చమకములొ శబ్దము
పరమాత్మ తాను స్పూర్తియై మనచేత వాగ్రూపముగా అభ్యర్థలను జరిపించి,అనుగ్రహించుట ఎందుకు? తానే నేరుగా అనుగ్రహించ వచ్చును కదా! అను సందేహము కలుగ వచ్చును. కాని ప్రకృతి నియమానుసారముగా మనకు ఆకలి వేసిన మనమే ఆహారము దగ్గరికి వెళ్ళవలెను.నది నిరంతరము మన దప్పిక తీర్చుటకు తనదైన తీరులో ప్రవహిస్తూనే ఉంటుంది కాని మన దగ్గరకు రాదు.దప్పిక తీర్చుకొనుటకు మనమే జలము దగ్గరకు వెళ్ళలి.అదే విధముగా భగవత్ ప్రాభవమును మనకు పరమాత్మ తెలియపరుస్తూనే ఉంటాడు.మనము గుర్తించగలగాలి.అడగాలి.ఆసరా చేసుకోవాలి.అవరోధములను అధిగమించి,ఆయన పద సన్నిధిని చేవ్రుకోగలగాలి. మనలోని శక్తిని బహిర్గతము చేయాలంటే శబ్దము చాలా అవసరము.అందుకే కాంతిని-శబ్దమును (ప్రణవమును) పరమాత్మ మనకు అందించాడు.ఆ ప్రణవము జీవులను చైతన్య పరచి,వాగ్రూపముగా బహిర్గతమై వాంఛాఫలితములకు సహాయపడుతుంది.
ఆకాశము శబ్ద వాచకము.ప్రథమ భూతము.మహర్షులు దివ్య శబ్దములను అనంతాకాశములో తమ తపశ్శక్తితో వినగలుగుచున్నారు.శబ్దము కలుగచేయు జ్ఞానము మన తమస్సును పోగొట్టును.జగతి మానవులు సృజించలేని దృశ్య వైభవమైతే వేదములు-ప్రణవము మానవులు సృజించలేని శబ్ద వైభవములు.
కనుక ప్రథమ అనువాకములో సాధకుడు అగ్నా-విష్ణూ అంటూ వాగ్రూప స్తోత్రములతో వారిని ఆహ్వానిస్తూ,తనను చైతన్య వంతునిచేసి అన్నముతో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాడు.
నమో శ్రవాయచ-ప్రతిశ్రవాయచ".
శ్రూయత ఇతి శ్రవ.వినబడునది కావున శ్రవము.నమకము పలుకుచున్నవాని రూపమునకు-బదులుపలుకు వాని రూపమునకు నమస్కరించుచున్నది.
"ఉచ్చైర్ఘోషాయ" అని కీర్తింపబడు రుద్రుడు గొప్ప శబ్దము కలవాడు.సప్తస్వరాల రూపములోనున్న సంగీత స్వరూపుడు.( షట్చక్రములు+సహస్రారము)
జీవుల హృదయములలోని సబ్దస్వరూపుడు.వారిచే శబ్దములను-స్తోత్రములను పలికించువాడు-వానిని వినువాడు రెండును రుద్రుడే.
నమో ఆశవేచ-అజిరాయచ అంటూ రుద్రుని సమస్తప్రపంచమును సీఘ్రముగా వ్యాపింపగలవాడని,గమనము నందు సమర్థుడని రుద్రుడు సాధకునికి అవగతము గావించి,వానిచే "అగ్నా-విష్ణు సజోషతే" అంటూ వాగ్రూప యజ్ఞమును సమర్థవంతముగా చేయించుచున్నాడు.అనుగ్రహమునకు ఆరంభముగా.
సాధకుడు అన్నము కావాలని,ధనము కావాలని,ఇంద్రియ సామర్థ్యము కావాలని,ప్రాణశక్తి కావాలని అడుగుచున్నప్పుడు,వాటన్నిటికి ప్రతిరూపమైన శివస్వరూపమునే కావాలని అర్థించుచున్నాడని బోధపడుచున్న చమకముతో మమేకమగుచున్న వేళ "సర్వం శివమయం జగం."
ఏక బిల్వం శివార్పణము.