Tuesday, December 27, 2022

AALO REMBAAVAAY-13


 


 పాశురం-13

 *********

 నన్నాళాల్-పుళ్ళుం శిలబినకాణ్ అను పదములు మనకు ప్రథమపాశురములో నన్నానాళ్-పుళ్ళుం శిలంబినకాణ్ పుళ్లరయన్ అంటు మరల ప్రస్తావించుట లోని అంతరార్థమును అనుగ్రహించనున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,పాశురమును అనుసంధానమును చేసుకుందాము.

పదమూడవ పాశురం

****************

పుళ్ళిన్వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై

క్కిళ్ళి క్కళైందానై క్కీర్తిమై పాడిప్పోయ్

పిళ్ళైగళ్ ఎల్లారుం పావై క్కళం పుక్కార్

వెళ్ళి ఎళుందు వ్యాళంఉరంగిట్రు

పుళ్ళుం శిలంబినకాణ్! పోదరికణ్ణినాయ్!

కుళ్లక్కుళిర క్కుడైందే నీరాడాదే

పళ్ళికిడత్తియో? పావాయ్! నీ నన్నాళాల్

కళ్ళం తవిరందు కలందేలో రెంబావాయ్

.

 ఓం నమో భగవయే వాసుదేవాయ నమః.

 ************************

 పొల్లా అరక్కన్-నల్లా అరక్కన్ అని జన్మను బట్టి రక్షసులే అయినప్పటికి,కర్మను బట్టి ఒకరు (విభీషణుడు) స్వామిచే రక్షింపబడినాడు.మరియొకరు (రావణుడు) అదే శ్రీరామునిచే శిక్షింపబడినాడు.దానికి కారణము రావణుని ఇంద్రియలోలత్వము.

 అదేవిధముగా పొల్లా అరక్కన్ -

1. పొల్లా-మాయావి యైన,

 భావ మాలిన్యముతో నిండిన బాహ్య సౌందర్యముతో అసురుడు అక్కడికి ప్రవేశించినాడు.గోపబాలురు ఆ అందమైన కొంగను చూచుటకు వచ్చి,దానిని చూస్తూ ఆనందిస్తున్నారు.

   కాని ఆ కొంగ తనకు ఎరగా బాలకృష్ణుని నిర్ణయించుకొని,వానికై ఎదురుచూస్తున్నది.ఇది దాని జిహ్వ చాపల్యమునకు-ఇంద్రియ దుర్వినియోగమునకు సంకేతము.

  స్వామి దాని జిహ్వేంద్రియమును సంస్కరించాలనుకొన్నాడు.దాని కోరికను తీరుస్తూ ఎరగా దాని నోటిలోనికి ప్రవేశించాడు.దానిని పవిత్రము చేశాడు.సమీపించాడు.సంహరించాడు.ధర్మ సంరక్షకునిగా సంకీర్తింపబడుతున్నాడు.

 

 అరక్కన్-అసురుని,అందున పక్షిరూపముగా తన కామరూప శక్తితో వచ్చిన వానిని,

 పుళ్ళన్-కొంగరూపముతో,అదియును అందమైన తెల్లని కొంగరూపముతో ఖదిరి వనమున ప్రవేశించిన వానిని,

కీండానై-వాడి నోటిని/ముక్కును విభజించి/చీల్చి,

 కళందునె-సంహరించిన వానిని,మన గోవిందుని కీర్తిస్తున్నారు.


2.  ప్రథమ పాశురములోని నన్నానాళ్-సంకల్పమునకు ఊతయై వ్రతమును చేయుటకు సహకరించినది.

 ప్రస్తుత పాశురములోని నన్నానాళ్-వారి దీక్షకు ఎటువంటి ఆటంకమును కలుగనీయకుండా వారినందరిని

 నోముస్థలికి చర్చినది.అదే విషయమును గోదమ్మ,

 పిళ్ళైగళ్ ఎల్లారుం పావై క్కళం పుక్కార్ 

 గోపికలందరును నోముచేయుస్థలములోనికి ప్రవేశించినారు అని చెబుతున్నది.

3. పుళ్ళుం శిలబినకాణ్ అని ఆరవపాశురములో గోపికను మేల్కొలిపినప్పుడు పక్షులు కూస్తున్నాయి అని తెలవారితోందనుటకు సంకేతముగా చెప్పినది.

 అదే పక్షికూతలను తెలవారుతుందనుటకు సంకేతముగా చెప్పుచున్నప్పటికిని ప్రస్తుత పాశురములోని పక్షులు స్వామి అర్చిస్తూ,ఒక విధముగా కాయకముగా,వాచకముగా,మానసికముగా ఆచరిస్తున్నాయి.ఆరవ పాశురములో అవి స్వామిని సేవించాలనే సంకల్పముతో తక్కిన పక్షులను కలుపుకొని,సంసారబంధములను విడిచి,రెక్కలను విప్పుకొనుచు ఇంద్రియములను సరిచేసుకొనుచు వ్రతమును చేయు పేతినగా కూసినాయి.ఇప్పుడు వ్రతభాగముగా స్వామిని సంకీర్తిస్తున్నాయి.దానికి కారణము అందరి మనసులలోని అజ్ఞానము అస్తమించినది.జ్ఞానము ప్రవేశించి స్థిరపడినది.దాని మనకు అనుగ్రహించుటయే

4.వ్యాళం ఉరంగిట్రు-రేచుక్క అస్తమించినది.చీకటి అనే అజ్ఞానము తొలగి పోయినది.

