గిరిజా!
విశ్వ తాండవమే -విశ్వేశ్వర తాండవము
అది ప్రదోషవేళలలో అనగా సంధ్యాసమయములో జరుగుతుంది.
ఆ నటరాజు సముద్రములను-కొండలను-వనములను-మనములను సముచిత స్థానములలో/అటు-ఇటు చెదిరిపోకుండా చేయుటయే " ఆ శివతాండవము."
దానిని ఆ జగన్మాత వీక్షించుటకు వచ్చినంతనే పరమశివుడు ఆ అమ్మను చూస్తూ,మరింత పరవశముతో చేస్తాడు అనిచెబుతుండగా ఆ పురివిప్పి నాట్యముచేస్తున్న నెమలిరాకు కన్నులముందు సాక్షాత్కరించాడు.
మహా ప్రభో! నీ లీలా విలాసము ఇన్నాళ్ళకు అవగతమగుచున్నది.
నీ పింఛము ఆ మహేశుని జటాజూటము ఒక్కటే.ఉమాశ్లిష మహేశుని శరీరఛాయయే నీ శరీర ఛాయ.ఆ నీలకంఠుని నీలకంఠరమే నీ నల్లని కంథము.ఆ స్వామి తాండవమే నీవు పురివిప్పి చేయు ఆనంద తాండవము.నీ ప్రశ్నలకు సమాధానము లభించినది అని తనలో తాను అనుకుంటుండగా,
గిరిజ శంకరయ్యగారు మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అనగానే ,
తల్లీ ఆ నటరాజు ఆనందతాండవము-..
అనగానే సంకరయ్యగారు,
ఆ మహాదేవుడు శ్మసానములో తిరుగుతాడట? అని అడిగాడు గిరిజ పక్క నున్న బాలుడు భయముగా,
నీకేమి భయములేదు బాబు,
మన అజ్ఞానమే ఆ శ్మశానము.అందులో కాలిపోతున్నవి అమనము చేసే చెడ్డ పనులప్రభావములు.ఆ మిగిలిన కాంతి పుంజము
జ్ఞానము.మనకు జ్ఞానమునందుంచుటకు పాపములనే శవములను స్మశానమనే ప్రదేశములో కాలుస్తుంటాడు ఆ కాలకాలుడు.
కావాలంటే చూడంది ఆ నటరాజ స్వామి కుడికాలినున్నాడు ఒకడు.అవును.ఎవరువాడు.వాడే ఇన్నాళ్ళూ నన్ను వదలక అహంకారమనే గుణముగా/అపస్మారకుడు అనే పేరుతో సత్యమును తెలిసికొనుటకు అడ్దుపడుతున్నవాడు.
స్వామి వాడిని తన కుడిపాదము కింద తొక్కిపెట్టేశాదులే.ఇంకా ప్రశాంతముగా ధ్యానము చేసుకుంటాను.