మీడుష్టమ శివతమ-07
************************
న రుద్రోరుద్రమర్చయేత్-
రుద్రుడు కాని వాడు రుద్రుని అర్చించలేడు.అర్థము చేసుకొనలేడు.
కృత్స్న వీతాయ ధావతే సత్వానాం పతయే-అలవాటుమార్చుకోవటము అసాధ్యమేనంటూ ఇక్కడ సాధకుని వెనుక పరుగిడుతున్నాడు రుద్రుడు.పాపం వాడికి నా అవసరము వస్తుందేమో.అడుగుతాదేమో! అనుగ్రహిద్దాము అనుకుంటూ.
ఊరుకుంటాడా వానిని వెనుదిరిగి వరమును అడగనీయకుండా ఆ భద్రనిచ్చేవాడు.
ఇక్కడ మనమొక విషయమును గుర్తుచేసుకుందాము.అదియే లోహ ప్రాశస్త్యము.హితము రమణీయత ను కలిగించే బంగారము తన సింగారమును పొందే విధానము.అదేనండి అపరంజి ఆభరనముగా రూపుదిద్దుకొను విధానము.
ఈ మేలిమి బంగారమును కాసేపు మనము ఆత్మ తత్త్వముగా భావిద్దాము.అది కాసేపు తన సస్వరూపమునకు నామరూపములను ప్రకటించాలనుకుంది.అప్పుడు ఏమి చేస్తుంది? అగ్నికీలలు అనే చైతన్యము ద్వారా తన విస్తరనను ప్రారంభించి,తనతో పాటు రాగి అను మరొక లోహమును తనలో కలిపేసుకొని,తాను మరొక ఆకారమును సంతరించుకుంటుంది.ఆ రూపమునకొక మరొక అందమైన పేరుపెట్టుకుంటుంది.గాజులని-గొలుసులని.కొత్త రూపమును పొందిన వెంటనే తన విస్తరణను ఆపువేసి,అగ్నిజ్వాల చైతన్యమును ఆపివేసి ఆభరణములో ఇమిడి పోతుంది.
అదే విధముగా ఆత్మ అనే అపరంజి చైతన్యముతో విస్తరిస్తూ,తనతో పాటుగా పంచభూతములను కలుపుకొని జగతి అనేకొత్తరూపును సంతరించుకొని అందులోతన ఆత్మతత్త్వమును నిక్షిప్తము చేసేస్తుంది.తాను నిశ్చలముగా నుండి జగమును కదిలిస్తుంటుంది.
అదిగో అడిగేస్తున్నాడు సాధకుడు అమితానందముతో,
"హిరణ్యంచమే-అయశ్చమే-సీసంచమే-త్రపుశ్చమే
శ్యామంచమే-లోహంచమే" అంటూ.అనుగ్రహించానంటూ.అంతర్ధానమయ్యాడు రుద్రుడు.ఆయనకు కావలిసినది కూడా అదేగా.
పట్టుకుంటున్నాడు వాటిని సాధకుడు గట్టిగా .బెట్టుచేస్తున్నాయవి వానికి పట్టుచిక్కకుండా.పైగా అవి వాడితో చెబుతున్నాయి.ఓ సాధకా! ఇంతకాలము మేముభూరేణువుల సాంద్రతతో చిక్కబడి-చిక్కబడి లోహరూపమును దాల్చాము.ఘనీభవించిన మేము నీకు ఏ విధముగా ఉపయోగపడతామనుకుని మమ్ములను కోరుకున్నావు?అంటూ కదలేని లోహములు సాధకుని ఆలోచనలను కదిలించాయి.
అసలు ఈ రుద్రుడు ఎంతటి మోసగాడు? అడుగు అంటాడు-అనుగ్రహించానంటాడు.తీరా చూస్తే-ఆరా తీస్తే అంతా మోసమే!
ఇవిగో నీ సాధనములు.ఇవియే నీ ధనములు అంటూ ఆశీర్వదిస్తున్నట్లుగా నిలబడతాడు.
కనిపించనీ మళ్ళీ.నిలదీయక వదలను నిశ్చయంగా.
కదిలేవనీ కథలే-కదిలించేది కరుణే.
అణువణువు శివమే-అడుగడుగు శివమే.
సర్వం శివమయం జగం.