Friday, January 12, 2024

TIRUPPAAVAI-29 PASURAM

 శాత్తుమరై పాశురము-29

******************
"ఆలకించనీయననదు నీ అనురాగపు ఆంతర్యము
ఆలసించగనీయదు అనుమతింప నిత్యకైంకర్యము"
మంగళప్రదమైన పాశురములో ఇష్టప్రాప్తి-అనిష్ట నిర్మూలనము ను స్పష్టము చేయించి ఇటు ఏడుతరములను-అటుఏడు తరములను స్వామి అనుగ్రహప్రాప్తులను (మన పూర్వీకులను-ఉత్తర వంశస్థులను) ఉద్ధరించుటయే కాక,రంగనాధుని అనుగ్రహమును పొంది-కొత్త పెళ్ళికూతురుగా ముస్తాబవబోతున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,వారనుగ్రహించనంతమేరకు (వింజామర) పాశురమును అనుసంధానము చేసుకునేందుకు ప్రయత్నమును చేద్దాము.
ఇరువది తొమ్మిదవ పాశురం
**********************
శిత్తం శిరుకాలే వందు ఉన్నై చ్చేవిత్తు ఉన్
పొత్తామరై అడియే పోత్తుం పొరుళ్ కేళాయ్
పెత్తం మేయ్ తుణ్ణం కులత్తిల్ పిరందు నీ
కుత్తేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు
ఇత్తైపరై కొళివాన్ అన్రుగాణ్ గోవిందా
ఎత్తెక్కుం, ఏళేళు పిరవిక్కుం ఉందన్నోడు
ఉత్తోమేయావోం; ఉనక్కేనాం,అత్చెయ్ వోం
మత్తైనం కామంగళ్ మాత్తు ఏలోరెంబావాయ్.
గోపికలు ప్రథమ పాశురము నుండి స్వామి పఱ ను తమకు అనుగ్రహిస్తాడని-దానిని స్వీకరించి నోమును నోచుకుందామని ప్రతిపాశురములో చెబుతున్నారు.
ఒక్కొక్క పాశురములో వారు ఆచార్యుల అనుగ్రహముతో ఒక్కొక్క విషయమును ఒక్కొక్క వస్తువులను బహుమతులుగా పొందుతున్నారు.సాక్షాత్తుగా మహాలక్ష్మి స్వరూపము సైతము వీరి పక్షమునకు వచ్చి స్వామిని అనుగ్రహించమంటున్నది.అంతే స్వామి సైతము వర్షములను-పాడిపంటలను-శంఖ -చక్రములను-నోమునకు కావలిసిన వస్తువులను,నోచుకొనువారికి కావలిసిన ఆభరనములను అనుగ్రహించాడు.వారు స్వామితో మేము నీ నుండి అర్థిస్తున్నది నీ సంశ్లేషణము.పఋఅ ను అనుగ్రహిస్తే కాదనము అని రాజీకి వచ్చారు.కాని విచిత్రము వారు ఇప్పుడు పూర్తిగా ఇన్నిరోజులు వారు స్వామిని అర్థించిన పరను కోరుటలేదు అంటున్నారు.మాకు అసలు పఱ వద్దంటున్నారు.కాని స్వామి బ్రహ్మీ ముహూర్తములోనే శుద్ధులమై నిన్ను సమీపించి,నీ పాదపంద్మములను కీర్తిస్తూనే,మాకు కావలిసిన దానిని నిశ్చయ జ్ఞానముగా (ఇంక ఏమీ మార్పు ఉండదు) అర్థిస్తున్నాము
కేళిరో-వినవలసినది.అంటున్నారు.
సంభ్రమాశ్చర్యములతో స్వామి వీరిని చూస్తున్నాడు.అయితే నేనిచ్చినవన్నీ కాక మరేదైనా మీరు నా అనుగ్రహముగా కావాలని అర్థిస్తున్నారా అని అడిగాడు.(అర్థమయినప్పటికిని)అదొక వేడుక.
