Sunday, October 10, 2021

ammakamakshi taayi-06

శ్రీ మాత్రే నమః ****** . మాయవన్ తంగైనీ మరకతవల్లినీ మణిమంత్ర కారిణీయె మాయా స్వరూపిణీ మహేశ్వరియునీ మలై అరసన్ మగళాననీ తాయి మీనాక్షిని సద్గుణవల్లినీ దయానిధి విశాలాక్షిణీ దారణిల్ పెయ్పెట్ర పెరియనాయగియు నీ సరవణనయీండ్ర వళుమీ పేయ్గలుడ నాదినీ అత్తనిద బాగమది పెరుపేర వళందువళనీ ప్రణవస్వరూపిణీ ప్రసన్న వల్లినీ పిరియ ఉన్నామలయునీ ఆయి మగమాయినీ ఆనందవర్షిణీ అఖిలాండవల్లి నీయే అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే. **************** మాధవుని సోదరివి మరకత వల్లివి మంత్రస్వరూపిణివి నీవే మాయా మహాశక్తి మాహేశి మానిని మలయాచలేశు పుత్రీ మాత మీనాక్షివి సద్గుణవర్షిణివి దయానిధి విశాలాక్షివి జగములను పాలించు జగన్నాయకి నీవు శరణాగత రక్షకి శివ వామభాగిని భువనైక మోహిని చిత్స్వరూపిణివి నీవే ప్రణవ స్వరూపిణి అరుణాచలేశ్వరి అఖిలాండమంత నీవే ఆర్త జన పోషిణీ ఆనందవల్లినీ అఖిలాండ సంధాయినీ అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే అంబ కామాక్షి ఉమయే. ************** హిమగిరి తనయే హేమలతే అంబ ఈశ్వరి శ్రీ లలితే అని , అని తల్లిని ప్రస్తుతించారు శ్రీ ముత్తయ్య భాగవతారు.మన సాధకుడు, అమ్మా నీవు హైమవతివి మాత్రమే కాదు,అరుణాచలేశ్వరివి (అగ్నితత్త్వము) నీవే అంటు ,అమ్మను ప్రస్తుతిస్తూ, శ్రీ లలితా రహస్య సహస్ర నామములో కీర్తించినట్లు, "వ్యాపిని వివిధాకార విద్యావిద్యా స్వరూపిణి" అన్న అమ్మ సర్వ వ్యాపకత్వమును వివరించాదు. తల్లి సర్వాంతర్యామి-సర్వరూపి-సర్వ పోషిణి-సర్వ రక్షిణి. ఇందులో ప్రహ్లాదుడు అన్నట్లు సందేహము లేదు.హరి పుం రూపములో కనుక భావిస్తే-అమ్మ స్త్రీ రూపములో కనుక ఆరాధిస్తే. అయితే విరుత్తములోని ఈ భాగము అమ్మను కామాక్షిగా-మీనాక్షిగా-విశాలాక్షిగా మరొక్కసారి , కంచి కామాక్షి-మధుర మీనాక్షి-కాశి విశాలాక్షి అంటు రాజరాజేశ్వరి విరాజమానత్వమును విశద పరుస్తున్నది.వీరు ముగ్గురు తమ వీక్షణమాత్రముననే క్షిప్రప్రసాదత్వమును ప్రసాదిస్తున్నారు. నటరజ పత్తు లో సాధకుడు ఇదేవిషయమును మణ్ణాది బూతములు-విణ్ణాది అంటు, భూమ్యాకాశములు (పంచభూతములు)పరమమేశునుగా అభివర్ణించాడు. వానిని నడిపిస్తు జగములలో నడయాడు, ఇరుళన్ని-ఒళియున్ని-చీకటి-వెలుగులు, పొణ్ణున్ని-పొరుళున్ని-అనేక జీవరాశులను, మదియున్ని-రవియున్ని-చంద్రుని-సూర్యుని, వేదాది వేదుడిని-వేదాదివేద్యుడు, పాదాది-కేశముని-ఆపాద మస్తకముని, అంతే కాదు, అజ్ఞానమును తొలగించే వెలుగైన గురువుగా, బోధక్క వందు గురుని , నిన్నేమని నేను చెప్పగలను, అసలు ఇది-అది అని కాదు ఎన్ నరియ జీవకోటింగళిండ్రు అప్పనే- సకల చరాచర జీవరాశులనిటి సమ్రక్షకుడైన తండ్రివి , భువనంగళ్ పెట్ర వరునీ-నీవే పెద్దమహాదేవుడవని ప్రస్తుతిస్తూ, ఎన్ కురగళాల్ కురైప్పేన్- నా దోషములను కనుమరుగు చేసి కనికరించు అని వేడుకుంటున్నాడు. స్వామిని పెట్రవాన్ అన్నట్లుగానే,మన అమ్మను పెరియ నాయగి /జగన్మాత అని ,నాద బిందు స్వరూపిణి నన్ను కనికరించమని వేడుకుంటున్న తాయి కామాక్షి దివ్య తిరువడిగలే శరణం. నరియ నరియ వణక్కంగళ్. అమ్మ చేయి పట్టుకుని నడుస్తూ,రేపు విరుత్తము లోని ఏడవ భాగమును గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.

