Wednesday, August 21, 2024

SREESUKTAM-01 -HIRANYAVARNAM


  శ్రీసూక్తము-01

 ************

 "ఓం హిరణ్యవర్ణాం  హరిణీం సువర్ణరజతస్రజాం

  చంద్రాం  హిరణ్మయీం లక్ష్మీం " జాతవేదో" మ ఆవహ."


  ఇది అమ్మవారి సాకార సంకీర్తనము.సహాయకుడు జాతవేదుడు.అమ్మ బంగారు మేనిఛాయతో మెరిసిపోతున్నది.మేనిఛాయకు మెరుగులు అద్దుతూ సువర్ణ వెండి ఆభరణములు కదులుతూ కాంతులను వెదజల్లుతున్నవి.తల్లి బంగారు మేనిఛాయయే బంగారుమయముగా మరింత ముచ్చట గొలుపుతున్నది.దానికి తోడుగా తల్లి ధరించిన చంద్రరేఖ ఆహ్లాదమును కలిగించుచున్నది.అట్టి పరాశక్తి కరుణతో నా చుట్టు ఉన్న మాయతెరలను తొలగించివేసి,అనుగ్రహరూపముగా నన్ను నిండియుండుటకై,చైతన్యస్వరూపమైన ఓ జ్ఞానమా నీవు నా విన్నపమును అమ్మకు హవిస్సు రూపముగా అందించి,ఆమె అనుగ్రహము నాలో సంపూర్ణముగా నిండియుండునట్లు ఆశీర్వదించుటకు సహాయపడుము.

 ఇది బాహ్యార్థము.సాకార దర్శనము.

  ఇంకొంచము నిశితముగా అర్థము చేసుకొన కలిగితే అమ్మ "ఈం "బీజ ప్రదాయిని.సర్వానుగ్రహకారిణి.ఆమె లక్ష్మీ-హరిణీం.

 హరి మనోవల్లభి కనుక హరిణి

 ప్రకృతి స్వరూప-స్వభావము కనుక హరిణి

 అశుభములను హరించివేసే తల్లి హరిణి.

  అమ్మ ధరించిన సువర్ణ-రజత స్రజములు కేవలము లోహ సరములు కానేకావు.


 హిరణ్యము సూర్యుని-రజతము చంద్రునికి వారి నిరంత కదలికలు హారములకు సంకేతములుగా చెప్పబడినవి.

  అంతేకాదు అమ్మవారి పాశాంకుశములు రక్షణ-శిక్షణ సంకేతములు

 అమ్మవారి స్వరూపము తేజోమయము.స్వభావము కరుణభరితము.

   మరికొందరు అమ్మను సువర్ణా,హిరణ్య వర్ణ అక్షరస్వరూపిణిగా ఆరాధిస్తారు.

   శ్లోకములో అమ్మ లక్ష్మీ శబ్దముతో సంబోధింపబడినది.

 "లక్ష్యతే శ్రేయతే "లక్ష్మీ,

  శ్రేయో మార్గమును లక్ష్యముగా భావింపచేయునది లక్ష్మీ

  లక్ష్యతే దృశ్యతే లక్ష్మీ-లక్ష్య మార్గమును చూపించునది లక్ష్మీ

  జాతవేదుని సహాయముతో నా ప్రార్థనలను విని లక్ష్మీదేవి మనదగ్గర ఉండునుగాక 

  "హిరణ్మయీం  లక్ష్మీ మనసా భజామి"



SREE SUKTAM-INTRODUCTION

 


  శ్రీ సూక్తము

  **********

 లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం-

     శ్రీరంగ ధామేశ్వరీం

 దాసీభూతసమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం


  శ్రీమన్మంద  కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం

 త్వాం  త్రైలోక్య కుటుంబినీం సరసిజాం 

     వందేముకుందప్రియాం.

  "శ్రీ  అను నాదము ఆరువిధములుగా అభివర్ణింపబడినది."


 1.స్రీయతే ఇతి శ్రీః-చేతనులచే ఆశ్రయింపబడు పరబ్రమము "శ్రీ."