అంతే అదే అదునుగా స్వామి నీవు జ్ఞానివని యోగులు ముక్తపురుషులు అనగా విన్నాను కాని అదంతవరకు నిజమో తెలియుటలేదు.మరొకసారి చెబుతాము విను.కాదనకు.ఇదే మా అసలయిన కోరిక.కన్నులార్పకుండా స్వామి వారిని కాంచుతున్నాడు.
"విను.నేను ఒకపరి కస్తురిని నీ నుదుటను అలంకరిస్తాను.ఊహు.తృప్తిగా లేదనకో.నేనే.ఒకపరి కస్తురి కుంకుమగా మారి నీ నుదుటను పరిమళిస్తూ-ప్రకాశిస్తాను.నీ సిగను చుదతాను.కాదుకాదు శిఖిపింఛమునవుతాను. కౌస్తుభమణి నవుతాను,కంకనముగా మారతాను.కాలి అందెనవుతాను.ఘల్లుమంటుంటాను.ముక్కెరనవుతాను.చక్కదనమునిస్తాను.నా సఖి వేణువవుతుంది.నేనుమోవి చేరతాను.మధువులు చిందిస్తాను.మాధవా అంటాను పీతాంబరమునై నిన్ను పొదవుకొంటాను.నేనొకసారి నా చెలులింకొకసారి మారి మారి నిన్ను చేరి మైమరచిపోతాము.హరిచందమవుతాము.అయీఅ .ఇంకా తనివి తీరటము లేదు.ఆగు కృష్ణా.స్వామి కొంచము సమయమునిస్తే అందరము కలిసి ఒకే ఒక సౌభాగ్యమును అర్థిస్తాము అన్నారు గోపికలు.ఏమనగలడు వారి ఎడదనెరిగినవాడు?కాదనగలడా? కామినుల వీడి కదలగలడా?కటాక్షించటమే కాని ఇతరము తెలియనివాడు.విస్తుపోతున్నాడు.అంటే అంటే
కాని మాకామితమును అడ్దగిస్తున్నదయ్య ఒకటి.దానిని నిశ్సేషముగా నిర్మూలించు.
మత్తైనం కామంగళ్ మాట్రు ఓ గోవిందా.
మా విష(య) వాసనలు అడ్దుకుంటున్నాయి.వాతిని మట్టుపెట్టు.అర్థమైనది
నిత్యకైంకర్య సేవాసౌభాయమును నిశ్చయమనముతో కోరుకుంటున్నారు మీరు అంతేనా అన్నాడు.
అంతే కాదు మాకే కాదు
ఎత్తెక్కుం, ఏళేళు పిరవిక్కుం -మా ముందరి ఏడుతరాలకు-మా అనతరపు ఏడుతరాలకు నిత్యకైంకర్య భాగ్యమును ప్రసాదించు అంటూ వారు
తాము ఏ విధముగా శ్రీనోముద్వారా నాలుగవ అవస్థలోని చేర్చిన స్వామిని స్తుతిస్తున్నారు.
మొదటిది యతనావస్థ.
******************
కోరికలను ప్రయత్నపూర్వకముగా నియంత్రించుకొనుట
పాలు తాగము-నెయ్యి తినము-కాటుకను అలంకరించుకొనము-పువ్వులను ముడుచుకొనము.కొండెములు చెప్పము అంటొ ఏమీ చేయవలెనో-చేయకూదదో తెలుపుతు పాటించుటకు చేయు ప్రయత్నము.
వ్యతిరేకావస్థ
**************
వదిలివేశామనుకుంటారు కాని వాటిఛాయలు కనిపిస్తుంటాయి తలపులలో-మాటలలో.
అదేవారు గోపికలను మేల్కొలుపునప్పుడు చేయు నిందారోపనములు-నీలాదేవిని అర్థించునపుడు స్వామిని అనుగ్రహించమనుట మొదలగునవి.
