సౌందర్య లహరి-17
పరమపావనమైన నీపాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
అమ్మవింటి బాణములు అందమైన పువ్వులు
అమ్మ ధమ్మిల్లమున సంపెంగలు-మల్లెలు
ఎదపైన మాలలో ఎర్రని మందారములు
తుమ్మెద ఝుంకారమైన శబ్దముతో పువ్వులు
మృదుస్పర్శతో పులకించు ముచ్చటైన పువ్వులు
అపురూప పరిమళపు అమ్మ చిరునవ్వులు
శబ్ద-రూప-స్పర్శ-గంధ-రస గుణములు కలిగిన
పువ్వులుగా మది సవ్వడులు పూజించుచున్న వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
" చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా" అని ఆది శంకరులు అమ్మవారి కేశ (కచ)
భారమును వర్ణించిరి.తల్లి తనకొప్పులో చంపకములు(సంపెంగలు) అశోక పువ్వులు,పున్నాగ పూలు,సుగంధములను విరజిమ్మే పూలను అలంకరించుకొని ప్రకాశిస్తున్నదట.పుష్పాలలో కొన్ని మధుర భావనలను కలుగచేస్తే మరికొన్ని ఔషధములై ఆరోగ్యాన్నిస్తాయి.చామంతులు కంటికాంతిని ఎక్కువ హేస్తే,పున్నాగ పూలు మనసును-దేహమును ప్రశాంతముగా ఉంచుతాయి.నల్లకలువలు చల్లదనాన్ని ఇస్తాయి.అశోక పుష్పాలు మంచి పరిమళమును కలిగియుండి కాషాయము నుండి ఎరుపు రంగులో గుత్తుల్గుత్తులుగా పూస్తాయి.మనకు అర్థమయేటట్లు హిమాలయ ప్రాంతములో పూసే పుష్పములను అమ్మ ధరించినట్లు వర్ణించారు స్వామి శంకరులు.
అసలీ పూవులకు ప్రత్యేకత ఏమైనా ఉందా అను సందేహము వస్తే ఉందనే అనుకోవాలి.బాహ్యమునకు పూవులుగా తోచుచున్నప్పటికి,ఆంతర్యమును పరిశీలించితే పంచేంద్రియ తత్త్వ ప్రకాశకములు పువ్వులు కనుక తల్లిని,
"పంచమి పంచ భూతేశి-పంచ సంఖ్యోపచారిణి" అని స్తుతించుచున్నప్పుడు అమ్మవారి పంచత్వమును తమకు అనుగ్రహించుచున్నదని సంతసించుచు అమ్మదరి నున్న పువ్వుల పరిమళముమును( భక్తియనే మకరందముతో నిండిన హృదయమనే పువ్వును భక్తులు సమర్పించు సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.