Thursday, November 4, 2021

intro

ప్రియ శివస్వరూపులారా,నమస్కారములు. పాహిమాం హర హర మహాదేవ శంభో శంకర-పాహి-పాహి ************************************************************ పంచభూత సమమిళితము ప్రపంచము.నింగి-నేల-నిప్పు-నీరు-గాలి అను పంచభూతములు(ఐదు ప్రధానంశములు) పరోపకార ఫలితమే మన పర్యావరణము. చాంద్రమాన ప్రకారము చంద్రుడు కృత్తిక నక్షత్ర నివాసముచేయు మాసము కార్తిక మాసము.చంద్రునకు గల మరో పేరు సోముడు.పరమేశ్వరుని అర్థనారీశ్వర శక్తి ఉమ,తల్లి ఉమను కూడియున్న పరమేశ్వరుని సోముడు అని కీర్తిస్తారు. కార్తిక మాసములో పంచభూతములైన నింగి శరత్కాల వెన్నెలతో ఔషధములను అందించుచు ఆరోగ్య వంతులను చేస్తుంటుంది.నేల ఔషధులను ఉత్పత్తి చేస్తుంటుంది.నీరు వర్షపునీటిలోని ఔషధములను స్వీకరించి పరిశుభ్రమై పరిపుష్టినిచ్చుటకు సిద్ధముగా ఉంటుంది కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రము కనుక నిప్పును సర్వరోగములను దహిస్తూ,సర్వజనుల శ్రేయస్సుకు కారణమవుతుంటుంది.గాలి పచ్చదనములోని ప్రాణవాయువును అందిస్తూ ప్రపంచ సౌభాగ్యమునకు ప్రధాన కారణముగా పనిచేస్తుంటుంది.కనుక ఈ మాసములో స్నానము,జపము,తపము,ఉపాసనము.దీపము,ధ్యానము,దానము సదాశివునికి సంతోషదాయకము.(మన లోపలి-బయటి ప్రపంచమునకు.) " న కార్తిక సమో మాసో-న కృతేన సమే యుగం న వేద సదృశం శాస్త్రం-న తీర్థం గంగయా సమం." యుగములలో మొదటిదైన సత్య యుగమునందు ,నదులలో గంగానదికి,శాస్త్రములలో వేదమునకు,మాసములలో కార్తిక మాసమునకు సమానమైనది లేదని పెద్దలు నిర్ధారించారు.ఎందరో మహానుభావులు ఎల్లవేళల వీలుకాని పక్షమున(కనీసము) కార్తిక మాసములో ప్రకృతిని పరమేశ్వరునిగా భావించి,సేవించి,తరించుచున్నారు.వారందరికి నా ప్రణతులు మరియు ప్రణుతులు. తరాలనుండి తరాలకు వారసత్వముగా అందచేయబడుచున్న సహితీ సౌభాగ్య సంపదలు పురానములు. పురాతనముగా అనగా ప్రాచీనకాలములో చెప్పబడినదైనప్పటికిని, కాలభ్రంశమును పొందకుండా నిత్యనూతనముగా ప్రకాశించు నిలువెత్తు విజ్ఞానముపురాణము.అంటే పాతదైన అనునిత్యమును కొత్తగా భాసించేసి అని ప్రశంసితారు అలంకారికులు. పురాణములు స్థలమును వివరిస్తూ స్థలపురాణములుగా, దైవ సాకారమును -సాక్షాత్కారమును వివరిస్తూ శివ పురాణము-విష్ణు పురాణము మొదలగు వానిగా,కాలమును ప్రత్యేకిస్తూ కార్తిక పురాణము-మాఘ పురాణము మొదలగు వాని,ఒక అంశమును విస్త్రుత పరుస్తూ అష్టాదశ పురాణములుగాసనాతన ధర్మమున సర్వోత్కృష్టతకు సాక్ష్యములుగా నున్నవి. సెక్కిలర్పెరుమాళ్ అందించిన పెరియ (పెద్ద-గొప్ప) పురాణమునకు కాల-కుల-దేశ- పరిమితులను అధిగమించి భక్తుని గెలిపించుటకై భగవంతుడు ముచ్చటగా ఆటలాడి-తాను ఓడి వారిని చరితార్థులను చేసిన పెద్ద తనము కలది. శివుడు ఏ విధముగా "నమః శివాభ్యాం-నవయవ్వనాభ్యాం" అని కీర్తింపడుతున్నాడో అదే విధముగా నమః భక్తాభ్యాం- నవయవ్వనాభ్యాం" అని కీర్తింపబడుతు,పెద్దదేవునికి-పెద్ద పురాణమునకు అభేదమును ఆవిష్కరిస్తూ , సత్-చిత్-స్వరూప సాహితీ ప్రక్రియ "పెరియ పురనముగా" మనలను ఆశీర్వదిస్తున్నది. మతవిద్వేషములతో మానవత్వము మరుగునపడిన రోజులవి.అవగాహనా రా హిత్యముతో జైనులు శైవారాధనను, శివ భక్తులను అవమానించిన దైన్యమది. విజ్ఞతను విడిచిన విద్వేషములు విలయతాండవము చేస్తున్న విపత్కర కాలమది. ముప్పుతప్పించదలచిన మూడుకన్నులవాని గొప్పతలంపు " మా దేవడిగళ్ రామదేవ సెక్కిళర్" గా రూపుదిద్దుకుంది కుంద్రతూరులో.వేదాగమ ప్రావీణ్యతతో "అరుళ్ మొళి తేవాన్" అనుగ్రహమును ప్రకటించింది.గంగకుల తిలకునిగా,ఉత్తమ పల్లవచోళన్ గాను పరిమళించింది. తన ఇంటిపేరును సార్థకముచేస్తూ,సెక్కిలర్ గా పరమేశ్వరుని పూజిస్తూ,దూషిస్తూ,తమకు నచ్చిన నియమమును పాటిస్తూ,అనన్యసాధ్యమైన భక్తిదూతలను భాగ్యవంతులను చేస్తూ,భక్తి మార్గ గమనమునకు కావలిసినది, సంకుచిత కులవ్యవస్థ కాదని,సంస్కార సంస్కార గుణ ప్రస్థానమని ,దానిని ఏ దురధికారము ఎదురొడ్డి నిలువలేదని సోదాహరణమైన నయన్మర్లు భగవంతుని అన్వేషకులు-దాసులు రూపముగా 64 మంది తెరపైన ఇంకా ఎందరినో తెరలోపల నిక్షిప్తము చేస్తూ.ద్రవిడ పంచమవేదముగా "పెరియ పురాణమను " పేరుతో మనలను దీవిస్తున్నది. చంద్రునికో నూలుపోగులా కొన్ని పెరియ కథలను స్మరించుకునే శివపరికరమైన నా ఉపాధి, తన అజ్ఞానముతో అహంకారముతో వారికి సమర్పించే పుష్పహారములో ముళ్లను చేర్చే పనిచేస్తుంటుంది.కనుక పెద్ద మనసుతో దానిని క్షమించి,సవరించి ,సంస్కరిస్తారని,వినతి చేస్తూ,మీ సోదరి. సెక్కిలర్ తిరువడిగళే శరణం. ఆ మహనీయుని ఆశీస్సులతో రేపటినుండి "అకాయో భక్త కాయశ్చ" అయిన నయనార్లలో కొందరిని స్మరించుకుని తరించే ప్రయత్నము చేద్దాము. అంబే శివే తిరువడిగళే శరణం.

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...