కేంద్రీకృతావస్థ
*********
లక్ష్యము పైననే మనసును-ఇంద్రియములను కేంద్రీకరించి స్వామిని ఆహ్వానించుట,గోకులక్షేమమునకై కర్తృత్వ భావమును వీడి కర్మాచరనమునందాసక్తిని చూపుట-సమాశ్రయణ సంస్కారములను అనుగ్రహించమనుట-భోగత్వమైన కూడారై ను ప్రస్తావించుట మొదలగునవి.
వశీకరణావస్థ
***************
ఇదియే నిత్యకైంకర్యానుగ్రహమను పరమావధిని గుర్తించి పరమాత్మను వేడుకొనుట.పఱను మించినది పరమాత్మ తత్త్వమని గ్రహించి చేతనుడు చైతన్యముగా మారుట.తానేకాదు తనవారినందరిని అనుగ్రహించమని సకలచేతనులను పరస్పరాశ్రితులుగా అనుగ్రహించుచున్న,నిత్యశుద్ధ విభూతి
"కస్తూరి తిలకం లలాటఫలకే
వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవ మౌక్తికం
కరతలే వేణుం
కరే కంకణం
సర్వాంగే హరిచందనంచ కలయం
కంఠేశ ముక్తావళి
గోపస్త్రీ పరివేష్ఠితుడైనాడు గోవిందుని,
రంగనాధునిగా పెండ్లికొడుకు చేయించు వేళ మనమ0దరము కనులారా కాంచుటకు తనతో పాటుగా మన చేతిని పట్టి తీసుకుని వెళ్ళుచున్న,
ఆణ్డాళ్ దివ్య తిరువడిగళే శరణం.
ఫోటో వివరణ అందుబాటులో లేదు.
లైక్
వ్యాఖ్య
షేర్ చేయి

TIRUPAVAI-PASURAM-28


 పాశురము-28తిరుపావై-పాశురము-28 ******************* " నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థం స్వశతశిరస్సిద్ధమధ్యాపయంతీ స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యా బలాత్ కృత్యభుంగ్తే గోదా తస్యై నమైద మివం భూయ ఏ వాస్తు భూయః". ప్రస్తుతా ప్రాభవ పాశురములో గోదమ్మ, "జ్ఞానత్రయముపాదేయం-యత్ అన్యత్ నకించన" అన్న సూక్తిని గోపిక-స్వామి సంభాషణము ద్వారా సంకీర్తిస్తున్నది. ఉత్పత్తి-నాశము-ప్రాప్తి-వికృతి-సంస్కారము అను ఐదు లక్షణములను కలిగిన కర్మ చేతనునికి అజ్ఞానమును తొలగింపచేసి ఆత్మజ్ఞానమును కలిగించలేనిది. ఆ కర్మము యొక్క రహస్యమును చేతనునికి తెలియచేయునది కేవలము జ్ఞానము మాత్రమే. ఆ జ్ఞానము మూడు మెట్లగా మారి చేతనునికి, స్వజ్ఞానము ప్రాప్తజ్ఞానము ప్రాపకజ్ఞానము అను ముఖ్య విభాగములై , నాదిఈ ఉపాధి- సమయపాలనము నా ఉపాధి లక్షణము స్వధర్మాచరణమే నా ఉపాధి ధ్యేయము అను మూడు మెట్లనెక్కిన తరువాత, ఏ వస్తువునైనను స్వరూప స్వభావములను తగిలించక సహజస్థితిని గుర్తించే సక్తిని పొందుతుంది. ఆ ప్రయానములో తాను తగిలించుకొని వచ్చిన జన్మసంస్కారములను నిర్వహిస్తూనే వానిని భగవత్ కైంకర్యముగా భావించగలుగుతుంది.బ్రహ్మమొక్కటే అన్న విశ్వరహస్యమును-మనకు వివరిస్తున్న , అమ్మ ఆండాళ్ కు-ఆళ్వారులకు అనేకానేక నమస్కారములు.దాసోహములు సమర్పించుకుంటూ, పాశురములోనికి ప్రవేశిద్దాము.