kamakshi taayi umaye-05

శ్రీ మాత్రే నమః *********** 5.పెట్రితాయెండ్రునై మెత్తవుం నంబినాన్ పిరియమై ఇరుందేనమ్మా పిత్తలాయ్ తక్కారి ఎండ్రునాన్ అరియాదు ఉన్ పురుషనై మరందునమ్మా భక్తనాన్ ఇరుండ ఉన్ చిత్తముం ఇరుంగామల్ పారాముగం మిదుదుదాన్ బాలన్ నానెప్పడి విసనవిల్లామలె పాంగుడన్ ఇరుప్పదమ్మా ఇత్తనై మోసంగళ్ ఆకాదు ఆకాదు ఇదు ధర్మమల్లలమ్మా ఎందనై రక్షిక్క చింతైన గిల్లయో ఇదినీది అల్లవమ్మా అత్తిమగన్ ఆశయళి పుత్తరన్ మరందాదో అది ఎన్న కరుప్పరమ్మా అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అంబ కామాక్షి ఉమయే, ************ పాహియని రక్షింప పాదములు పట్టితిని జాగుచేయుట తగనిదమ్మా ఇంత కాఠిన్యము ఎందును కనరాదు నీ పతిని మరచితినమ్మా భక్తులను బ్రోవ నీ చిత్తమే కాకున్న పెడముఖము పాడికాదు జాలియన్నది మరచి శిక్షింపగ నన్ను పక్షపాతము చూపకమ్మా ఇంతటి మోసము సరికాదు సరికాదు ఇది ధర్మమనరే ఓ అమ్మా సుంతైన రక్షించ చింతించకున్నావు ఇది నీతికాదె ఓ యమ్మా కరిముఖునిపై ప్రేమ కనికరము మరచినది "కుమాతవు" నీవు కావమ్మా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే. **** భక్తుడు తాను బాలకుడనని కనుక ఏ దోషములు చేయకుండా ఉండలేనివాడినని,తల్లీ నీవు పెట్ర తాయివి అని సంబోధిస్తున్నాడు.పెద్దమనసుకల తల్లివి. బమ్మెర పోతన అన్నట్లు, అమ్మలగన్న యమ్మ-ముగురమ్మల మూలపుటమ్మ-చాల పెద్దమ్మ- చాల పెద్దమ్మ అయినప్పటికిని భక్తుని కరుణించుటకు మనసొప్పక పెడముఖము పెట్టినదట.అది తల్లి స్వభావము కానప్పటికిని, పిత్తలాయ్-టక్కారి, కావాలనే తన టక్కరితనముతో, ఆ టక్కరితనము పిత్తలాయ్-పరాకాష్టలో చూపుతు కనీసము ముఖమైన భక్తునివైపుకు తిప్పటములేదుట . తల్లీ నీ పెడముగము,నన్ను రక్షించుటకు తలచకుండుట వలన నీ భక్త రక్షణివి అన్న బిరుదుకు అపవాదు వచ్చును కనుక ఇంతటి మోసమును చేయుట నన్ను కనికరించకుండ ఇంతటి మోసము చేయుట, నీయొక్క వైభవమునకు తగినది కాదు. నీవింత కఠినాత్మురాలివని తెలిసి యుంటె నీ పతినే ప్రార్థించెడి వాడిని.ఆ విషయమునే మరచితిని అంటు , నటరాజ పత్తు లోని భక్తుడు చెప్పినట్లు, " వందు వందు ఎన్రు ఆయిరం చొల్లియుం చెవియెన్న మందముందో" నిన్ను రమ్ము రమ్ము అంటు లెక్కలేనన్ని సార్లు పిలిచినప్పటికిని నీ చెవులకు వినిపించలేదా, లేక నీవు నాట్యమాడువేళ, మానాడ-మళువాడ-మదియాడ-మంగై శివగామి యాడ-ఉలగు కూటమెల్లా యాడ-కుంజరముఖత్త నాద, అంటూ నీ వారితో సంతోషముగా తాండవమాడుటేనా లేక దీనులను రక్షించుటను కూడ ఆలోచిస్తున్నావా/లేదా అని ఉపేక్షను ఆరోపిస్తున్నారు. దంతి ముఖుడు-ఆరుముఖముల వాడు ఇద్దరే నీ పిల్లలనుకుని,మమ్ములను నీ పిల్లలుగా భావించుట లేదేమో అని నిష్ఠూరములాడుతున్నారు. బాలకులు దోషరహితులుగా ఉండరన్న విషయమును గమనించక ఉన్నప్పటిని, ఇందుల నీరేడు మేనలత్తిల్ తాయి సొల్లు ఇనియం విడువదిల్లై. నీ పాదములను విడువను అంటు మాతృకా వర్ణస్వరూపిణి-ఆ బ్రహ్మ కీటక జననిని పశ్చాతాపముతో తల్లీ నీవు అవ్యాజకరుణామూర్తివి అయినప్పటికిని గజముఖునిపై ప్రేమ నిన్ను జగదోధ్ధరణకు సుముఖము చేయకున్నది.మేమందరము మీ పిల్లలమే తల్లీ సరగున వచ్చి నన్ను రక్షించి, "కుపుత్రా సంజాతే-కుమాతా న భవతి" అను ఆర్యోక్తిని రూఢిచేయితల్లి అని కరుణావీక్షణ కామాక్షితాయి దివ్య తిరువడిగళే శరణం అంటున్నాడు. నరియ నరియ వణక్కంగళ్ అమ్మ చేయి పట్తుకుని వెళుతు రేపు విరుత్తము లోని ఆరవ భాగమును తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...