మీఢుష్టమ శివతమ-12
********************
న రుద్రో రుద్రమేచయేత్-రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించలేడు.దర్శించలేడు.
సాధకునికిఎదురుగా వేదవిజ్ఞానము వేచియున్నది.ఇందులో జ్ఞానము ఏది?జ్ఞేత ఏది? అనగా చూడబడునది ఏది? చూసేది ఏది?అంతా చూసేదేనా/చూడబడేదేనా? లేక జ్ఞాన-జ్ఞేతములకు సంబంధములేదా? ఈ నా సందేహమును ఎవరు తీర్చగలరు? ఎవరు వీటి సమన్యమును తెలుపగలరు?
దగాకోరు రుద్రుడు ఇదిగో ఇచ్చానంటాడు.మళ్ళీవస్తానంటాడు.నమ్మబలుకుతాడు.కిమ్మనకుందా ఆలకింపచేస్తాడు.అసలువిషయ విచారనకు కొసమెరుపు తానంటాడు.
ఇంగితమును కోల్పోయిన సాధకుడు ఇవాళ అటో-ఇటో తేల్చేయాలనుకుంటున్నాడు.అసహనముతో ఎదురుచూస్తున్నాడు
అసలు విషయ తీర్మానమునకై.సహకారమే తానైన సామి సాక్షాత్కరించాడు.
వేదసాక్ష్తాకరమన్నావు.మోదప్రదాయకమన్నావు.నమ్మాను నిన్ను.అన్నింటిని నాముందు ఉంచానన్నావు.అందుకో నీవు అన్నావు.అంతర్ధానమవుతావు.అంతలో అందకుండా చేస్తావు.ఆపు నీ ఆటలు.
నీకన్నా మా అమ్మ-నాన్నలే మేలుచేసారు.బువ్వపెడుతూ చందమామ రావే అంటు జాబిల్లిని పరిచయము చేసింది తొలిగురువై.అనుకరణను నేర్పుతూ అధ్యాపకుడైనాడు నాన్న మలిగురువై.
అంతా ఇచ్చానంటావు.నాదేనంటావు.నన్ను అయోమయముగా ఉంచుతావు.అజ్ఞానములో ముంచుతావు.
ఆవేశముతో నిందిస్తూ ఆగాడు సాధకుడు.రుద్రా నాకు ఇప్పుడు ఎవరి సహకారము కావాలో స్పురిస్తోంది.పంచభూత ప్రకృతి లోని పరమాత్మను దర్శింపచేయగల పరమగురువును కుడ నాకు అనుగ్రహించు.
రుద్రా! యంతాచమే-నాకు నియంతగా నన్ను నిర్దేశిస్తూ,నన్ను ఆవరించిన మాయముసుగును తొలగించే సమర్థవంతుడై ఉండాలి.
అలాగే కానీ.అంతేనా? మరి నే వెళ్ళిరానా? మందహాసముతో అన్నడు రుద్రుడు.
అంతేనా అంటే అంతేకాదు.ఆ గురువు ధర్తాచమే సకలమును శాస్త్రములను పోషించకలవాడై యుండాలి.
వారిని పంపిస్తా-వీరిని పంపిస్తా అని అరచేతిలో కైలాసమును చూపిద్దామనుకుంటున్నావో.అసలు నిన్ను వెళ్ళనీయను.వాళ్ళు-వీళ్ళు కాదు.సాక్షాత్తుగా నీవే నా గురువుగా మారి-శిష్యునిగా నన్ను పరమప్రీతితో స్వీకరించాలి.నన్ను సంస్కరించాలి.అన్నాడు ఆర్తితో సాధకుడు.
చాల్లే నీ వేళాకోళపు సంభాషణలు.చక్కని గురువుని అందిస్తాను అన్నాడు నర్మగర్భముగా దగాకోరు అన్నాడని దయార్ద్రహృదయుడై.
రుద్రా నీవొక వెలుగు.నేనొక చీకటి.చీటి ఉదయిస్తున్న వెలుగుతో పోరాడుతు వెలుగులో కలిసిపోతుంది.అలా కాకుందా వెలుగే చీకటిని అనుగ్రహించిందనకో దాని తనలో కలుపుకొని తేజోవంతముగా మారుస్తుంది.ఏ విధముగా చీకటి వెలుగు సౌజన్యముతో దానిలో కలిసి ధన్యత పొందుతుందో అదేవిధముగా నన్ను నేను తీర్చిదిద్దుకోనీ అంటు తన్మయత్వములోకి జారగానేతరలిపోయాడు రుద్రుడు తాత్సారము చేయకుండా.
అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.
కదిలేవి కథలు-కదిలిమ్హేది కరుణ.
ఏక బిల్వం శివార్పణం