తిరుపావై-పాశురము-28 ******************* " నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థం స్వశతశిరస్సిద్ధమధ్యాపయంతీ స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యా బలాత్ కృత్యభుంగ్తే గోదా తస్యై నమైద మివం భూయ ఏ వాస్తు భూయః". ప్రస్తుతా ప్రాభవ పాశురములో గోదమ్మ, "జ్ఞానత్రయముపాదేయం-యత్ అన్యత్ నకించన" అన్న సూక్తిని గోపిక-స్వామి సంభాషణము ద్వారా సంకీర్తిస్తున్నది. ఉత్పత్తి-నాశము-ప్రాప్తి-వికృతి-సంస్కారము అను ఐదు లక్షణములను కలిగిన కర్మ చేతనునికి అజ్ఞానమును తొలగింపచేసి ఆత్మజ్ఞానమును కలిగించలేనిది. ఆ కర్మము యొక్క రహస్యమును చేతనునికి తెలియచేయునది కేవలము జ్ఞానము మాత్రమే. ఆ జ్ఞానము మూడు మెట్లగా మారి చేతనునికి, స్వజ్ఞానము ప్రాప్తజ్ఞానము ప్రాపకజ్ఞానము అను ముఖ్య విభాగములై , నాదిఈ ఉపాధి- సమయపాలనము నా ఉపాధి లక్షణము స్వధర్మాచరణమే నా ఉపాధి ధ్యేయము అను మూడు మెట్లనెక్కిన తరువాత, ఏ వస్తువునైనను స్వరూప స్వభావములను తగిలించక సహజస్థితిని గుర్తించే సక్తిని పొందుతుంది. ఆ ప్రయానములో తాను తగిలించుకొని వచ్చిన జన్మసంస్కారములను నిర్వహిస్తూనే వానిని భగవత్ కైంకర్యముగా భావించగలుగుతుంది.బ్రహ్మమొక్కటే అన్న విశ్వరహస్యమును-మనకు వివరిస్తున్న , అమ్మ ఆండాళ్ కు-ఆళ్వారులకు అనేకానేక నమస్కారములు.దాసోహములు సమర్పించుకుంటూ, పాశురములోనికి ప్రవేశిద్దాము.
" కానల గోవుల మేపుతున్నది జ్ఞానసంబంధములేనిది మా ఉపాధి
కానిల గోకులమ్మను జననసంబంధము ఉన్నది ఓ దయానిధి"
"స్వధర్మో- నిధనం శ్రేయః" అన్న ఆర్యోక్తిని నిరూపిస్తూ,పరంధాముని ప్రసన్నునిగా చేసుకొను సిద్ధోపాయమును సైతము అందించుచున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ అమ్మ అనుగ్రహించిన మేరకు పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.
నిన్నటి పాశురములో గోపికలు అర్థించినవాటిని స్వామి తప్పక అనుగ్రహిస్తాడన్న విశ్వాసముతో వారు భావనావీధులలో బాహ్యమును మరచి భగవదానుభవమును ఆస్వాదిస్తున్నారు.
"కన్నని చూచునొక్కతె-కనుసన్నల దాచునొక్కతె
బింకముపోవు నొక్కతె-బిగి కౌగిట దాచునొక్కతె
జలమును చల్లు నొక్కతె-జలజంబును తురుమగ కోరునొక్కతె
దరహాసము చేయుచు దాగునొక్కతె-దరిచేరగ పిలుచు నొక్కతె
పరిహాసముచేయుచు నొక్కతె-పర్యంకమున పరుండబెట్టొకతె
తనవాడే-తనవాడే -తనావాడేననుచును తాదాత్మ్యము తోడుగ
పరవశులైన పడతులతో -పలు-పలు లీలల ప్రకటనములతో
యదుకులభూషణుని పొదివిన యమునాతటి ఎంతటి
భాగ్యశాలియో
రసరమ్యతనొంది తరించెను రమణీరమణుల రాసలీలలన్."
