Monday, September 21, 2020

PRAPASYANTEE MAATAA-06

ప్రపశ్యంతీ మాతా-06 ******************* యాదేవి సర్వ భూతేషు ఛిన్నమస్తక రూపేణ సంస్థితా నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః. పనసపండు ముళ్ళతో మనకు దర్శనమిస్తుంది.తొనలు చూస్తే మధురమే.సీతాఫలము కళ్ళతో కనిపిస్తుంది కాని లోపల మధురమే.రూపము కొంచము ఇబ్బంది కరముగా నున్నప్పటికి అర్థము చేసుకోగలిగితే ఇష్టమైనదే అవుతుంది.తేజస్సును రేణువులుగా విభజించి కాంతిసంవత్సరమును (మిల్కి వే) సృష్టించి,అది అథోముఖముగా పయనించుటకు మార్గమును ఏర్పరచి,స్థూల విశ్వము దానిని గ్రహించుటకు తన కట్లను విప్పుకుని పైపైకి ఎగబాకి అమృతధారలను తాను ఆస్వాదించుటయే కాక అఖిలజగమును అమృతమయము చేయించగల శక్తి ఛిన్నమస్తక దేవి.తల్లి వర్గీకరణను నాడీవ్యవస్థ ద్వారా మనకు పరిచయము చేయుచున్నది.యుక్తాయుక్తముతో కూడినది ఈ వర్గీకరణ.పైనుండి కురియుచున్న అమృతధారలను అందుకోవాలన్న-ఆస్వాదించాలన్న పైకెగిరి పట్టుకోగలగాలి.విశ్వము అమృతమయము కావాలంటే నిరోధములు లేని నిచ్చెన వంటి ఊర్థ్వ మార్గము కావాలి.పట్టు తప్పకుండా ఉండాలి లేకుంటే పడిపోవుటయే కదా.అందులకు విశ్వ మార్గము వజ్రాయుధము వంటి గట్టితనమును కలిగియుండాలి.పైన పట్టుకోగలవారుండాలి అందుకే తల్లి తేజోశక్తిని రశ్ములుగా కిందకు జారుటకు వీలుగా చేసి తద్వారా పైకి ఎగిరి పట్టుకునే ప్రయత్నము చేయుచున్న వాటికి ఫలితమునందించుచున్నది .నింగి-నేలల రాకపోకలకు నిచ్చెనగా తన శక్తినుంచినది.అంతేకాదు భూసారములను సౌరశక్తులు గ్రహించునట్లు మార్గమునేర్పరచినది.మాయ చుట్టుముట్టిన సమయమున తల్లి దానిని వేరుచేసిచూపుతుంది.దానివలన సత్యము నిత్యమై నిండుదనమును సంతరించుకుంటుంది.అమృతపానము చేసి,అమ్మ శక్తిని చాటుతుంది.ఆ మాయను తొలగించుకొనుటయే శిరము నుండి కపాలమును వేరుచేసుకొనుట.అట్లు విడివడిన సమయమునందును తల్లి స్వయం సమృధ్ధయై తన మీదనే కాక డాకిని-వర్ణిని)తన పక్కన ఉన్న రెండు శక్తులమీదను అమృత ధారలను అందించగలదు.దీనిని "మధు విద్య" అంటారు.మధువిద్య యైన తల్లి స్థూల ప్రపంచ కుండలిని ద్వారా శీర్షము నుండి కపాలమును ఛేదించుకొని,బ్రహ్మాందమంతా వ్యాపించియున్న దేవయాన మార్గము ద్వారా ఏకత్వము చెందుతుంది.అప్పుడు విశ్వము-విశ్వేశ్వరి అను రెండు నామరూపములుండవు.విశ్వమే విశ్వేశ్వరి.విశ్వేశ్వరియే విశ్వము.ఏకం అద్వితీయం బ్రహ్మం గా మారుతుంది.సత్వగుణ సంపన్న శుష్మ్న నాడిగా తల్లిని కనుక భావించినట్లయితే పక్కనున్న రెండు శక్తులు రజో-తమోగుణముల ప్రతీకలనుకోవచ్చును. సూక్ష్మ పరిశీలనకు వస్తే తల్లి మన నాడీమండలము లోని వెన్నెముక.సుషుమ్న నాడి తన పక్కన ఇడ-పింగళ అను రెండు నాడులను కలుపుకొని,మార్గములో వచ్చే చక్రాలలో ఉన్న బ్రహ్మ-విష్ణు-రుద్ర గ్రంధుల ముడులను విప్పుకుంటూ పైపైకి పాకి అసత్యమైన ఐహికమును-సత్యమైన ఆధ్యాత్మికత నుండి వేరు చేసుకొని,మాయ అను పొరతో కప్పుకొని యుండిన శిరము లోని నిత్యసత్యమను ఆత్మను తెరచి,అమృతపానము చేస్తూ ,అనిర్వచనీయానందములో మునిగి ఉంటుంది.సత్తు-అసత్తులను వేరుచేసి,స్వస్వరూపమును సందర్శింపచేయుచున్న చిద్విలాసిని ఛిన్నమస్తాదేవి.శరణు-శరణు. ధన్యోస్మి మాతా ధన్యోస్మి.

