తిరువెంబావాయ్-26
*****************
పప్పర విట్టిరుం దుణరుం నిన్ అడియార్
పందనై వందరు
దా అవరుం పలరుం
మైపురు కణ్ణియ మానుడత్తి ఇయల్బి
వణంగు కిరార్ అనంగిన్ మణవాళా
శెప్పొరు కమలంగళ్ మలరుందన్ వయల్శూల్
తిరుపెరుం తురైయురై శివపెరుమానే
ఇప్పిరప్ప అరుందెమ్మై ఆండరుపురియుం
ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందళురాయ్.
గిరిజాసమేత మహాదేవాయపోట్రి
*******************************
గౌరి కళ్యాణ వైభోగమే-మహదేవ కళ్యాణ సౌభాగ్యమే,
తిరు మాణిక్యవాచగరు మనకు ఈ పాశురములోశివ-శక్తుల పరిణయము-శుభకరపరిణామములను నర్మగర్భముగా తెలియచేస్తూ,అర్థనారీశ్వర తత్త్వ పరమార్థమును ప్రస్తుతిస్తున్నారు.
నమః పార్వతీ పతియే హరహర మహాదేవ శంభో.
స్వామి మీరు మా మైపురు కణ్ణియ-లేడికన్నుల వంటి కన్నులు కలిగిన పార్వతీదేవికి,
మానుదత్తి ఇయల్బి-తగిన వరుడు.
ఇది నిస్సందేహము.
ఈ సందర్భములో మనకు పోతన మహాకవిదర్శించిన,
"తగునీచక్రి విదర్భరాజ సుతకున్
తథ్యంబు వైదర్భియున్ తగు నీ చక్రికి"
మన మాణిక్యవాచగరు గిరిజ-గిరీశుల దాంపత్యమును దర్శించి,ధన్యులైనారు.
వారు మన కోసము,అమ్మ-అయ్య,
శెప్పొరు కమలంగళ్-ఆహ్లాదకరమగు పద్మములు విరబూసిన,పచ్చని పొలములతో నిండిన మన
తిరు పెరుంతురైలోకొలువైనారు.
అదిగో అటుచూడు ఆ కోలాహలము.
ఎందరో దేవతలు భక్తులు ,మహాదేవా!
నిన్ అడియార్-నీ దాసులము/సేవకులము అంటు,నిన్ను సేవించుటకు,
పందనై వందరు దా.-గుంపులు గుంపులుగా వస్తున్నారు నిన్ను ప్రస్తుతిస్తు,
వారు సంతోషముతో సన్నుతిస్తున్నారు ఏమనంటే,
పప్పర విట్టిరందు-బంధములు విడివడినవి/తొలగించబడినవి.
నీఅనుగ్రముతోమేము భవబంధ విముక్తులమైనాము.మా భవతారకుడవునీవే అని ,
స్వామి నీఅనుగ్రహము మమ్ములను రక్షిస్తూనే ఉన్నది.
కరుణాంతరంగ మాదొకచిన్న విన్నపము.ఇంత అని కొలువలేనిది నీ కరుణ.
కనికరముతో మమ్ములను నీ సేవకులుగా/బానిసలుగా/దాసులుగా స్వీకరించి,
మాకు జన్మరాహిత్యమును ప్రసాదించు
.
పాత్రత లెక్కించని నీ అవ్యాజ అనుగ్రహ విశేషమును మాపై ఆశీర్వదించుటకు మేల్కాంచు.అనుగ్రహించు.
తిరు పెరుంతురై అరుళ ఇది
ఆవుడయార్ తిరువడిగళే పోట్రి.
నండ్రి.వణక్కం.