ఇరువది ఎనిమిదవ పాశురం
*********************
కరవైగళ్ పిన్శెన్రు కానం శేరిందు ఉణ్బోం
అరివొన్రుం ఇల్లాద అయ్ కులత్తు ఉందన్నై
ప్పిరవి పెరుందనై పుణ్ణియం నుం ఉడైయోం
కురైవొన్రుం ఇల్లాద గోవిందా! ఉందన్నోడు
ఉరవేల్ నమక్కు ఇంగు ఒళిక్క ఓళియాదు !!
అరియాద ప్పిళ్ళైగళోం! అంబినాల్ ఉందన్నై
చ్చిరుపేర్ అళైత్తనవుం శీరి అరుళాదే
ఇరైవా! నీ తారాయ్ పరై ఏలోరెంబావాయ్.
అలా హాయిగానున్న వారిని మనకొరకు బహిర్ముఖులను చేసినది స్వామి అనుగ్రహము.మీరడిగినవి ఇస్తే నోమునకు తరలివెళతామన్నారుకదా ఇంకను ఇక్కడే ఉన్నారేమిటి? అని ప్రశ్నించాడు స్వామి.
స్వామిని కనులారా చూస్తూ,
ఓ అంబినాల్-ఓ ప్రేమమూర్తి,
శీరి అరుళాలే-కినుక వహించకయ్యా
అది నీ స్వభావమునకు సరిపడదు అని బుజ్జగించారు.
చిరునవ్వుతో స్వామి అయితే మీరింకా ఇక్కడే వేచియుండుటకు కారణము నేనేనా? అని అడిగాడు చమత్కారముగా.
అదే స్వామి మీరు మాకిస్తానన్న "పఱను" అనుగ్రహిస్తే నోముస్థలికి వెళ్ళిపోతాము,అన్నారు అదే వాక్చమత్కారముతో.
ప్రసన్నుడైన స్వామి మరింత వారిని పరీక్షిస్తూ,
పఱను మీకు ఇవ్వాలంటే మీరెవరో,ఏమిచేస్తుంటారో,తీసుకునే అర్హులో-కాదో నేను తెలుసుకోవాలి కదా.కనుక మీ- పాండిత్యమును-మీ నేర్పరితనమును- ప్రత్యేకతలు వివరించండి అన్నాడట.
దానికి వారు మేము,
" అరియాద పిళ్ళైగళుం" -అజ్ఞానపు గొల్లపడుచులము
మేము ఏ జ్ఞానమును సముపార్జించలేదు .చదువులేదు.
ప్రతిరోజు,
కరవైగళ్ పిన్నెన్రుం-పశువుల వెనుక,గోవులవెనుక
కానం శేరిందు-అడవులకు/వనములకు వెళతాము.
గోవులే మా గురువులు.కనుక మేము వాటివెనుక నడుస్తు అనుసరిస్తాము.అలా అడవులలోనికి వెళ్ళి,అక్కడ మేత మేస్తున్నప్పుడు,మేమును మా చద్దిమూటను విప్పి ఉణ్పోం-తింటాము.అంతే కాని స్నానజపతపములు అనుష్ఠానములు మాకు తెలియవు.అన్నారు.
కాని వారు స్వామికి అందించిన సందేశము వేరు.
ఇది బాహ్యార్థము.కొంచము పరిశీలితే గోవులు-వేదములు వానిని అనుసరించుట , అలా అనుసరిస్తూ అరణ్యమును చేరుట వేదాంతసారమును-ఉపనిషత్తులను తెలిసికొనుట.అక్కడ చద్దితినుట అనే "ఉణ్పోం" వాటి సారగ్రహణమును చేయుట.
