మీఢుష్టమ శివతమ-22
********************
ఎందుకయా సాంబశివా-ఎవరు నీకు చెప్పేరయ్యా
ఈ అల్లరి చేతలు-ఈ బూడిదపూతలు
ఎందుకయా సాంబశివా ఎందుకయా సాంబశివా.
మార్గములో హడావిడిగా కనిపించారు వైద్యకవలలు.
అశ్వినౌచమ ఇంద్రశ్చమే.
అంతా క్షేమమే కదా అని వారినడుగుతు వీరు మన చిత్ర ఆరోగ్య విభాగమును నిర్వహిస్తారు.మన లక్ష్మణ్ మాస్టారుల వలె కవలలు.
ఒకే పేరు వీరిది.అశ్వనీ 12 అంటాము.
చెరొక పనిని పంచుకున్నారు.అశ్వనీ 1 గారు అనారోగ్య కారణమును మాత్రమే నిశితముగా పరిశీలించి,నిర్ధారణను చేస్తారు.రెండవ వారు దాని నివారణకు కావలిసిన ఔషధములను అందించి సంపూర్ణ ఆరోగ్యమును అందిస్తారు.
నమో భువంతయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమః.
భువంత-సర్వదా సర్వత్ర భవతి-ఎల్లప్పుడు-ఎల్లవేళలా ఉండువాడు.వరివః అనగా సేవ.సేవచేయువారు వారివస్కృతులు.భక్తులు.వారియందు ప్రీతికలవాడు వారివస్కృతుడు.వారిణి జలైవాసః-జలమునందు వాసము చేసినవాడు-నారాయణుడు.
పండిన వెంటనే నశించునవి ఔషధులు.
అవి నశించి మనకు ఆరోగ్యమునిస్తాయికదా.
వాచ్యార్థమును స్వీకరించినచో అరటి మొదలగుచెట్లు,సస్యములు సమన్వయపరచుకోవచ్చును.
పండేది జ్ఞానము.నశించేది అజ్ఞానము.అదియే శివానుగ్రహమనే అజ్ఞానమను అనారోగ్యమును నశింపచేసి-జ్ఞానమను ఆరోగ్యమును అనుగ్రహించు ఔషధము.
ఔషధీనాం పతయే నమః.
ఔషధములనందించు రుద్రునకు నమస్కారములు.
ప్రజాపతిగారి పక్కన నిలబడి వీరు మా యజ్ఞం సినిమా పంపిణీదారులు.అసంఖ్యాకముగా సినిమా ప్రతులను సృష్టించి,విస్తరింపచేసి,దానిని బతికిస్తారు.వెన్నెముక వలె దానిని నిలబెడతారు.
ఇంకా ఎందరో మహానుభావులు.మరిచిన వారిని మన్నించండి అంటూ వీడ్కోలుగా వినయముగా నమస్కరించి వెళ్ళిపోతున్నారు ఇంద్ర.
అందరు ఆయన అరుదైన సంతకము కోసము మీదిమీదికి ఎగబడుతూ ఉంతే,
వ్రాతేభ్యో-వ్రాతపతిభ్యశ్చవో అన్నట్లుగా ఉన్నారు.
సాధకుడు మనము సంతకము తీసుకుందామా అని,
బిగ్గరగా ఇంద్రగారు-ఇంద్రగారు అని పిలువసాగాడు.వెనుకకు తిరుగలేదు వారు.
స్థానమును పట్టుకోవాలని తెలియనట్లుంది-స్థానికుని పిలుస్తున్నాడు అనుకుంటున్నారు వెనక నున్నవారిలో కొందరు.
ఇంతలో ఒక అమ్మాయి పరుగెత్తుకుంటు వచ్చి,వాడు ఇంద్ర అంటే పలుకడు సార్.నేను పిలుస్తా నుండండి. రాజు ఇటురా అని పిలిచింది. అంతే,
ఓయ్ అంటు వెనుదిరిగాడు ఆ ఇంద్రపాత్రధారి.
వీడు మా విద్యార్థుల నాయకుడు.పదవతరగతి చదువుచున్నాడు.వాడి పాత్రను వేదికమీదే విడిచేసాడు అని నవ్వుతోంది.
ఆశ్చర్యముతో ..అంటే..మిగతా..మిగతా.
వాళ్ళు అంతే.అందరము విద్యార్థులమే అన్నది.
విస్తుబోయాడు అదివిని సాధకుడు.
వాస్తవము తెలుస్తోందనుకున్నాడు రుద్రుడు.
కదిలేవి కథలు-కదిలించేది కరుణ.
అణువు అణువుశివమే-అడుగు అడుగు శివమే.
శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
.