  దానికి కారణము,

  వెళ్ళం ఎళుంది-పగటి చుక్క ఉదయించిగానేఉషోదయము కాగానే దాని ధాటికి తట్టుకొనలేక చీకటి/అజ్ఞానము కనుమరుగైనది.

 నాస్తికత్వమును తొలగించి పరమాత్మ తత్త్వమును ప్రజ్వలింపచేసినది.

 మరొక కోణముగా శుక్రాచార్యుడు కచునీ మృఏతసంజీవని విద్య ప్రదానముగా కూడా సంకేతిస్తారు విజ్ఞులు.

 5.మేల్కొలుపబడుచున్న గోపిక నేత్ర సౌందర్యము బహుముఖములుగా కీర్తించుచున్నది గోదమ్మ.

 " పోదరిక్ కణ్ణినాయ్"

-అని సంబోధించినది.

 1. ఈమె కన్నులు పద్మములవలె జ్ఞానసంకేతములై వానిలో పూర్తిగా పరమాత్మను నింపుకున్నవి.స్వామి రూపమును అనుభవించుచున్నవి.నామమును కీర్తించుచున్నవి.గుణ వైభవమును అర్థము చేసుకొనుచున్నవి.పూర్తిగా తమకే సొంతము చేసుకొనుచున్నవి.

   ఏవిధముగా అంటే,

 2. ఈమె కన్నులు లేడి కన్నుల వంటివి.అతి శీఘ్రముగా చలించకలిగినవి.ఒకవేళ స్వామి తనను వీడి అటు-ఇటు కదలచూసినను నేత్రములు వేగముగా కదులుతూ సాగిపోనీయుట లేదు.

 ఆ హరిణేక్షణ హరిని తన కన్నులలో బంధించి ఏమిచేయుచున్నదంటే,

 3. ఆ గోపిక కన్నులు తుమ్మెదల వంటివి కనుక ఆమె తన నేత్రములతో శ్రీకృష్ణుని మధురామృతమును తనివి తీరా గ్రోలుతూ ( తానొక్కతియె గ్రోలుతూ) తమకమును వీడక తన్మయ స్థితులో నుండి,కన్నులను తెరువకున్నది.విరహమును కనీసము ఊహించలేని స్థితిలో నున్నది.

 కనుకనే తోటి చెలులు/గోపికలు 

" పోదరిక్ కణ్ణినాయ్"

-అని సంబోధించినది.

 1. ఈమె కన్నులు పద్మములవలె జ్ఞానసంకేతములై వానిలో పూర్తిగా పరమాత్మను నింపుకున్నవి.స్వామి రూపమును అనుభవించుచున్నవి.నామమును కీర్తించుచున్నవి.గుణ వైభవమును అర్థము చేసుకొనుచున్నవి.పూర్తిగా తమకే సొంతము చేసుకొనుచున్నవి.

   ఏవిధముగా అంటే,

 2. ఈమె కన్నులు లేడి కన్నుల వంటివి.అతి శీఘ్రముగా చలించకలిగినవి.ఒకవేళ స్వామి తనను వీడి అటు-ఇటు కదలచూసినను నేత్రములు వేగముగా కదులుతూ సాగిపోనీయుట లేదు.

 ఆ హరిణేక్షణ హరిని తన కన్నులలో బంధించి ఏమిచేయుచున్నదంటే,

 3. ఆ గోపిక కన్నులు తుమ్మెదల వంటివి కనుక ఆమె తన నేత్రములతో శ్రీకృష్ణుని మధురామృతమును తనివి తీరా గ్రోలుతూ ( తానొక్కతియె గ్రోలుతూ) తమకమును వీడక తన్మయ స్థితులో నుండి,కన్నులను తెరువకున్నది.

 కనుకనే తోటి చెలులు/గోపికలు ఇవి,

కుళ్లక్కుళిర క్కుడైందే నీరాడాదే-

చల్లని యమునా జలములలో మునిగి,స్నానమాచరించి,స్వామి అనుభవముతో మూకలు వేయుటకు మాతో రమ్మని పిలుచుచున్నను,

పళ్ళిక్ కిడత్తియో-పానుపును వీడలేకయున్నావు.నీవు నిజముగా నిద్రించుట లేదని మాకు తెలుసు.

కళ్ళం తవిరిందు-కావాలని నిద్రను నటిస్తున్నావు,

 గోఇకలను వారించి,లోపలిగోపికను           బహిర్ముఖముచేయుటకై

       గోదమ్మ 

 రామాయణములోని " శబరి" ఔన్నత్యమును వివరించినదట.నిస్స్వార్థముగా ఎన్నో యుగములు శ్రీరామునికై వేచిన శబరి స్వామి తన దగ్గరకు వచ్చిన సమయమున పండ్లను ఆరగింపు చేసి తిరిగిపంపించివేసినది కాని తన దగ్గరనే ఉండిపొమ్మని కోరలేదు.జగత్కళ్యాణమూర్తిని జగములన్నీ పొందవలెను కాని మనము మాత్రమేకాదు అనిచెప్పి, మేల్కాంచిన గోపికతో పాటుగా,మన చేతిని పట్టుకుని నడిపించుచున్న

 ఆండాళ్ దివ్య తిరువడియే శరణం.


  

  



TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...