అనగానే అయితే మీరు గోధూళి స్నానమును చేసి,వేద-వేదాంత సార గోష్ఠులను సలుపుతారన్న మాట అన్నాడు స్వామి ఒప్పుకోక తప్పదు అంటూ.ఆశ్రిత పక్షపాతము కదా.అన్నీ మంచిలక్షణములు గనే భావించుకుంటుంది.
వారి భక్తిని మరింత లోకవిదితము చేద్దామనుకున్నాడేమో స్వామి,అదిసరే కాని,
మీరు అడవికి ఆవులను తీసుకుని వెళ్ళేటప్పుడు ఏమైన దేవాలయములను-ముని ఆశ్రమములను దర్శించి, సేవించారా అని అడుగుతావేమో? లేదా ఏదైనా మంత్రమును జపించారా? అని అడుగుతావేమో? లేదా యంత్రములను స్థాపించారా? అని అడుగుతావేమో.అవన్నీ సాధ్యోపాయములు.అవి కొందరికే సాధ్యములు.మేము కేవలము మా కులవృత్తిగా ఆవులను మేపుట పాలుపితుకుట మా జీవనమునకు చేస్తాము కాని ఇంకేమి శాస్త్రములు-స్తోత్రములు మాకు రావు.
మరి నేనిలా మీకివ్వగలను పఱను కుదరదే అన్నాడట వారి సమాధానమునకై ఎదురుచూస్తూ.
మాకు తెలుసులే పరమాత్మవైన నిన్ను మేము,
అరమిల్లై,అరైవొన్రుమిల్లై,అరైవొ న్రుం ఇల్లై,
కర్మజ్ఞానములేదు-భక్తిజ్ఞానములేదు- వైరాగ్యజ్ఞానములేదు.
చిన్న చిన్న పేర్లతో పిలిచాము అని నీకు మామీద మంచి అభిప్రాయము లేదు .మాచే ఆ విధముగా నిన్ను పిలిపించినది,
మా అజ్ఞానమో .నీవనుగ్రహించిన చనువో "గోవింద " అని పిలిపించినది.
ఓ ఇరవా-ఓ ఇహపరదాయకా
కురైవొన్రు ఇల్లాద-మాకొచ్చిన కొరత ఏమీలేదు లేదు.అన్న వారిని చూచి
నేనును మీ వలెనే గోకులములో జన్మించినాను కదా.గోవులను మేపుచున్నానుకద.మీతో ఆడి-పాడుచున్నానుకదా.నన్ను గోవింద అని పిలుచుట తప్పేమి కాదులే అన్నాడట.
పుణ్యమేదైనా అర్హతగా పొందియున్నారా మీరు పఱను పొందుటకు అని అడిగాడట స్వామి.
అవకాశమును అందిపుచ్చుకుని,
మేము చేసుకున్న పుణ్యమేగా నిన్ను గోకులములో జన్మింపచేసినది.
"ఉందన్నై పిరవి" నీ వు గోకులములో మాతో పాటుగా జన్మించుటచే మాకును-నీకును విడదీయరాని (జన్మభూమి)అను
ఇంగుం ఒళిక్కిఒళియదు-అవినాభావ సంబంధమను జనన సంబంధమును ముడివేసి,మమ్ము సిద్ధ పుణ్వశీలురుగా మార్చినది.అదియే నిన్ను సేవించుకొనుటకు,నీ అనుగ్రహమును పొందుటకు మాకు ప్రాప్తించిన అర్హత అని విన్నవించుకున్నారు..
మేము ఏమీ చేయలేదు అని అమాయకముగా చెప్పుతున్నప్పటికి బాహ్యమునకు,మేము కర్తృత్వ భావనతో చేయుటలేదు అను తత్త్వ రహస్యమును తెలియచేస్తున్న గోపికల వెంటనున్న,
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
ఫోటో వివరణ అందుబాటులో లేదు.
లైక్
వ్యాఖ్య
షేర్ చేయి

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...