PRAPASYAMTEE MAATA-5

ప్రపశ్యంతీ మాతా-05 ******************* భగత్వ-రమణత్వ-వమనత్వముల మేలు కలయికయే భైరవీమాత.కాంటి భగత్వము-సౌందర్యము రమణత్వము-శక్తివంత చలనము వమనత్వము.ఉదయిస్తున్న అనంత సూర్యుల కాంతి సమూహమును భైరవిగా కీర్తించవచ్చును.భ అనగా కాంతి,ర అనగా శబ్దము.తేజోపూరిత శబ్దమే భైరవి శక్తి.అఖండ మేధా శక్తి.అనంత ప్రాణ శక్తి.విశ్వ పరిణామములను నిర్దేశించే విశేష శక్తి యైన తల్లిని జాగృత కుండలిని అని కూడా అంటారు.కుండలినీ శక్తి తటస్థ స్వభావముతో మూలాధార చక్రములో నిదురిస్తుంటుందంతారు.ఆ నిద్ర మన నిద్ర వంటిది కాదు.పరిసర జ్ఞానమును విస్మరించిన అపరిణత దశ.సస్వరూపమును స్వశక్తిని గుర్తించలేని మందత్వము.ఆ మందత్వమును తోసివేసి తన వేడిచే-వెలుగుచే కుండలిని తన చుట్లు విప్పుకుని,పైపైకి ఎగబాకి పరమాత్మ తో పరిచయము చేసే శక్తి.అంతే కాదు తల్లి దుర్గ అను నామముతో రెండు విధములైన దుర్గములను మనకు చూపిస్తూ,దేనిని మనముండుటకు ఎంచుకోవాలో తెలియచేసే శక్తి.అరిషడ్వర్గమనే ఎత్తైన గోడలు గలిగి మనలను బంధించు దుర్గమునకు దూరముగా ఉండి అవ్యాజ కరుణ-ఆశ్రిత వాత్సల్యము-ఆనందాబ్ధి మొదలగు ఎత్తైన గోడలతో కట్టబడిన అమ్మ దయ అనే దుర్గమును ఆశ్రయించవలెనను విషయమును వివరించు మేథాశక్తి. స్థూలగా గమనిస్తే తల్లి తన తన సక్తిని చలింపచేస్తూ దారులలోని ముళ్ళను-కుళ్ళును తొలగిస్తూ తొలగిస్తూ పంచ తన్మాత్రలను సూక్ష్మ స్థితిలో-పంచభూతములను స్థూల స్థితిలో పరిచయము చేస్తూ,వాటిని కలిపే వంతెనయై ప్రకాశిస్తుంటుంది. నింగి నేలకు నెయ్యమును కలిగించి,మధ్యలో తారసపడు శత్రువులను ఏ ఆయుధములను ఉపయోగించక,తన వెలుగు అనే ఖడ్గము ద్వారా తొలగించివేస్తుంది. సూక్ష్మముగా పరిశీలిస్తే నేను నిదురిస్తున్నప్పుడు తైజసాత్మికగా,మెలకువగా నున్నప్పుడు జాగరిణిగా,స్వప్నావస్థలో నున్నప్పుడు స్వపంతీగా నున్న ప్రాణశక్తివి నీవేకదా తల్లి.నీ శక్తి అందించే వేడివెలుగులతో నా తటస్థతను తోసివేసి,పంచేంద్రియ పాటవమును పెంపొందించి సహస్రా ప్రయానమునకు సన్నద్ధుని చేస్తున్నావు.అంతే కాదు అంతర్-బహిర్ శత్రు నిర్మూలనకు బాహ్యములో నున్న ఆయుధముల అవసరము లేదని,వాక్చాతుర్యము-సమయస్పూర్తి-సాత్త్విక సాధన-సత్ప్రవర్తన అను వివిధ జ్ఞాన ఖడ్గములను మాకొసగి,ఉపాయములనందించుచు,నా ఉపాధిలో నున్న నిన్ను కనుగొని-అనుక్షణము ఆరాధించనీ. ధన్యోస్మి మాతా ధన్యోస్మి.

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...