 2,శ్రేయతి ఇతి శ్రీః-చేతనులకు శ్రేయోదాయకమైనది "శ్రీ"

 3.శ్రుణోతి ఇతి "శ్రీః".-మొరలను ఆలకించేది "శ్రీ"

 4.శ్రావయతి ఇతి శ్రీః-లక్ష్మీమాతగా చేతనుల ఆర్తిని స్వామికివిన్నవించే దయ/సహాయము "శ్రీ"

 5.శ్రుణాతి ఇతి శ్రీః-పాపములను నశింపచేసేది శ్రీ"

 6.శ్రీణాతి ఇతి శ్రీః-జగద్ధాత్రియై తనకరుణతో మాయ అను తెరను తొలగింపచేయునది.

  శ్రేయతే లక్ష్యతే శ్రీః-శ్రేయతే దృశ్యతే శ్రీః

  లక్ష్యమును మార్గమును సుగమముచేసే అవ్యాజకరుణయే "శ్రీ"


   సూక్తము అనగా శక్తివంతములైన-ఫలప్రదములైన మంత్రముల కూర్పు.సూక్తములు అపౌరుషేయములు.

 సు-శుభప్రదములైన-ఉక్తులు-పలుకులు.

   

   శ్రీసూక్తము ఋగ్వేద ఐదవ-ఆరవ మండల మధ్యభాగమున చేర్చబడిన పరిశిష్టముగా/ఖిల గా సన్నుతిస్తారు.

   అథర్వ వేదము మూర్తీభవించిన పవిత్రత-ప్రకాశమును శ్రీ గా పరిగణించిమ్నది.

  ఆకలి-దప్పులు,శోకమనోవ్యథలు-జరా-మృత్యువులు అను షడూర్ములను తొలగింపచేయు శక్తిస్వరూపిణిగా కీర్తిస్తున్నది.

  సర్వసమృద్ధ సంకేతముగాపశువులు-పంటలు-పంచభూతములు-ప్రకృతి-వికృతులుగా ప్రస్తుతింపబడిన శ్రీ అను శక్తిని,సాకారా అర్చనకై ఉపనిషత్తులు లక్ష్మీ స్వరూపముగా అందించినవి.

  ఒకే పరబ్రహ్మము చేతనులచే శ్రీగాను/లక్ష్మీగానుభావింపబడుచున్నది.సూక్త సహాయముతో అర్చించబడుచున్నది.

  శ్రీసూక్తము 15 శ్లోకములతోను 14 ఫలసిద్ధి మంత్రములతోను అమరియున్నది.

  శ్రీసూక్త శ్లోకములు/మంత్రములు బీజము-శక్తి-కీలకములతో ప్రకాసిస్తుంటాయి.

  మంత్రసారమునందించు నాదము బీజము

  మంత్ర చైతన్యమునందించునది శక్తి

  మంత్ర నాదమునకు -మంత్రచైతన్యమునకు అనుసంధాన కర్త కీలకము అని ఋషిప్రోక్తము.

 

  శ్రీసూక్తమునకు  దేవత లక్ష్మీదేవి

  ఋషులు ఆనం-కర్దమ-చిక్లీత 

  అగ్నిని,


 మధ్యవర్తి  చేసుకొని, చేయు ప్రార్థనయే శ్రీసూక్త


 


 ఓ యజ్ఞ చైతన్యమా! ఓ జ్ఞాస్వరూపమైన జాతవేద! నా ప్రార్థనను అమ్మకు అందించి-అమ్మ అనుగ్రహమునన్ను చేరుటయే కాక శాశ్వతముగా ,నన్ను వీడకుండునట్లు 

 ' మహాలక్ష్మీచ విద్మహే విష్ణుపత్నీచ ధీమతి

   తన్నో లక్ష్మీ ప్రచోదయాత్" అన్న 

  లక్ష్మీ గాయత్రీ మంత్రము సర్వదా శుభములను అనుగ్రహిస్తూనే ఉంటుంది.

 "హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి."


 













TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...