Tuesday, October 5, 2021
INTRODUCTION KAAMAAKSHI TAAYI
" శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయేత్"
భగవత్స్వరూపులారా! నమస్కారములు.
వాచక-కాయక-మానసిక పాపశేషములు జీవులను జన్మ అనే గుంజకు కర్మ అనే పాశముతో కట్టి,జనన-మరణ చక్రములో దారి-తెన్ను లేక తిరుగుతుండేలా నిర్దేశిస్తాయి.అమ్మలకన్న అమ్మ తన అవ్యాజకరుణతో (కరుణించుటకు మనకు ఏ అర్హత లేనప్పటికిని)మనలను ఉధ్ధరించుటకొక ఉపాధిని అనుగ్రహించి,మన కదలికలను ధర్మబధ్ధముగా జరుపుతు,మనలో మార్పులు తెస్తూ-తెస్తూ,ఏ మార్పులేని స్థితిని చేరుస్తుంది.పాశములను తొలగించివేసి,పశుపతితో/పశుపతిలో పరవశమయే భాగ్యమును ప్రసాదిస్తుంది.
తల్లి నిర్హేతుక కృపాకటాక్షమేమో,ఏ మాత్రము పట్టులేని నా చేతిని పట్టుకుని, ద్రవిడభాషా శిరోభూషణములైన కామాక్షి అమ్మ విరుత్తము-నటరాజ పత్తులను స్పూర్తులుగా అనుగ్రహించి,ప్లవ నామ సంవత్సర దేవీ సరన్నవరాత్ర పుణ్యసమయమున, తమిళము నా మాతృభాష(తాయి మొళి) కాకపోయినప్పటికిని,వాటి అద్భుతానుగ్రహములను అందరికి పంచవలెనను చిన్న కోరికను నా మనసులో చిగురింపచేసి,
" కామాక్షి-కామదాయిని" అను తెలుగు భాషారూపమును ప్రసాదించినది.నా ఈ దుస్సాహసమును మన్నించి,దీనిలో, నా అహంకారము చొచ్చుకుని చేసిన భావలోపములను-భాషాదోషములను సవరించి,నన్ను ఆశీర్వదించగలరని ప్రార్థన.
భక్తునకు-భగవతికి గల అనుబంధమును-అనుగ్రహమును చాటు ద్రవిడభాషా స్వేచ్చా భావ సంకీర్తనా సంప్రదాయములలోనిది విరుత్తము.రాగ-తాళ నిర్దిష్టత లేని కారణమున ,భక్తుని భావోద్వేగములను ప్రతిబింబిస్తూ,భగవతిని-ప్రశ్నిస్తూ-పశ్చాత్తాపపడుతూ,నిందిస్తూ-తనను తాను మందలించుకుంటూ,పరిపరి విధములుగా ప్రకటింపబడుతూ,ఫలితముగా పరమపదమునందిస్తుంది.ఇది కామాక్షి తాయి కరుణ.
కామాక్షి అమ్మ విరుత్తము ఆశువో-వ్రాసినది తెలియదు.
వ్రాసినవారి వివరములు తెలియదు.
అమ్మను అడిగే హక్కే కాదు,అమ్మలో దాగిన అయ్యను ప్రశ్నిస్తూ"నటరాజ పత్తు" పేర మనకు అందించిన శ్రీ మునుస్వామి మొదలియరు అవర్గల్ కు,అజ్ఞాత అవర్గల్కు (జ్ఞాత-అజ్ఞాత కవులకు) సభక్తిపూర్వక నమస్కారములతో,
మీ సోదరి,నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.
Subscribe to:
Posts (Atom)
TANOTU NAH SIVAH SIVAM-12
తనోతు నః శివః శివం-12 ***************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...