తిరువెంబావాయ్-28
**************
ముందియ ముదలనాడ్ ఇరుదియుం మాణా
మూవరం అరికిలార్ యువర్మట్రు అరివార్
పందనై విరిళియమ్నీయుం ఇన్ అడియార్
పలంకుడి తోరుమెళన్ దళురియ పరనే
శెందలై పురైతిరు మేనియుం కాట్టి
తిరుపెరుం తురైయురై కోయిల కాట్టి
అందణున్ అవదుం కాట్టివందు ఆండాయ్
ఆరముదె పళ్ళి ఎళుందళురాయె.
అశ్వనాథ/గుదుర స్వామియే పోట్రి
***************************
తిరుపెరుంతురై కోవెల దగ్గర సాక్షాత్తు మహాదేవుడే అశ్వనాథ స్వామిగా/గుదుర స్వామిగా ప్రకటితమై కోవెలను మనలను కాపుకాస్తున్నాడు.ఆది/అంతములేని స్వామి అగ్నిస్తంభముగా ప్రకటితమై బ్రహ్మ-విష్ణువులు సైతము గుర్తించలేని/గుర్తించి స్తుతించలేని మహాదేవ! బ్రహ్మాండములను తన వేలికొసపై బొంగరమువలె తిప్పుచున్న అమ్మతో ఇక్కడికి వచ్చి,మా గతజన్మల పాపములను మాయముచేయుచున్న స్వామి మెల్లగా మేల్కొని,మమ్ములను ఆశీర్వదించు.
అంబే శివే తిరు వడిగలే శరణం.