తనోతు నః శివః శివం-10
********************
" వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తియే
జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ".
పరమేశ్వరుడు తన తాండవములో విస్తరిస్తున్న జటలను పిల్లనాగులతో బంధించుకుంటు మనందరికి సంపదలను వర్షిస్తూఅడట.మొదటి చరణ్
అములో శుభములను వర్షిస్తున్న స్వామి శుభములతో పాటుగా సంపదలను వర్షిస్తున్నాడట ప్రస్తుత తాండవములో.సిరి-సంపదలను అనుగ్రహిస్తాడన్న మాట.ధన-ధాన్యాలు అంటుంటాము అదేకదా.మనపైననే మాత్రమే కాదు మన తదుపరి తరములవారిపై కూడ అనవతర అనుగ్రహవర్షము.
ధన్యోస్మి మహాదేవా.
"సహస్రలోచన ప్రభ్యుత్యశేష లేఖ శేఖర
ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠభూః
భుజంగరాజ మాలయ నిబద్ధ జాటజూటక
శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః."
"శుభమంగళం-నిత్య జయమంగళం"
అజాయమాన-బహుధా విజాయతే'
పుట్టుక లేని పరమాత్మ ఎన్నో అద్భుతములను సృష్టిస్తున్నాడు.
స్వామి సంపదలతో కూడిన మంగళములను జాయతే సృష్టించుచున్నాడు (తన తాండవముతో) అదే సమయములో ప్రపంచ విస్తరణముగా వ్యాపిస్తున్న తన జటాజూటమునకు పాపపాము పేరులతో హద్దులను నిర్ణయిస్తున్నాడు వాటిని తన జటలలో హారములుగా చుట్టుకుంటూ/అలంకరించుకుంటున్నట్లుగా అనిపించే అవధి నిర్ణయముతో. ఇన్నిపర్వతములు-ఇన్ని సముద్రములు-ఇన్ని అరణ్యములు-ఇన్నిజలపాతములు-ఇన్ని క్షేత్రములు-అంటూ,తన అపరిమితమైన కరుణను అనంతకాలము విస్తరించుటకు (కాళము-కాలము) ప్రపంచ పరిమితిని పొందుపరుస్తున్నాడు.
1. " సహస్రలోచన ప్రభ్య్త్యశేష లేఖ శేవ్ఖర"
స్వామి అనంతలోచనుడైనాడు.సహస్రాక్ష-సహస్రపాత్.సర్వమును దర్శించగల శక్తిని ప్రకటనము చేస్తున్నాడు.మనకు సైతము తన సంపూర్ణ సాకార సాక్షాత్కారమును అనుగ్రహించబోతున్నాడు.
సనాతనములో అమ్మ సాకారదర్శనము మస్తకము నుండి పాదము వరకు-(చండీసప్తశతి-చిదగ్నికుండ సంభూట శిరో ప్రకటనము)
అయ్యవారిది పాదము నుండి మస్తకము వరకు అను సంప్రదాయమును అనుసరించి,స్వామి తన పాదపీఠభూమిని మనందరికి దర్శింపచేస్తున్నాడు.
ఆ పవిత్ర పీఠస్థలి సహస్రలోచనుడు/మహేంద్రుడు మొదలగు వారి ప్రభృత్-ముఖ్యశేవకులతో కూడి,అశేష లేఖ సంపూర్నమైన దేవతా సమూహములతో/పరిపూర్ణమైన ప్రకాసముతో నున్నదట.
ప్రకాసము మాత్రమే కాదు ఆ పీఠము
2." ప్రసూన ధూళి ధోరణీ విధూసరాంఘ్రి పీఠభూః"
ధోరణితో నున్న నున్న వారు ఎవరు? దేవతలందరు అలంకరించుకొనిన పుష్పమాలలో నున్న ప్రసూనములు.
వాటి ధోరణి /ఆలోచన ఏమిటి?
స్వామి భస్మాలంకార ప్రియుడు కదా కనుక మన పంచలక్షణములను మరింత ఏకీకృతమైన పుప్పొడి గా మలచి స్వామి పాదములకు అలంకరిద్దామన్న ఆలోచన.
అనన్య సాధ్యము ఆ ఆరాధనము.వెంటనే అవి వానిలోని సారమైన ఆత్మసౌందర్యమును(పునరుత్పత్తికై)పుప్పొడిగా మలచి(విజ్ఞానము) పునర్జన్మ లేకుండటకై (ఆధ్యాత్మికము) స్వామి పాదపీఠభూమిని అర్చిస్తున్నాయట.
వాటి జన్మము చరితార్థము.
3." భుజంగ రాజ మాలయా నిబద్ధ జాటజూటకః"
పాదముల నుండి దర్శిస్తూ మనము శివానుగ్రహముతో మస్తకమును చేరుకున్నాము.మధ్యలో ఇది అని చెప్పలేని నిరంతర నర్తనముకదా స్వామిది.
నిబద్ధ-ఒక నియమముతో /ఒక పొందికతో/ఒక అవధిగా/ఒక అలంకారముగా స్వామి తన జటాజూటమును భుజంగరాజ/శ్రేష్టమైన/శోభాయమానమైన పాములతో చుట్టుకొన్నాదట.
ఏమిటి ఆ నిబద్ధత?
ఓ కిశోర చంద్రా!
నీవు నాకు అలంకారము మాత్రమే కాదు సుమా!
నేను నీకు ఒక బాధ్యతను నేటి నుండి అప్పగిస్తున్నాను.
ప్రకటనమైన ప్రపంచములో పశుపక్ష్యాదులు కూడా ఉన్నవి కదా.అందులోని చకోర పక్షులను చూశావు కదా.వాటికి వెన్నెలమాత్రమే ఆహారముగా నిర్ణయించబడినది.ఆ వెన్నెలలను స్వీకరించుటకు వాటి మెడ కింద ఒక రంధ్రము అమర్చబడియున్నది.అవి స్వీకరించిన నీ కౌముది కిరణములు తిరిగి వాటికి నీవు అనుగ్రహించువరకు జీవింపచేస్తాయి అని కిశోరచంద్ర శేఖరుని-చకోర బంధుశేఖరునిగా మార్చి
చకోరములకు/మన్మదరికి (చకోరములు -సామూహిక సంకేతము)
( వెన్నెలలు-స్వామి అనుగ్రహము-) కంఠము ద్వారా నామసంకీర్తనము ద్వారా -ప్రతిపాదికము.
4." శ్రియై చిరాయ జాయతాం" చకోర బంధుశేఖరః
శాశ్వత సంపదలను అనుగ్రహించును గాక స్వామి తాండవము.
విశేషములు
********
1.దశమహా తత్త్వముగా కనుక పరమాత్మ తత్త్వమును గా అన్వయించుకుంటే కాళి-తార (చీకటి-వెలుగుల )తరువాత వచ్చే ముగ్ధమనోహర త్రిపురసుందరి తత్తవముగా ప్రసూనమాలలు ప్రస్తావింపబడినవి.
2.పశుపక్ష్యాదులు ప్రకటింపబడి పశుపతి అనుగ్రహమును పొందుతున్నవి.
కదిలేది ప్రపంచం-కదలనిది పరమాత్మ.
శివ భజేవ మనసా నిరంతరం.
ఏక బిల్వం శివార్పణం.