తనోతు నః శివః శివం-05
*****************
" వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"
తన తాందవముతో తత్త్వదర్శనమును అనుగ్రహిస్తున్నాడు మహాదేవుడు.
కిశోర చంద్రుడు ముసిముసిగా నవ్వుకొనుచున్నాడు తన ప్రతిరూపమునుచూస్తూ.రెండవ కిశోరచంద్రుడు తనకు అండగా వస్తున్నాడని.
ఆ ప్రదేశమంతా వేయి వెన్నెలలతో వెలిగిపోతున్నది.
ఆదిశంకరులు దర్శించి,అత్యంత మనోహరముగా కీర్తించినట్లుగా,
" శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం" గా ప్రవేశించిది నాట్యవేదికకు ఆ ఆనందదాయిని నందిని అద్భుత సహచరియై ఆనందతాందవమునకై.
ఆ అద్భుత సౌందర్యరాశీని వీక్షించగలగటం స్తుతించగలగటము సామాన్యురాలినైనా నా తరమా?
అమ్మ అనుగ్రహము దానికి మార్గమును చూపించింది
త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే కథమపి తులయితు.
తల్లీ నీ సౌందర్యమును వర్ణించుటకు బ్రహ్మాదులే సమర్థులు కామంటున్నప్పుడు నేనేంత? కాని నిన్ను దర్శించగల శక్తిగల నేత్రము కేవలము సదాశివునిది మాత్రమే.కనుకనే ,ఏవిధముగా అమరలలనలు ,
యత్-ఆలోక-ఉత్సుకతతో,
ఆ జగజ్జనని దివ్యసౌందర్య దర్శన ఉత్సుకతతో మనసారా మహాదేవుని తపమాచరించి మనోభీష్టమును పొందినారో,అదే కరుణ మనందరికి సైతము అమ్మదివసౌందర్య దర్శనాశక్తిని అనుగ్రహించును గాక.
అమ్మ నాట్యస్థలికి మామూలుగా రాలేదు.విలాసబంధు బంధురముగా వచ్చినదట.
బంధు-అలంకారములతో-,బంధుర-నిండినదై వచ్చినదట.
అవి మనము చేసుకునే మానవ అలంకారములు కాదు.అమ్మ ధరాధరేంద్ర నందిని.లీలగా/విలాసముగా
పంచభూతములను,పంచ తన్మాత్రలను,నదీజలములను,కొండలను-గుట్టలను,చెట్లను,పశుపక్ష్యాదులను,సూర్యచంద్రులను,నక్షత్రములను సకల చరాచర జగత్తులో చైతన్యముగా ప్రకాశిస్తూ,స్వామి తాండవము చేయు స్థలికి వచ్చినదట.
అంటే శివ సృష్టిని శక్తివంతము చేస్తున్నది తల్లి.ఆ తల్లిని చూస్తూ మహాదేవుడు మరింత మురిపెముగా నర్తిస్తూ దిక్కులను తన తాండవముతో తన్మయత్వముతో ప్రకటించేశాడట.
స్వామి విశ్వ విస్తరణమునకు హద్దులు నిర్ణయించే సమయమాసన్నమయినట్లున్నగా అమ్మ స్వామి కృపాకటాక్షవీక్షనముతో దిగంబరుని -చిదంబరునిగా మార్చివేసినది.వారిరువురి కృపాకటాక్షవీక్షనము "క్వచిత్"అరుదైనది-అపురూపమైనదికనుక దుర్ధరాపదలను నిరుద్ధ నిర్మూలించుచున్నవై "నిత్యకళ్యాణమును "జరిపించుచున్నవి ప్రమోదముతో.
మహాద్భుతమైన తాందవము స్వామిని-అమ్మను-మన్మదరిని ప్రమోద మానసులుగా మారుస్తున్నది.
దృశ్యము-ద్రష్ట-దృష్టి అను మూడు అంసములు ఒకదానిలో మరొకటి మమేకమై మరొకటి గుర్తించలేని స్థితిలో నుంచుటయే "ప్రమోదము "కదా.
తాందవము-తాండవించువాడు-తాందవమును దర్శించువారి సర్వం ఖలువిదం బ్రహ్మముగా మార్చుటయే మహాదేవుని మంచితనము.
మరువకు శివనామం మదిలో ఓ మనసా
ఇహపర సాధనమే -సురుచిర పావనమే.